కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 30 – కంస వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 29 – ముష్టికాసుర చాణూరుల వధ

తనకు కాపలా పెట్టుకున్న, కువలయాపీడం ఏనుగుని, మల్లయోధులను చంపిన తర్వాత, ఉన్నత వేదికపై కూర్చున్న కంసుడి సింహాసనం కంపించడం ప్రారంభించింది. కృష్ణుడు అతన్ని సంహరించటానికి సిద్ధపడ్డాడు. కృష్ణ అవతారం తీసుకున్న రోజు నుండి దీనికోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.

కంసుడు తన సైనికులకు “ఈ ఇద్దరు పిల్లలను మా రాజ్యం నుండి పంపించేసి; వసుదేవుడు, ఉగ్రసేనుడిని చంపండి” అని ఆజ్ఞాపించాడు. కృష్ణుడు త్వరగా కంసుని వైపు వెళ్ళాడు. కంసుడు తన ఖడ్గాన్ని లాగి కృష్ణుని పైకి దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణుడు అతని జుట్టు పట్టుకొని లాగి, అతనిపై కూర్చుని, గట్టిగా కొట్టి చంపేశాడు. కంసుని సోదరులు అతనిపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, కృష్ణుడు, బలరాముడు వారిని కూడా సంహరించేశారు. కంసుడు ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉండేవాడు, కృష్ణుని కృపతో భగవంతుడి రూపానికి సమానమైన అందమైన రూపాన్ని పొందాడు.

ఆళ్వార్లు, కృష్ణుని కంస వధని అనేక పాశురాలలో ఆస్వాదించారు. పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి లో “కరుత్తిట్టు ఎదిర్ నిన్ఱ కంజనైక్ కొన్‌ఱాన్” (కృష్ణుడు తనను ఎదిరించిన కంసుని లీలగా చంపినవాడు) అని చెప్పారు. ఆండాళ్ తమ నాచ్చియార్ తిరుమొళి లో “కంజనై వంజనైయినాల్ సేఱ్ఱవన్” (మోసంతో కంసుని చంపినవాడు) అని చెప్పింది. తిరుమళిసై ఆళ్వార్ తమ తిరుచ్చన్దవిరుత్తం లో “కంజనైక్ కడిందు” (కంసుని శిక్షించాడు) అని చెప్పారు. నమ్మాళ్వార్ తమ తిరువాయ్ మొళి లో “సాధు సనత్తై నలియుం కంజనైచ్ చాదిప్పదఱ్కు ఆధియంజోది ఉరువై అన్గు వైత్తింగుప్ పిఱన్దు” (దేవకీ, వసుదేవుడు వంటి సద్గుణులున్నవారిని బాధపెడుతూ ఉన్న కంసుని అణచివేయడానికి, పరమపదంలో ఉన్న తన ప్రాకృత దివ్య తేజస్సును కలిగి భగవాన్ అవతరించాడు) అని చెప్పారు.

ఈ సంఘటనలో సారాంశం:

  • భగవంతుడికి శత్రువులు ఉండరు, కానీ తన భక్తుల శత్రువులను తానే శత్రువులుగా చూసి వారిని నాశనం చేస్తాడు.
  • భగవంతుడు తన భక్తులను బాధపెట్టేవారిని కఠినంగా శిక్షిస్తాడు, వారిని అసహాయులను చేసి, తర్వాత సంహరిస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/06/krishna-leela-30-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment