ఆచార్య హ్రుదయం – 41

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 40

అవతారిక
ఇంతక ముందు చూర్ణికలో చెప్పినట్టు చెప్పవచ్చునా? ద్రావిడ భాష సంస్కృత భాష లాగా అనాది కాదు, అది అగస్త్యుని సృష్టి కదా? అని అడిగితే దానికి సమాధానము ఈ చూర్ణికలో చెప్పుచున్నారు.

చూర్ణిక
శెన్దిఴత్తతమిళ్ ఎన్గైయాలే ఆగస్త్యముమ్ అనాది

సంక్షిప్త వివరణ
తిరుమంగై ఆళ్వార్లు తిరునెడుందాండగం 4 “శెన్దిఴత్త తమిళోసై వడ సొల్లాగి” (సర్వేశ్వరుని నిరూపించు ద్రావిడ వేదమును మరియు సంస్కృత వేదమును ఆ భగవానుడే ప్రకాశింపజేసెను) అని చెప్పినట్టు అగస్త్యునికి ఆపాదించబడిన తమిళము కూడా అనాదియే(నిత్యమైనది).

వ్యాఖ్యానము
అనగా – తమిళము సంస్కృతముతో కలిపి చెప్పుటచే తిరునెడుందాండగం 4 “శెన్దిఴత్త తమిళోసై వడ సొల్లాగి” (సర్వేశ్వరుని నిరూపించు ద్రావిడ వేదము మరియు సంస్కృత వేదము)అగస్త్యుని చేత బయలుపరచపడిన తమిళము కూడా అనాదియే. దీనితో తమిళము మరియు సంస్కృతమునకు అనాదిత్వము సమానమే అని ఏర్పడుచున్నది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-41-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment