చూర్ణిక 93
అవతారిక
జ్ఞానులు అయినవారు ఆళ్వార్ల స్వరూపమును శంకించుట అనునది ఆళ్వార్ల గొప్పతనము వల్లనే అని నాయనార్లు ఇక మీద వివరించుచున్నారు.
చూర్ణిక
ఇతుక్కు మూలమ్ యాన్ నీ యెన్ఴు మఴుతలైత్తు వానత్తు మణ్ మిశై మాఴుమ్ నికరుమిన్ఴి నిలైయిడమ్ తెరియాతే తెయ్ వత్తినమ్ ఒరువకైక్కొప్పాక ఇనత్తలైవన్ అన్దామత్తు అన్బుశెయ్య శేర్ న్దమైక్కు అడైయాళముళవాక ఉకన్దుకన్దు తిమిర్ కొణ్డాలొత్తు నాట్టియల్ వొళిన్దు శఠరయోట్టి మదావలిప్తర్ క్కు అఞ్కుశమిట్టు నడావియ కూత్తమాయ్ తీయనమరుఙ్గు వారామల్ కలియుకమ్ నీఙ్గి కితయుకమ్ పత్తి పట్టెళుపోతు అఴియాతిరున్ద ప్రభావమ్
సంక్షిప్త వ్యాఖ్యానము
ఈ సందేహమునకు గల కారణములు ఏమి అనగా
– ఆళ్వారు తాను గొప్పనా లేక భగవానుడా అని భగవానుడితో వాదించుట
– తనతోటి సమానులు అటు పరమపదములో కానీ ఇటు సంసారములో కానీ ఎవ్వరూ లేరు అని చెప్పుట
– నిత్యసూరుల సమూహము అంతా కలిసి తనతో సరితూగును అని చెప్పుట
– భగవానునికి పరమపదము యందు కలిగి ఉండు ప్రేమ కంటే ఆళ్వార్ల పైన గొప్ప ప్రేమను చూపుట
– భగవానుడు ఆళ్వారును స్వీకరించుటకు గల అనేక సంకేతాలు కనబరుచుట
– ఆ సర్వేశ్వరుని అనుభవించుచూ ఆనందములో మాట్లాడకుండా ఉండిపోవుట
– సంసారులతో అన్ని సంబంధములను తెంచుకొనుట
– వేదమును అంగీకరించని వారిని దూరముగా తోసివేయుట
– పిచ్చి ప్రవృత్తి కలిగిన వారిని నియంత్రించుట
– సంసారము పట్ల రుచిని లేకుండుట
– ఎట్టి దుఃఖములు దరి చేరనీయకుండా ఉంచుట
– కృత యుగమును కలి యుగములో ప్రవేశింపచేయుట
– పగలూ రాత్రీ అని తేడా తెలియకుండా ఆ భగవానుని అధ్యవసానములోనే ఉండుట
వ్యాఖ్యానము
ఇతుక్కు మూలము –
అనగా యుక్తులైన వారు “ఆళ్వారు పలానా వారు” అని ఈ విధముగా సందేహించుటకు గల కారణము –
యాన్ నీ యెన్ఴు మఴుతలైత్తు –
“పువియుమ్ ఇరు విసుమ్బుమ్”తో మొదలగు పెరియ తిరువందాది 75 లో నిత్య విభూతి మరియు లీలా విభూతి అను రెండూ నీ సంకల్పములో భాగమే; అట్టి గొప్ప సంకల్పమును కలిగిన నీవు న చెవిలో నుండి వచ్చి న మనస్సులో స్థిరముగా ఉన్నావు; ఈ విధముగా ఉన్నప్పుడు ఈ విభూతులను కలిగియున్న నీవు గొప్పా? లేక నిన్ను కలిగియున్న నేను గొప్పా? అని ఎవరికైన ఎలా తెలియును? అసాధారణ శక్తిని కలిగియున్న నీవు మాత్రమే దీనిని ఎరుగుదువు అని ఆళ్వార్లు చెప్పినట్టు ఉభయ విభూతి నాధునితో ఈ విధముగా వాదించుటకు గల గొప్పతనము ఆళ్వార్లు కలిగియున్నారు.
వానత్తు మణ్ మిశై మాఴుమ్ నికరుమిన్ఴి –
తిరువాయిమొళి 4.5.8 “యావర్ నిగర్ అగల్ వానత్తే”(నాతో సరితూగు వారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా?) అనియు తిరువాయిమొళి 6.4.9 “మాఴుళదో ఇమ్మణ్ణిన్ మిసైయే”(ఈ భూలోకములో నాతో సరితూగు వారు ఎవరైనా ఉన్నారా?”) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుని యొక్క ఉభయ విభూతులకు(ఐశ్వర్యమునకు), ఆయన సౌకుమార్యమునకు (కోమలత్వము) తగ్గట్టుగా సర్వేశ్వరుడై అవాప్త సమస్త కాముడై(అన్ని కామములు తీరిన వాడు) దేనికీ వికారమును పొందనివాడు ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులను(పాశురములు) వినడముతో కలిగిన సంతోషము వలన ఉప్పొంగునట్లు తిరువాయిమొళిని పాడునట్టి గొప్పదైన నాలుక యొక్క పలుకులచే ఉభయ విభూతులలో తమతో సరితూగగల వారు లేని వారై.
నిలైయిడమ్ తెరియాతే –
ఆళ్వార్లు ఏక కాలములో ఆ సర్వేశ్వరునితో సంశ్లేషము(కలసి ఉండుట), విశ్లేషము(దూరముగా ఉండుట) పదే పదే కలిగి ఉండుట చేత ఎల్లప్పుడూ సంశ్లేషాతిశయమును అనుభవించు నిత్య సూరులు మరియు ముక్త పురుషుల వంటి స్వభావము తనకి లేని వారై; కేవలము భగవానుని గుణాలే ధారకము , పోషకము, భోగ్యములుగా ఉండుట వలన అన్న పానీయాదులు మాత్రమే భోగ్యములైనట్టి సంసారుల వంటి స్వభావమునూ లేని వారై; ఉభయ విభూతులలో చెందని వారు అవ్వడము చేత తమ యొక్క ఆవాసము తెలియని వారై తిరువిరుత్తమ్ 75 “వైగున్దమో వైయమో నుమ్ నిలైయిడమే”(నీవు వేంచేసి యుండు స్థానము శ్రీ వైకుంఠమా లేక భూలోకమా!?) అని చెప్పడమైనది.
తెయ్ వత్తినమ్ ఒరు వకైక్కు ఒప్పాక –
తిరువిరుత్తం 23 “దేవ్యత్తు ఇనమొరనైయీర్ కళాయ్”(భోగ్యమైన పరమపదమునందు ఉండు నిత్యసూరుల వలె ఉన్న ఓ అమ్మాయిలారా!) అని చెప్పినట్టు కేవలము ఒకరో ఇద్దరో నిత్యసూరులు కాకుండా నిత్యసూరులు అందరూ ఒక చోట కలిసినప్పటికీ వారంతా ఆళ్వార్ల ఏదో ఒక విషయములో మాత్రమే సమానులగును.
ఇనత్తలైవన్ అన్దామత్తన్బు శెయ్య –
పెరియ తిరువందాది 25 “వానోర్ ఇనత్తలైవన్”(పరమపదమునందు ఉండు వారికి స్వామి) అని చెప్పినట్టు అసంఖ్యాకములైన నిత్యసూరులకు నాయకుడైన ఆ సర్వేశ్వరుడు వారి పట్ల ఉండు ప్రేమను ఆళ్వార్ల పైన ఉంచి తిరువాయిమొళి 2.5.1 “అమ్ దామతు అన్బు శెయ్దు”(పరమపదముతో అనుబంధమును కలిగి, సహజముగా శేషి అయిన ఆ సర్వేశ్వరుడు నా హృదయములో నిక్షేపముగా ఇమిడిపోయెను).
శేర్ న్దమైక్కు అడైయాళమ్ ఉళవాగ –
తిరువాయిమొళి 8.9.6 “తిరువరుళ్గళుమ్ శేర్ న్దమైక్కు అడైయాళమ్ తిరున్ద ఉళ”(ఆయన నుంచి పొందిన గొప్ప విషయములు దాచడానికి వీలుకానట్టుగా ఆమె యందు స్పష్ఠముగా గోచరించబడుచున్నవి) అని చెప్పినట్టు ఆమెతో ఆయన సంశ్లేషించి ఉండు చిహ్నములు ఆయన తాలూకు అంగీకారమును ఆమె స్వీకరించినట్లు ఇంకనూ స్పష్టముగా తెలియబడుచున్నవి.
ఉగన్దు ఉగన్దు తిమిర్ కొణ్డాలొత్తు –
తిరువాయిమొళి 6.5.4 “ఉగన్దుగన్దు ఉళ్ మగిళ్ న్దు కుళైయుమ్”(తన మనస్సులో గొప్ప ఆనందముతో అట్టి గుణములను అనుభవించుట చేత కలిగిన సంతోషము వలన తాను నీరసించిపోయెను) అనియు తిరువాయిమొళి 6.5.2 “తిమిర్ కొణ్డాల్ ఒత్తు నిఱ్కుమ్”(గర్వము వలన మౌనముగా ఉండిపోయెను అని అన్నట్టుగా) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుని సౌందర్యము, శీల గుణములను అనుసంధించుకొని అందరినీ నియంత్రించు ఆ భగవానుని దివ్య మంగళ విగ్రహమును పరిపూర్ణముగా అనుభవించునట్టుగా మిన్నకుండా(స్తబ్ధుగా) ఛాందోగ్య ఉపనిషత్తు “స్తబ్ధోస్యుత తమ ఆదేశమప్రక్ష్యః”(నీవు ఆ పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొంటివా? గర్విష్టి వలె ఎందుకు మౌనముగా ఉన్నావు?)ఉండిపోయెను.
నాట్టియల్ వొళిన్దు –
తిరువాయిమొళి 10.6.2 “నాట్టారోడు ఇయల్వు వొళిన్దు”(అహంకారముతో నిండియున్న సంసారులతో కూడి ఉండుటను తొలగించి) అని చెప్పినట్టు అహంకార మమకారాదులతో నిండియున్న సంసారులను త్యజించి పెరుమాళ్ తిరుమొళి 3.4 “ఉణ్డియే ఉడయే ఉగన్దోడి” (ఆహారము, వస్త్రముల కోసము పాకులాడు ఈ లోకములోని మనుషులు) అనియు తిరువాయిమొళి 2.9.9 “యానే ఎన్ తన్దే”(నేను మరియు నాది)
శఠరయోట్టి –
ఆయన శఠకోపులు కావడము చేత (తన కోపముతో శఠ అను వాయువును పారత్రోలిన) మను స్మృతి 12.106 “వేద శాస్త్ర విరోధినా”(వేద శాస్త్రమునకు లోబడి ఉండక)బాహ్యులు (వేదములను తిరస్కరించువారు) మరియు కుదృష్టులు (వేదమును అంగీకరించి తప్పుగా అర్ధములను చెప్పు వారు)తటస్థముగా ఉండి వేదానికి అనుగుణముగా ఉండే తర్కము ప్రకారము అంశములను చెప్పుటకు బదులుగా వారి బుద్ధికి తగట్టుగా గోచరించు కూతార్కికముగా తమ సొంత భాష్యములను స్థాపించుటకు ప్రయతించెదరు. అట్టి వారు వేదాంతము యొక్క సారమైన ఆళ్వార్ల వాక్కుల చేత తరిమివేయబడినారు.
మదావలిప్తర్ క్కు అఞ్కుశమిట్టు –
ఆయన పరాంకుశులు కావడము చేత తన వాక్కులు మరియు ఉపదేశములను ఒక కొక్కెములా పెట్టి గొప్ప కుల మదము, ధన మదము, విద్యా మదము అనబడు మూడు మదములను కలిగినట్టి మదగజముల వంటి వారిని నియంత్రించి “విద్యామదో ధనమదః తృతీయోభిజకోమదః ఏతే మదావలిప్తానామ్”(విద్య, ధనము మరియు కులము వలన కలుగు గర్వము అహంకారమును కలిగించును) వారు వినమృలు అయ్యేట్టు చేయును.
నడావియ కూత్తమాయ్ –
తన దృష్టిలో పడిన వారికి ఆళ్వార్లు వారి సంసార బంధనానికి మృత్యువు వంటి వారై తిరువిరుత్తం 6 “పఴవరైన్ పాగన్ మదన సెన్గోల్ నడావియ కూత్తమ్”(తన వేగముతో ప్రేత శక్తులను నిర్వీర్యము చేయు గరుత్మంతునికి భోగ్యుడైన ఆ సర్వేశ్వరునికి చుట్టమైన మన్మధుని ఆజ్ఞతో ఈ లోకము సాగును) అని అన్నట్టు అందరిలో తిరువిరుత్తం 90 “నిన్ కాన్ వేట్కై ఎళువిప్పన్”(నీ పట్ల కోరికను ఈ సంసారుల మనస్సులలో కలిగిస్తాను)అని అన్నట్టు వేదము ద్వారానే తెలియబడు వాడు అనడానికి గుర్తుగా వేదమయుడు అయిన గరుత్మంతుని పైన స్వారీ చేయువాడైన ఆ సర్వేశ్వరుని పట్ల భక్తిని పెంపొందించును.
ఇంత వరకు పైన చెప్పబడిన గొప్పతనమే కాకుండా ఇంకనూ
తీయన మరుఙ్గు వారామల్ –
తిరువాయిమొళి 5.2.6 “కొన్ఴుయిర్ ఉణ్ణుమ్ విశాది పగై పసి తీయన ఎల్లామ్”(ప్రాణమును తీసి శరీరమును నాశనము చేయు క్రూరమైన రోగము, శత్రుత్వము మరియు ఆకలి మొదలగు) అని చెప్పినట్టు ప్రాణము తీసి శరీరమును నాశము చేయు వ్యాధి, శతృ భయము, ఆకలి వంటి దోషములను మరియు సంసార బంధములగు అన్ని దుఃఖములకు కారణమగు పాపములు దరి చేరనివి అయ్యి పెరియ తిరువందాది 56 “వన్ తుయరై – మరున్గు – కణ్డిలమాల్”(ఎట్టి క్లేశములు నా దరి చేరనివై) అని చెప్పినట్టు
కలియుకమ్ నీఙ్గి కితయుకమ్ పత్తి –
తిరువాయిమొళి 5.2.3 “తిరియమ్ కలియుగమ్ నీన్గి”(చేతనుల లక్షణములను తలక్రిందులు చేయు కలియుగము) అనియు మహాభారతము “భవిష్యత్ అతరోత్తరమ్”(రానున్న కాలములలో వస్తువు యొక్క లక్షణములు తలక్రిందలగును) అని చెప్పినట్టు వస్తువు యొక్క లక్షణములను తారుమారు చేయు కలియుగము శ్రీ విష్ణుపురాణము 6.1.50 “కలౌ జగత్పతిం విష్ణుం సర్వ స్రష్టారమ్ ఈశ్వరమ్ నార్చయిష్యన్తి మైత్రేయ పాషండోపహతా జనాః”(ఓ మైత్రేయా! అన్ని జగత్తులకు స్వామి, అంతటా ఉండి నియంత్రించువాడైన ఆ శ్రీమన్నారాయణుని కలియుగములో ఘోరమైన పాపములతో పాడైపోయిన మనుషులు పూజించరు)అని చెప్పినట్టు భగవానుని పట్ల రుచి కలుగుటకు గల విరోధము సమసిపోయి తిరువాయిమొళి 5.2.3 “పెఴియ కిత యుగమ్ పత్తి” (యుగ సంధి లేకుండా ఒకే యుగము లాగా అనిపించు కృత యుగము ఆరంభమైనది) అని అన్నట్టు పరిపూర్ణముగా వైష్ణవ ధర్మము వర్ధిల్లి తక్కిన యుగములు మారకుండా కృత యుగమే స్థిరముగా ప్రవేశించినట్లుగా
పట్టెళుపోతు అఴియాతిరున్ద ప్రభావమ్ –
తిరువాయిమొళి 2.4.9 “పట్ట పోదు ఎళు పోదు అఴియాళ్ విరై మట్టు అలర్ తణ్ తుళాయ్ ఎన్నుమ్”(సూర్యాస్తమయము మరియు సూర్యోదయమును తెలియనట్టిదైన పరాంకుశనాయకి (నిద్రలేమి మరియు మంచి నిద్ర నుండి మేల్కొనుట అనునవి లేకపోవుట వలన) మంచి తులసి యొక్క పరిమళము మరియు తేన అని అని ఆమె పరవశించి చెప్పినది) అన్నట్టు స్థిరముగా, తదేకముగా ఆ భగవానుని విషయమే అధ్యవసానము చేయుట వలన లోకములో సహజముగా మనుషులకు సూర్యాస్తమయము మరియు సూర్యోదయమునకు గల తేడా తెలిసినట్టు ఆళ్వార్లకి తెలియక శ్రీ రామాయణము అయోధ్యా కాండము 105.24 “నన్దన్తియుదిత అదిత్యే నన్దన్త్యస్తమితే రవౌ”(సూర్యుడు ఉదయించినప్పుడు అలానే అస్తమించినప్పుడు ప్రజలు ఆనందించినట్టు) అని చెప్పినట్టు సూర్యుడు ఉదయించినప్పుడు ధన సంపాదనకు సమయము ఆసన్నమైనదని సూర్యుడు అస్తమించినప్పుడు తమ ఇష్ట సఖులతో సుఖించుటకు సమయము ఆసన్నమైనదని ఆనందపడి అనియు శ్రీ విష్ణు పురాణము 1.17.62 “ప్రాతః మూత్ర పురిషాభ్యామ్ మధ్యాహ్నే క్షుత్ పిభాసయా సాయం కామేన పాత్యన్తే జన్తవో నిశినిద్రయా” (పగటి పూట మూత్రము, మలము మొదలగు వాటి వలన, మధ్యాహ్నము ఆకలి, దప్పిక వలన సాయంత్రము కామ వాంఛ వలన రాత్రి నిద్ర వలన జనులు యాతనకి గురి అగుదురు); ఈ విధముగా కాల ప్రభావము లేని పరమపదమునందు ఉండు వారి వలె ఆళ్వార్లకు ఈ లోకములోనే అట్టి గొప్పతనము కలిగినది.
“ఇతుక్కు మూలమ్” మరియు “ఇప్పడి ఇరున్ద ప్రభావమ్” అనునవి ఇక్కడ చెప్పిన అన్ని వాక్యములతో జోడించవలెను. దీనితో అంతకు ముందు వివరించబడిన సంశయమునకు [ఆళ్వార్ల స్వభావము] గల కారణము నాయనార్లు అందరికీ తెలియవచ్చేలా కృప చేయడము జరిగినది.
అడియేన్ పవన్ రామానుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-93-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org