ఆచార్య హ్రుదయం – 23

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక 22

అవతారిక
ఈ విధముగా స్వరూప యాధాత్మ్య జ్ఞాన దశ యందు కనపడు పారతంత్య్రము, స్వరూప జ్ఞాన దశ యందు కనపడు శేషత్వము మొదలగు వాటిని తిరస్కరించడమును ఈ చూర్ణికలో వివరించుచున్నారు.

చూర్ణిక
ముళైత్తెళున్ద సూర్యతుల్య యాధాత్మ్య చరమమ్ వితియిల్ కాణుమ్ ప్రధమమధ్యమదశైకళై ప్పకల్విళక్కుమ్ మిన్మినియుమ్ ఆక్కుమ్

సంక్షిప్త వివరణ
ఉదయించే సూర్యుని వలే ఆత్మ యొక్క సహజ స్వరూపమునకు చరమ దశలైన పారతంత్య్ర, భోగ్యతలు మరియు ప్రధమ, మధ్యమ దశలు అయిన శేషత్వ, భోక్తృత్వములను పగటి పూట దీపము లాగా మరియు మిణుగురు పురుగు వలే వెలవెల పోయేలా చేయును.

వ్యాఖ్యానము
అనగా – స్వరూప సాక్షాత్కార జ్ఞానము ఏమి అనగా తిరునెడుందాండగ౦ 1 “ముళైత్తెళున్ద తింగళ్ తానాయ్”(పర్వతము పైన కనిపించు  ఆహ్లాదకరమైన చంద్రుడు తానుగా ఆకాశమున ఎగబాకెను) మరియు శ్రీ విష్ణు పురాణము 6.5.62 “యధా సూర్యః తధా జ్ఞానమ్”(జ్ఞానము సూర్యుని వంటిది) అని చెప్పినట్టు స్వరూప సాక్షాత్కారము యొక్క యాధాత్మ్య అవస్థలు అయిన పారతంత్య్రము, భోగ్యతలు తిరుమంత్రమున తరువాత చెప్పబడుచున్నవి. ఆళ్వారు స్వరూప సాక్షాత్కార జ్ఞానమును చంద్రునితో పోల్చుటకు గల కారణము ఏమి అనగా అట్టి జ్ఞానము తన ప్రయత్నము లేకుండా భగవదనుగ్రహము చేత ప్రాప్తమైనందున మరియు ఆహ్లాదకరమైనందున. 20 వ చూర్ణిక “ఉణైర్వ్పెట్టవూర మిగవుణరవుమ్ ఉణ్డామ్” లో చెప్పినట్టు ఇక్కడ కూడా నాయనార్లు స్వరూప యాధాత్మ్య జ్ఞానము భగవదనుగ్రహ ప్రాప్తము అని చెప్పుచున్నారు. “యధా సూర్యః” అనునది స్వప్రయత్నము వలన కలుగు వ్యధని సూచించును కానీ ఇక్కడ చెప్తున్న ఉద్దేశ్యము అది కాదు. జ్ఞానము యొక్క ప్రకాశించు స్థితిని బయలుపరుచుట ఇక్కడ ఉద్దేశ్యము. స్వరూప సాక్షాత్కార జ్ఞానము యొక్క యాధాత్మ్య స్థితి యందు చరమములైన ప్రకాశించు పారతంత్య్రము మరియు భోగ్యతలు ప్రధమ మరియు మధ్యమ స్థితులు అయిన శేషత్వ, భోక్తృత్వములను తిరస్కరించును.

20వ చూర్ణిక “స్వరూపత్తై ఉణర్ న్దు ఉణర్ న్దు ఉణర్వుమ్” తిరుక్కురుందాండగం 1 “విధియిల్ కణ్బార్” (శాస్త్రము ద్వారా తెలుసుకో) అని అంతకు ముందు చెప్పిన పద్ధతి ప్రకారము శాస్త్రము ద్వారా శ్రవణము, మననము మొదలగు వాటి చేత మొదటి దశ అయిన శేషత్వము, మధ్యమ దశ అయిన భోక్తృత్వము తెలియవచ్చును. పైన చెప్పిన పారతంత్య్రము మరియు భోగ్యత శేషత్వ భోక్తృత్వములను పనికి రాని  పగటి పూట దీపము మరియు అల్పమైన ప్రకాశము గల మిణుగురు పురుగు వలే చేయును.

ప్రణవము ప్రకాశించు స్వరూపము యొక్క యదార్ధ రూపముగ మధ్యమ మరియు చరమ పదముల యందు(నమః, నారాయణాయ) వచ్చుట చేత పారతంత్య్రము మరియు భోగ్యతలు చరమముగా చెప్పబడినవి.

ప్రణవమందు మొదటి అక్షరము అయిన “అ “కారమున లుప్త చతుర్థి యందు మొదటనే శేషత్వము రావడము చేత మరియు ప్రణవములో చివరి అక్షరమున (మకారము) తరువాత రెండు పదముల వలన(నమః, నారాయణాయ) పారతంత్య్రము, భోగ్యతలు తెలియుటకు పూర్వమే మధ్యమ జ్ఞాతృత్వము వలన తెలియు భోక్తృత్వ విషయమగు జ్ఞానము వలనను శేషత్వ, భోక్తృత్వములు ప్రధమ, మధ్యమ దశలుగ చెప్పబడినవి.

ఈ వాక్యముతో స్వప్రయత్న, స్వప్రయోజనములకు ఎంత మాత్రము చోటు ఇవ్వని మరియు పరమాత్మ యొక్క భోగ్యమున మాత్రమే అనుకూలమైన ఒకని స్వరూప యాధాత్మ్యమును ఉద్ఘాటించు శేషత్వ, భోక్తృత్వములను తిరస్కరించు పారతంత్య్ర, భోగ్యతలు వాటి పైన నే ఉండును అని తెలుపబడినది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/03/18/acharya-hrudhayam-23-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment