అవతారిక
సత్త్వ రజస్తమో గుణముల చేత బద్ధులైన చేతనుల పట్ల వాత్సల్యముతో ఆ సర్వేశ్వరుడు శాస్త్రములను బయలుపరచినప్పటికీ, తాను వారి రుచిని బట్టి ఫల సాధనములను ప్రసాదించునట్టి బంధక శాస్త్రములను కూడా చూపించినట్లైనచో వారు ఈ సంసారములోనే మునిగిపోవురు కదా? అను ప్రశ్నకి సమాధానముగా “అవి కూడా క్రమక్రమముగా వారి యందు మోక్షమున రుచిని తద్వారా మోక్షమునకు కారణములు కాగలవు అని నాయనార్లు చెప్పుచున్నారు.
చూర్ణిక
అతుతానుమ్ ఆస్తిక్యమ్ వివేకమ్ అన్య శేషత్వ – స్వస్వాతంత్య్ర నివృత్తి – పారతంత్య్రన్జ్గళై ఉణ్డాక్కిన వళి
సంక్షిప్త వివరణ
అది కూడా ఆస్తిక్య(ఆస్తికుడిగా మారుట), వివేక(మంచి చెడుల తారతమ్యములను తెలుసుకొను తెలివి), అన్య శేషత్వ నివృత్తి (ఇతరులకు శేషముగా లేకుండా ఉండుట), పారతంత్య్ర (సర్వేశ్వరుని పైనే పూర్తిగా ఆధారపడి ఉండుంట) ద్వారా ఆ సర్వేశ్వరుడే ఏర్పాటు చేసిన క్రమ పద్దతి లో భాగమే.
వ్యాఖ్యానము
అనగా – కేవలము ఆత్మ ఉజ్జీవనకరమగు శాస్త్రమును మాత్రము చూపించక, సర్వేశ్వరుడు శ్యేన విధి మొదలగు బంధకమునకు కారణమగు శాస్త్రమును కూడా చూపించుటకు గల కారణము ఏమి అనగా
– తమోగుణము ఆధికముగా ఉన్న వారికి, నాస్తికులకి, ధనాపేక్ష చేత ఇతురలని హింసించి ద్రవ్యమును(ధనమును) ఆర్జించు వారికి మోక్షమును తెలియజేసినచో వారికి అది రుచిగా ఉండదు(లేదా రుచించదు), అందుచేత ఆపస్తంభ సూత్రము “స్యేనేన అభిచరణ్ యజేత్” (ఇతరులకు హాని కలిగించే శ్యేన విధి) వారికి తెలియజేసి అని చెప్పినట్టు దాని ఫలితము వలన వారిని ఆస్థికులుగా మార్చి శాస్త్ర ప్రమాణమును వారి చేత తానే (ఆ సర్వేసురుడే) అంగీకరింపచేయును.
– అట్టి వాడు ఆస్థికుడు అయిన పిమ్మట ఆ సర్వేశ్వరుడు స్వర్గమును మొదలగు వాటిని పొందుటకు గల సాధనములను చూపించెను. “జ్యోతిష్టోమేన స్వర్గ కామో యజేత్” (స్వర్గమును పొందు కోరిక గలవారు జ్యోతిష్టోమ అను యాగమును చేయవలెను). దీని ద్వారా అట్టి వాడు ప్రకృతికి ఆత్మకి గల తారతమ్యములను ఆ సర్వేశ్వరుని సంకల్పము చేత తెలుసుకొనును.
– అలా ప్రకృతికి ఆత్మకి గల తారతమ్యములను తెలుసుకొనిన వాడికి ఆ సర్వేశ్వరుడే ఆత్మ భోగమునకు సాధనములను చూపును. దీని ద్వారా ఆ సర్వేశ్వరుని సంకల్పము చేత ఆత్మకు అన్యశేషత్వ జ్ఞానము కలుగును(సర్వేశ్వరునికి తప్ప వేరొకరికి శేషభూతముగ ఉండుట).
– అట్టి అన్యశేషత్వ జ్ఞానము ద్వారా భగవంతుని అనుభవించుటకు సాధనములైన భక్తి యోగమును తెలియచేయును. దీనితో స్వస్వాతంత్య్ర నివృత్తి కలుగజేయును.
– క్రమముగా అట్టి వాడు ఉపాయాంతరములను విడిచిపెట్టి స్వప్రయత్న నివృత్తి రూపమగు ప్రపత్తిని, పారతంత్య్రమును(స్వరూప యాధాత్మ్య జ్ఞానము) కలుగచేసి ఆ సర్వేశ్వరుడు ఉజ్జీవింపచేయును.
– పైన చెప్పిన విధముగా ఆ సర్వేశ్వరుడే చేతనుని ఉజ్జీవనమునకు ఒక క్రమ పద్దతి లో మార్గమును నిర్వహించును.
ఈ విధముగా 11 వ చూర్ణిక “ఇవై కిట్టనుమ్ వేట్టువాళునుమ్” నుండి ఇక్కడి దాక
– ఆత్మకు “అచిత్” తో కలుగు సంబంధము చేత సంసారమును, ఆత్మకు “అయన” తో కలుగు సంబంధము చేత మోక్షమును కలుగజేయును.
– ఈ రెండింటిలో “అచిత్” తో గల సంబంధము అనిత్యము, అయన” తో గల సంబంధము నిత్యము.
– సర్వేశ్వరునికి ఆత్మకి గల సహజమైన(శేష-శేషి) సంబంధమే శాస్త్ర ప్రకాశమునకు గల కారణము
– ఈ శాస్త్రములో కూడా కేవలము మోక్షమును సిద్ధింపజేయు శాస్త్రమునే చూపించక, సంసార బంధనమునకు కారణమగు శాస్త్రమును కూడా చూపించుటకు గల కారణము – సమస్త జీవములకు తాను తల్లియై మరియు చేతనుల రుచికి అనుగుణముగా ఉండుట చేత.
– క్రమముగా అట్టి బంధక శాస్త్రము చేతనునికి మోక్షమును ప్రసాదించును (క్రమ క్రమముగా).
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-15-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org