ఆచార్య స్వాం తవక్తార మభిరామవరాభిదమ్
శృీకృష్ణ తనయం వందే జగద్గురు వరానుజమ్
శ్రీ వడక్కు తిరువీధిపిళ్ళై ల కుమారులు మరియు శ్రీ పిళ్ళై లోకాచార్యులనబడు వారి తమ్ములు , నమ్మాళ్వారుల హృదయమును ఆచార్య హృదయమను గ్రంధము ద్వారా ప్రకాశింపజేసిన శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనార్లను ఆశ్రయించున్నాను .
ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వ క్రమాగతమ్
రమ్యజామాతృ దేవేన దర్శితం కృష్ణసూనునా
శ్రీ వడక్కు తిరువీధి పిళ్ళై కుమారులగు శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనారులకు ఆచార్య పరంపరా ప్రాప్తమైన ఆచార్య హృదయమును సాక్షాత్కరించుకున్న వారిని ఆశ్రయించున్నాను.
పణవాళవణైప్పళ్ళిపయిల్ పవర్ క్కెవ్వుయిరుం
కుణపోగ మెన్ఱుకురుగైక్క దిపనురైత్తతుయ్య
వుణర్ వావినుట్ పొరుళొన్ఱుమఱియావులగఱియ
మణవాళన్ మాఱన్ మనమురైత్తాన్ వణ్ ముడుంబైవందే
బంగారు మణులతో ప్రకాశించుచున్న ఆదిశేషుని పై శయనించిన సర్వేశ్వరుడు శ్రియః పతి అయిన శ్రీ రంగనాథునికే ఈ జీవులు శేషభూతములని సాయించిన తిరుక్కురుగూర్ నంబి తాము స్వయముగా అనుభవించి ఈ లోకమునకు ద్రావిడ వేద పాశురముల ద్వారా అందించిన దివ్య ప్రబంధ సారమును (నమ్మాళ్వారుల హృదయమును) మహోన్నతమైన ముడుంబై అను వంశమున అవతరించిన శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనార్లు అనే ఆచార్యులు ఈ లోకములో బద్ధులై ఉన్న సంసారులకు పరమ కృపతో ప్రసాదించారు.
మాదవత్తోన్ మాఱన్ మనం గూఱుం మణవాళన్
తోదవత్తిత్తూయ్ మఱైయోరానపెర్ నీతియినా
లాంగవర్ తాళ్వేర్ పెరాయి మణవాళమునిప్
పూంగమలత్తాళ్గళ్ నెంజేపో
నిరంతరము భగవానుని అనంత కల్యాణ గుణములను అనుభవిస్తూ ఉండే నమ్మాళ్వారుల హృదయమును శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనార్ల ద్వారా పెఠ్ఱాఱ్ లకు ఉపదేశింపబడగా , వీరికి దాసులు గా ఉన్నమరొకరికి చేరి, ఆ దాసులు తిరునారాయణపురము లో వేంచేసివున్న శ్రీ ఆయి జనన్యాచార్యులను వారికి కృప చేసినారు .అట్టి ఆయి గారి నుంచి శ్రీ మణవాళ మహామునులకు చేరగా పరమ కారుణికులు అయిన మామునులు ఈ గ్రంధమునకు వ్యాఖ్యానమును అనుగ్రహించి దాని కీర్తిని ఈ లోకానికి తెలియజెప్పిరి. ఓ మనసా ! అట్టి మహనీయుల తిరువడి తామరములను(పాద పద్మములను)ప్రకాశింపజేయుము.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/22/acharya-hrudhayam-thaniyans-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org