ఆచార్య హృదయం – 1

ఆచార్య హృదయం

<< అవతారిక

అవతారిక (పరిచయము)

ఈ ప్రబంధమున మొదటి చూర్ణిక (సూత్రము) లో “హర్తుం తమ స్సదసతీ చ వివేక్తుమీసోమానం ప్రదీపమివ కారుణికో దదాతి తెనావలోక్య కృతినః పరిభుజంతే తం తత్రైవ కేపీ చాపలా శ్శలబీభవంతి” (అజ్ఞానమను చీకటిని తొలగించుటకు మంచి చెడ్డలను ఆలోచన చేసి తెలుసుకోవడం కోసం గొప్ప దీపం వంటి వేద ప్రమాణాన్ని భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. అదృష్టవంతులు ఆ దీపము తో భగవానుని తెలుసుకొని అనుభవించుచున్నారు. కొందరు మూర్ఖులు మాత్రం తెలుసుకోలేక ఆ దీపములోనే మిడతల వలే పడ నశిస్తున్నారు) అని శ్రీ రంగరాజస్తవం ఉత్తర శతకము లో శ్రీ పరాశర భట్టరు వారు చెప్పిన విధముగా సహజముగానే (నిర్హే తుకముగా) కృప చేయువాడగు సర్వేశ్వరుడు సంసారులు అయిన చేతనులకు ఆలోచించి తెలుసుకొనుటకు సాధనమగు వేదశాస్త్ర ప్రమాణమును కృప చేసిన విషయమును అనుగ్రహించుచున్నారు.

చూర్ణిక – 1

కారుణికనాన సర్వేశ్వరన్ అఱివిలామనిశర్ ఉణర్వెన్నుమ్ సుడర్ విళక్కేత్తి పిఱజ్గిరుళ్ మేల్ ఇరున్దనన్దా
వేదవిళక్కైక్కణ్డు నల్లదుమ్ తీయదుమ్ వివేకిక్కైక్కు మఱైయాయ్ విరిన్ద తుళక్కమిల్ విళక్కిల్ కొళుత్తిన ప్రదీపమాన కరైకళై నీర్మైయినాల్ అరుళ్ శెయ్దాన్

సంక్షిప్త వివరణ

పరమ కరుణగల సర్వేశ్వరుడు ఈ సంసారములో ని చేతనులకు జ్ఞానము అను దీపమును ప్రకాశింపజేయుటకు అజ్ఞానమును పోగొట్టుటకు, మంచి (పొందదగినది) చెడు (విడువదగినది)లను ఆలోచింపజేయు వివేకమును తెలుసుకొనుటకు వేదము అను దీపమును దర్శించుటకు ఆ సర్వేశ్వరుడినే ప్రతిపాదించు “అ” కారము నుండే విస్తరింపబడ్డ వేదశాస్త్రమును కృపజేసెను.

వ్యాఖ్యానము

కారుణికనాన సర్వేశ్వరన్

శ్రియః పతి పరమ కరుణగల వాడు మఱియు నిరంకుశ స్వతంత్రుడూను. దయ గలిగిన వాడు అయి స్వతంత్రుడు కాకపోతే తాను కోరుకున్నట్టు ఏమియూ చేయలేడు. అలానే కేవలము స్వతంత్రుడు(దయలేని వాడు) అయితే తన స్వాతంత్య్రము (సంకల్పము) ఈ చేతనులను సంసారమున ఉంచుటకు మఱియు మోక్షమును ప్రసాదించుటకు సమానమైనందున ఈ చేతనులను ఉజ్జీవింపజేయుటకు చేయు ప్రయత్నము ఫలించదు. అందువలన కృప తో కూడిన స్వాతంత్య్రమే సంసారములోని చేతనులన ఉజ్జీవనమున కై చేయు కృషి యే ఫలితమును ఇచ్చును. ఇలా ఉండగా “సర్వేశ్వర” అను శబ్దము శ్రియః పతి యొక్క నియంతృత్వమును తెలియజేయును(నియమిం చు వాడి – నియమింపబడు వాడి సంబంధము). లక్ష్మీ తంత్రమున “కృపాయొగాఛ్చశాశ్వతాత్” (ఎల్లప్పుడూ కృప కలిగిన వాడు అను కారణము) చేత “ఈ శేశితవ్య సంబంధాదనిదం ప్రధమాదపి” అని చెప్పడం చేత నిత్యమయిన ఈ శేశితవ్య సంబంధం పరమాత్మకి జీవునికి మధ్య ఉండు నియమించు – నియమింపబడు సంబంధం తెలుస్తోంది. అందువలన కృపా మఱియు ఈ సంబంధము (ఈ రెం డూ) చేతనుల ఉజ్జీవనమునకై ఆ సర్వేశ్వరుడిని ప్రవర్తింపచేయునట్లు తెలుస్తోంది. ఇక్కడ ముందు “కృప” ను తరువాత “సంబంధము” ను చెప్పడం చేత సంబంధం యొక్క విశిష్ఠత తెలుస్తున్నది. కావున ఈ చేతనులను తన విభూతి అని కృప తో తలచినందున ఈ సంసారములో వారు పడు బాధలను చూసి తట్టుకోలేక వారికి మోక్షము (మోక్షమున రుచి) ప్రసాదించుటకు ఎన్నో పాట్లు పడతాడు.

అఱివిలా మనిశర్

అజ్ఞానులైన జీవులు తిరుమాలై 13 “అఱివిలామనిశరెల్లామ్” అని చెప్పినట్టు “అంధతమ ఇవాజ్ఞానం” (అజ్ఞానమును అంధకారము తో పోల్చి) మఱియు “హర్తుం తమః ” అజ్ఞానము తమస్సు అను శబ్దము తో సూచించినట్లు. కావున అజ్ఞానాంధకారము వలన ఈ చేతనులు ప్రకృతి కి ఆత్మ కి గల తారతమ్యతను తెలుసుకొను వివేకము లేనివారై ఉన్నారు.

ఉణర్వెన్నుమ్ సుడర్ విళక్కేత్తి

మూండ్రామ్ తిరువందాది 94 “ఉణర్వెన్నుమ్ ఒళికొళ్ విళక్కేత్తి” (జ్ఞాన దీపమును వెలిగించితిని.) ఇరండాం తిరువందాది 1 “జ్ఞానాచ్ఛుడర్ విళక్కేత్తినేన్” (జ్ఞానముతో ప్రకాశించు దీపమును వెలిగించితిని) అని చెప్పిన విధముగా తైలము, ఒత్తుతో ప్రకాశించు దీపములో మురికి పేరుకున్నట్టుగా కాకుండా దేదీప్యమానముగా ప్రకాశించు జ్ఞానమని అర్థము. తనను ప్రకాశింపజేయుచూ ఇతర వస్తువులను కూడా ప్రకాశింపజేయు సామ్య స్వభావమును బట్టి జ్ఞానమను దీపముతో పోల్చబడినది.

పిఱజ్గిరుళ్ నీజ్గి

పెఱియ తిరుమొళి 5.7.3 “పిఱజ్గిరుళ్ నీజ్గిడ” (దట్టమగు అజ్ఞానాంధకారం పోయి) మఱియు పెరియాళ్వార్ తిరుమొళి 1.8.10 “పిన్ని వ్వులగినిల్ పెరిరుళ్ నీజ్గ” (తిరిగి ఈ లోకమున అజ్ఞానాంధకారం పోయి) అని ప్రసాదించినట్లు అజ్ఞానాంధకారం పోయి అని అర్ధము.

మేల్ ఇరున్దనన్దా వేదవిళక్కైక్కణ్డు

పెరియాళ్వార్ తిరుమొళి 4.3.11 “వేదాన్ద విరుప్పో రుళిన్ మేలిరున్ద విళక్కు ” (వేదాంత సారమునకు పైన ఉండు దీపము అయిన భగవానుడు) మఱియు పెఱియ తిరుమొళి 2.5.1 “నన్దా విళక్క ” (అవిఛ్చిన్నముగా ప్రకాశించు దీపము) అనియు తిరువాయిమొళి 4.7.10 “వేత విళక్కినై” (వేదమను దీపము) అని ప్రసాదించినట్లు వేదశాస్త్రము కంటే పైన ఉండువాడు, ప్రకాశించువాడు, నిత్యుడు, స్వయం ప్రకాశమగు జ్ఞానమును స్వరూపముగా కలిగి ఉండు వాడు వేదము ద్వారానే తెలిసికొనబడు వాడు. తిరువాయిమొళి 4.7.10 “ఎన్ తక్క జ్ఞాన క్కణ్గళాలే కణ్డు” (నాకు తగిన జ్ఞాన నేత్రములుతో చూసి) ఎంబెరుమానుని అట్టి జ్ఞాన నేత్రములతో దర్శించితిని.

నల్లదుమ్ తీయదుమ్ వివేకిక్కైక్కు

పెఱియ తిరువందాది 3 “ఇవైయన్ఱే నల్ల ఇవైయన్ఱేతీయ(ఇవి మంచివి, ఇవి చెడ్డవి) అని చెప్పినట్లు సత్ అసత్ వివేకము “సదసతేచ వివేక్తుమ్” (మంచి చెడుల యొక్క వివేకము). “నల్లదుమ్ తీయదుమ్ వివేకిక్కైక్కు” సామాన్యమగు మంచి చెడుల వివేకమును చెప్పును కానీ ఇక్కడ మంచియగు భగవద్విషయమును చెడుయగు సంసారమును ప్రతిపాదించుచున్నది, ఎందుకు అనగా ఇంతకు ముందే చెప్పినట్టు “నల్లదుమ్తీయదుమ్ వివేకిక్కై క్కు ” (భగవానుని దివ్య మంగళ విగ్రహ సాక్షాత్కారముతో మంచి చెడుల వివేకము), అట్టి వివేకము సంసారమును విడువుటకు మోక్షమును పొందుటకు దోహద(కారణము) పడుతున్నది. భగవానుని సాక్షాత్కారము తరువాతనే మంచి చెడుల వివేకము తెలిసినది అను దానికి అర్ధమేమనగా – భగవానుని సాక్షాత్కారము తరువాతనే ఈ సంసారమున ఉండు దోషములు బోధపడును, అందువలన రెండిటిని(భగవత్సాక్షాత్కారము, సంసారము) చూస్తే కానీ ఏది మంచి(పొంద తగినది) ఏది చెడు(విడువవలసినది) అనే వివేకము(దీని కంటే ఇది మంచిది, ఇది చెడ్డది అను ఇంగితము) కలుగదు.

మఱైయాయ్ విరిన్ద తుళక్కమిల్ విళక్కిల్ కొళుత్తిన ప్రదీపమాన కరైకళై

పెఱియ తిరుమొళి 8.9.4 “మఱైయాయ్ విరిన్ద విళక్కై ” (ఏ దీపము వేదముగా విస్తరించబడినదో) మఱియు తిరుచ్చంద విరుత్తమ్ 4 “తుళక్క మిల్ విళక్కు” (ఎట్టి విఘూతము లేకుండా ప్రకాశించే దీపము) అని చెప్పినట్టుగా “ఆకారోవైసర్వావాక్” (అ కారమే సమస్త శబ్దజాలము) అని ప్రతిపాదించుట చేత “అ” కారమే వేదములకు కారణము అవడం చేత ఆ “అ” కారమునకు ఒక కారణము లేకపోవుట వలన ఎట్టి విఘూతము లేదు. సకల అర్ధ ప్రకాశమగు “అ”కారము ఉత్పన్నమై దీపము నుండి వెలిగించిన దీపము వలెనే “మానం
ప్రదీపమివ” (దీపము వంటి శాస్త్రము) అని చెప్పినట్లు త్యాజ్యో పాదేయములును ప్రస్ఫుటముగ ప్రకాశింపజేయునట్టియు. పెఱియ తిరుమొళి 7.8.2 “పన్ను కలైనాల్ వేదం” (శాస్త్రములు అయిన నాలుగు వేదములు)అనియు పెఱియ తిరుమొళి 2.8.5 “కళైగళుమ్ వేదముమ్” (శాస్త్రములు, వేదములు) వేదములు మరియు వాటిని విస్తరింపజేయు (వివరింపజేయు) భాగములు. ఇక్కడ “వాచ్య వాచక
సంబంధం చేత” (శబ్దమునకు అర్థమునకు ఉండు సంబంధం) “అ”కారమును సర్వేశ్వరునిగా చెప్పబడినది. (అ కారము పరబ్రహ్మమైన విష్ణువును సూచిస్తుంది).

నీర్మైయినాల్ అరుళ్ శెయ్దాన్

నీర్మై – అతని స్వభావము. ఇక్కడ తన తాలూకు శేషిత్వ స్వభావమును బట్టి లేదా కృప అను స్వభావమును బట్టి కాని, లేదా పై రెంటినీ బట్టి కానీ కృప చేసినాడు అని అర్థం . ఇక్క డ చెప్పబడ్డ మూడు అర్థములలో మొదటి అర్థమగు “నీర్మైయినాల్” అను దానికి పూర్వాచార్యులు చేసిన వ్యాఖ్యానమునకు “ఇన్దువుతిరెత్తిఱిప్పు త్రైగుణ్య విషయమానవత్తుక్కు ప్రకాశకమ్” అని నాయనార్లు ప్రతిపాదించు దానికి సరిపోవును. ఇక రెండవదైన “కారుణికనాన” అని నాయనార్లు మొదట ప్రసాదించిన దానికి “కరుణికో దదాతి” అని భట్టరు వారు
ప్రసాదించిన దానికి సరిపోవును. మూడవదైన “కారుణికనాన సర్వేశ్వరన్” అని నాయనార్లు చెప్పిన రెండవ అర్ధమునకు సరిపోవును.

ఈ చూర్ణిక ద్వారా నాయనార్లు చేతనలగు సంసారులకు అజ్ఞానము పోయి సర్వేశ్వరుని సేవించి సత్, అసత్ అను వివేకము పొందునట్లు ఈశ్వరుడు శాస్త్రమును అందించిన విషయమును కృప చేసినారు.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-1-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment