ఆచార్య హ్రుదయం – 19

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 18

అవతారిక
ఇప్పుడు(ఇక మీద) శాస్త్ర తాత్పర్యము(సారము)ను అనుసరించు ముముక్షువులు నడవడిక మరియు శాస్త్రమును అనుసరించు వారి నడవడికలు తెలుపుచున్నారు.

చూర్ణిక
శాస్త్రికళ్ తెప్పక్కైయరైప్పోలే ఇర్ణడైయుమ్ ఇడుక్కి ప్పిఴవి క్కడలై నీన్ద, సారజ్ఞర్ విట్టత్తిల్ ఇరుప్పారైప్పోలే ఇరుకైయుమ్ విట్టు కరైకుఴుకుమ్ కాలమ్ ఎణ్ణువర్కళ్

సంక్షిప్త వివరణ
శాస్త్రజ్ఞులు(శాస్త్రమును అనుసరించువారు) నదిని దాటడానికి ప్రయత్నించు వారిలా తమ రెండు చేతులతో ఈదునట్టు సంసార సముద్రమును ఈదుటకై ప్రయత్నించగా; శాస్త్ర తాత్పర్యమును అనుసరించువారు పడవ మీద కూర్చుని వెళ్లే వారి వలె ఎప్పుడు గట్టు(ఆవలి వడ్డుకు) చేరుతామా అని నిశ్చలముగా నిరీక్షించుదురు.

వ్యాఖ్యానము
అనగా,

శాస్త్రిగళ్
ఉపాసనను చెప్పు శాస్త్రమును అనుసరించేవారు శాస్త్రములో చెప్పినట్టు సర్వేశ్వరుని పొందుటకు మరియు సంసార సాగరమును దాటుటకు ఆ భగవానుని ఉపాసనమే హేతువు(సాధనము) అని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినట్టు “ఆత్మావా అరే దృష్టవ్యః, శ్రోతవ్యః, మంతవ్యః నిదిధ్యాసితవ్యః” (ఓ మైత్రేయా! భగవానుడు శాస్త్రము ద్వారానే వినవలసినది, తెలియవల్సినది, ధ్యానింపవలసినది) అనియు బృహదారణ్యక ఉపనిషత్తు “ఆత్మా ఇత్యేవ ఉపాసీత” (పరమాత్మను తన ఆత్మగా భావించి కీర్తించి, ఉపాసించునది) అనియు ముండకోపనిషత్ “ఓం ఇతి ఆత్మానాం ధ్యాయత” (భగవానుని ప్రణవముతో ఉపాసింపవలెను) అనియు భగవద్ప్రాప్తిని కలుగుజేయునట్టి భగవదుపాసనము ; భగవానుడే పోషకుడు అని శాస్త్రము చెప్పినట్టు ముండక ఉపనిషత్ “అమృతస్యైత సేతుః”(ఉపకారకుడు/పోషకుడు అయిన భగవానుడు మోక్షమును అనుగ్రహించగలడు) అనియు బ్రహ్మ సూత్రము 3.2.8 “ఫలమత ఉపపత్తేః” (ఫలమును భగవానుడే ఇచ్చును అని చెప్పుట సమంజసము).

తెప్పక్కైయరైప్పోలే ఇర్ణడైయుమ్ ఇడుక్కి ప్పిఴవి క్కడలై నీన్ద
నదిని ఈదు వాడు ఎలా అయితే తెప్పను ఒక చేతితో పట్టుకుని మరియొక చేతితో ఈదునో అలా స్వప్రయత్నమున దాని సాధ్యమగు భగవత్ కృపయును ఈ రెండిటిని అవలంబించుచు తిరువాయిమొళి 2.8.1 “పిఴవిక్కడల్ నిన్దువార్క్”(సంసార సముద్రమును ఈదు వారికి), ఈ సంసార సాగరమును ఈదుటకు ప్రయత్నించెదరు.

సారజ్ఞర్
స్వప్రయత్నము లేకుండా ఉజ్జీవించుటకు భగవానుడే ఉపాయమని ప్రతిపాదించు తిరుమంత్రము నందు అభినివేశము(జ్ఞానము) కలవారు.

విట్టత్తిల్ ఇరుప్పారైప్పోలే ఇరుకైయుమ్ విట్టు కరైకుఴుకుమ్ కాలమ్ ఎణ్ణువర్కళ్
లోకములో పడవను ఎక్కి ఆవలి వడ్డుకు చేరుటకు తమ ప్రయత్నముననూ, పడవనూ విడిచి “ఆ ఒడ్డుకు ఎప్పుడు చేరుదుమా!” అని నిరీక్షించుచూ పడవ పైనే కూర్చుని ఉన్నట్టు; విష్ణు ధర్మములో చెప్పినట్టు “విష్ణు పోతం”(విష్ణు అని పేరుగల పడవ) అను పడవ రెండు వొడ్డులను విస్తరించి(వ్యాప్తించి) ఉన్నది(శ్రీ వైకుంఠము మరియు సంసారము) అనియు సంసార సాగరమును దాటుటకు ఉపయోగపడునది అని నాచ్చియార్ తిరుమొళి 5.4 “వైకుందం ఎన్బదోర్ తోని”(వైకుంఠం అను పేరుగల పడవ) అన్నట్టు దానిని ఆశ్రయించి భగవానుని జ్ఞాన, శక్త్యాదులను అనుసంధించు కొనుట వలన స్వపారతంత్య్రాదులను అనుసంధించుకొనుట వలనను రెండు చేతులను వదిలి, స్వప్రయత్న రూపమగు ఉపాసనాదులను వాటి వలన సాధింపతగిన భగవత్ కృపనూ వదిలి భగవత్క్రుప మాత్రమే ఉత్తారకమని నిశ్చయించుకొని భగవానుడు ఉన్న ఒడ్డుకు చేరు మంచి కాలము ఎప్పుడా అని నిరీక్షించుచూ తిరువాయిమొళి 6.9.9 “కూవిక్ కొళ్ళుమ్ కాలమ్ ఇన్నమ్ కుఴుకాతో?”(శ్రియఃపతి శ్రీ పాదములను పొందు కాలము ఇప్పటికీ ఇంకనూ రాలేదా?) అనియు తిరువాయిమొళి 1.2.9 “ఆక్కై విడుమ్ పొళుందు ఎణ్ణే” (ఆ శ్రియఃపతి కైంకర్యమునే శరీరావసానమున కోరుచున్నాను).

దీనితో శాస్త్రమును, శాస్త్ర సారమును గ్రహించిన వారి ఆలోచనలు చెప్పబడ్డాయి.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-19-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment