అవతారిక
నాయనార్లు ఈ సూత్రమును(ఇంతక ముందు చూర్ణికలో చెప్పబడిన) స్వరూప యాధాత్మ్యమును తెలుపు తిరుమంత్రమున చూపించుచున్నారు.
ఈ సూత్రమును అర్థము చేసుకొనుటకు తిరుమంత్రార్ధము యొక్క సంక్షిప్త వివరణ దోహద పడుతుంది.
- తిరుమంత్రము మూడు పదములను కలిగి ఉండును – ప్రణవము, నమః, నారాయణాయ
- ఇందులో ప్రణవము మూడు అక్షరముల సమూహము – అకారం(సర్వేశ్వరుడు), ఉకారం(సర్వేశ్వరునికే శేషభూతము), మకారం(జీవాత్మ). అకారామున లుప్తమైన ఛతుర్ధీ విభక్తి ఆయ కలదు. దీనికి అర్థము ఏమి అనగా శేషత్వము, అకారవాచ్యుడైన ఈశ్వరునికి ఈ జీవాత్మ శేషము. ఇక్కడ శేష – శేషి సంబంధము చెప్పబడుచున్నది.
- నమః – న + మః. మః అనునది షష్టి విభక్తిని అంతముగా గల మకారము అవ్వడము చేత “తనకు” అని అర్ధము కలదు. (నేను నాకు సంబంధించిన వాడను). “న” అనుటచే అది నివృత్తి కాబడి నాకు నేను సంబంధము లేని వాడను అని నిర్ధారింపబడినది. దీనితో ఆత్మ రక్షింపబడునది మరియు సర్వేశ్వరుడు రక్షకుడు అని తెలుస్తున్నది. నమః శబ్దమును కలిపి చూసినచో అత్యంత పారతంత్య్రము సిద్ధించును. (సర్వేశ్వరుని పైనే జీవుడు పరిపూర్ణముగా ఆధారపడి ఉండుట)
- నారాయణాయ – నారాయణ + ఆయ. నారాయణ శబ్దము నార + అయన అని సూచిస్తుంది. దీనికి రెండు అర్థములు కలవు. 1)నారములకు(నిత్య వస్తువుల యొక్క సమూహము) ఆధారభూతుడు, ఆశ్రయడుగ ఉండుట 2) నారములలో అంతర్యామిగా ఉండుట. చతుర్థి విభక్తిని సూచించు ఆయ శబ్దము, అట్టి నారాయణుని కైంకర్యమే పురుషార్ధము అని వివరిస్తుంది.
ముముక్షుప్పడి అను రహస్య గ్రంధములో తిరుమంత్ర ప్రకరణము చదివినచో నిగూడార్ధములు తేటతెల్లము అవును.
చూర్ణిక
జ్ఞానచతుర్ధికళిన్ మేలేయిఴే ఆనన్దషష్ఠికళిక్కు ఉదయమ్
సంక్షిప్త వివరణ
భోక్తృత్వమును(అనుభవించు వాడు) తెలుపు జ్ఞానము (ప్రణవమున మకారమందు కలదు) మరియు శేషత్వమును తెలుపు లుప్త చతుర్థికి తరువాత నారాయణాయ యందు కనపడు వ్యక్త చతుర్థి ఆనందమును, మరియు నమః శబ్దము పారతంత్య్రమును ప్రకాశింపజేయును.
వ్యాఖ్యానము
ఆత్మను తెలుపు ప్రణవమున మకారము “మన – జ్ఞానే” అను ధాతువు ద్వారా తెలిసినదై భోక్తృత్వమును చూపు జ్ఞానము పైన ఆనందము తెలియును. అట్టి మకారము యొక్క అర్థమును వివరించునదియు, భోగ్యతను చూపు ఆనందము చతుర్థి యందు కలదు.
ప్రణవమున మొదటి అక్షరము అనగా ఆకారమునందు ఉండు శేషత్వమును తెలుపునట్టి లుప్త చతుర్థి, పారతంత్య్రమును తెలుపునట్టి నమః శబ్దము తెలియబడినవి.
దీనితో ఆత్మస్వరూపముతో శేషత్వ భోక్తృత్వములు ప్రకాశించి ఉండగా వాటిపై స్వరూప యాధాత్మ్య రూపముగా పారతంత్య్ర భోగ్యతలు ప్రకాశినించిన వైనందున వీటికి శేషత్వ భోక్తృత్వముల కంటే ఎక్కువ భేదము ఉన్నాదని తెలుస్తున్నది. కానీ ఈ అన్వయమునకు కొంచెము లోపము ఉన్నది అది ఏమి అనగా షష్ఠి విభక్తి ఇక్కడ(ఈ చూర్ణికలో) ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని నమః శబ్దమును చూపించదు అందుచేత ఇక్కడ షష్టి అనగా షష్ఠి విభక్తి చరమ పదమని(మః) అర్ధము చేసుకోకూడదా అని అడిగినచో దానికి సమాధానముగా అలా అన్వయించరాదు, నమః శబ్దములో రెండు అక్షరములు కలిగి రెండవ అక్షరము మాత్రమే షష్టితో మాత్రమే అంతము అవుచున్నది. మరి ఇక్కడ ఏమి చేయవలెను అని అడిగినచో రెండవ పద్ధతిని చూపించుచున్నారు.
అది ఏమి అనగా మూడవ అక్షరమైన (ప్రణవములో) మకారమున “మన – జ్ఞానే” అను ధాతువు వలన భోక్తృత్వమును తెలుపునది జ్ఞానము అట్టి మకారము యొక్క అర్థమును వివరించు నారాయణాయలో ఉన్న చతుర్థి విభక్తి భోగ విషయమున(కైంకర్యమున) ఆనందమును కలుగజేయును. ఇలా కలిగిన ఆనందము కాకాక్షి న్యాయము ప్రకారము నమః శబ్దముచే తొలగింపబడును.(ఎలా అయితే కాకి దృష్టి అన్ని వైపులా ప్రసరించునో అలా నమః శబ్దము తిరుమంత్రములో అన్ని పదముల పైన ప్రసరించును). అకారమున శేషత్వమును తెలుపు చతుర్థి విభక్తి పైన షష్టి కనపడును. ఇట్టి షష్ఠి స్వరక్షణ ప్రవృత్తికి కారణమగు స్వాతంత్య్రమును సూచించును, ఇది “న” అను శబ్దము చేత తదనంతరము తొలగించబడును.
దీనితో శేషత్వమును తెలుపు చతుర్థి పైన స్వరక్షణమునకు కారణమగు స్వాతంత్య్రమును తెలుపు షష్టి వలనను, భోక్తృత్వమును తెలుపు జ్ఞానము పైన భోగ విషయమున స్వార్ధ బుద్ధికి(స్వప్రయోజనము) కారణమగు ఆనందము కలుగ చేయును. అందుచేత శేషత్వ భోక్తృత్వములు స్వరూప విరోధములను తొలగించవు, కానీ నమః శబ్దము చేత పారతంత్య్రమును పొందిన తరువాత స్వరక్షణమున స్వప్రయత్నమును తొలగించును. (నమః శబ్దము చేత శుద్ధత్వమును పొందిన). నారాయణాయ లో చిట్ట చివరి చతుర్థి ద్వారా ఈశ్వరునికి భోగ్యముగా ఉండుటయే ఆత్మ యొక్క స్వరూపమని తెలిసిన తరువాత స్వప్రయోజనము యందు గల కోరిక మరియు కైంకర్యమున స్వార్ధ బుద్ధి నివృత్తి కాబడును. అందుచేత పారతంత్య్ర, భోగ్యతలు స్వరూప విరోధములను తొలగించును. దీనితో స్వరూప విరోధములను తొలగించు పారతంత్య్ర, భోగ్యతలు స్వరూప విరోధములను తొలగించని శేషత్వ , భోక్తృత్వముల కంటే గొప్పవైనవని అర్థము అవుతున్నది.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/03/16/acharya-hrudhayam-22-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org