ఆచార్య హ్రుదయం – 18

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 17

అవతారిక
ఇట్టి శాస్త్రము మరియు శాస్త్ర తాత్పర్యమగు తిరుమంత్రమును అభ్యసించుటకు అందరికీ అధికారము కలదా? లేక యోగ్యత కలిగిన ఎవరికో కొందరికి మాత్రమే అధికారము కలదా? అన్న ప్రశ్నకు సమాధానమును ఇక్కడ చెప్పుచున్నారు.

చూర్ణిక
తోల్పురైయే పోమతుక్కు ప్పళుతిలా యోగ్యతైవేణుమ్ మనముడైయీర్ ఎన్గిఴ శ్రద్ధయే అమైన్ద మర్మస్పర్శిక్కు నానుమ్ నమరుమ్ ఎన్నుమ్బడి సర్వరుమ్ అధికారికళ్

సంక్షిప్త వివరణ
శరీర విషయమున ప్రవర్తించు శాస్త్రమునకు అనేక యోగ్యతలు కావలెను. ఆత్మ విషయమున ప్రవర్తించు తిరుమంత్రమునకు నిష్కపటమయిన శ్రద్ధ కావలెను మరియు అందరికి యోగ్యత కలదు.

వ్యాఖ్యానము
అనగా – విశేష యోగ్యత అపేక్షించునది అవడము చేత అంతరంగమగు ఆత్మ స్వరూప విషయమున దృష్టి లేక పైకి కనబడు శరీర విషయమున దృష్టి గల శాస్త్రమునకు; ఈ విధముగా తిరుమాలై 42 లో చూపినట్టు “పళుదిలా ఒళుకల్ ఆత్తు” (బ్రహ్మతో ఆరంభమగు సుదీర్ఘమైన తన వంశమున ఒక్క దోషమునూ లేనివారు) పరంపరగా వచ్చే వంశములో జన్మ, ఆచార వ్యవహార విషయములలో ఒక్క దోషమూ లేనటువంటి యోగ్యతగల వారుగా ఉండవలెను.

కానీ శాస్త్ర తాత్పర్యమయిన తిరుమంత్రమునకు, తిరువాయిమొళి 10.5.1 “కణ్ణన్ కళలిణైనణ్ణుమ్ మనముడయీర్” (భక్త సులభుడయిన శ్రీ కృష్ణుని యొక్క శ్రీ పాదములను పొంద కలిగిన మనస్సును గల భాగవతులారా!) అనియు శ్రీ పాంచరాత్రమున “శ్రద్ధైవ  కారణం పుంసా మష్టాక్షర పరిగ్రహే” (అష్టాక్షరిని అభ్యసించుటకు కావల్సినది కేవలము శ్రద్ధయే) అనియు పెఱియ తిరుమొళి 6.10.6 “నానుమ్ సొన్నేన్ నమరుమ్ ఉఴైమిన్ నమో నారాయణమే” (నేను కూడా పలికితిని, నావారు కూడా నారాయణ మంత్రమును ఉచ్చరించగలరు) అని చెప్పినట్టు యోగ్యత, అయోగ్యత అను తారతమ్యము లేకుండా అందరునూ  అధికరించవచ్చును.

దీనితో యోగ్యతను అపేక్షించు శాస్త్రము, అయోగ్యతను అపేక్షించు తిరుమంత్రము వాటి కారణములతో సహా వివరింపబడ్డాయి.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-18-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment