ఆచార్య హృదయం – 6

ఆచార్య హృదయం

<< చూర్నిక 5

అవతారిక
ఈ అజ్ఞానము మొదలగు వాటికి గల కారణము ఏమి అడుగగా దానిని ఈ సూత్రమున వివరించుచున్నారు.

చూర్ణిక
ఇవత్తుక్కు క్కారణమ్ – ఇరణ్డిల్ ఒన్ఴినిల్ ఒన్ఴు కైకళ్

సంక్షిప్త వివరణ
ఈ జ్ఞాన అజ్ఞానములకు కారణము ఏమి అనగా ఈ రెండింటిలో ఏదో ఒక దాని లో మునిగి ఉండుట.

వ్యా ఖ్యానము
అనగా – అర్థపంచక జ్ఞానము లేకపోవుటకుగల కారణము రజో (ఇఛ్ఛ) మరియు తమో(అజ్ఞానము) గుణములను అధికముగా కలిగి ఉండుట. తిరుచ్చన్ధవిరుత్తం 68 “ముత్తిఴత్తునాణియత్తి రణ్డిలోన్దుకై” (సత్త్వ రజస్తమో గుణములు అనబడు మూడు గుణములలో రజో, తమో గుణములలో అభినివేశం కలిగి ఉండుట) అని చెప్పినట్లుగ మరియు అర్థపంచక జ్ఞానము కలిగియుండుటకు గల కారణము సత్వ గుణము అధికముగా కలిగియుండుట. తిరువెళుక్కు త్తిరిక్కై “ముక్కు ణత్తు ఇఴన్డవై అగత్తి ఒన్ఴినిల్ ఒన్ఴిన్ఴు” (సత్త్వ గుణముతో నే ప్రవర్తించుట, రాజో, తమో గుణములను విడువుట) అని చెప్పినట్లు రజో, తమో గుణములు అన్యధా జ్ఞానము(ఒక వస్తువును మరొక వస్తువుగా గ్రహించుట), మరియు విపరీత జ్ఞానము(ఒక వస్తువు యొక్క గుణవిశేషములను తప్పుగ గ్రహించుట) అను దోషములకు దారి తీయును, సత్త్వ గుణము యధా జ్ఞానమునకు(సరియైన జ్ఞానము)దారి తీయును.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/29/acharya-hrudhayam-6-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment