ఆచార్య హ్రుదయం – 44

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 43

అవతారిక 

ఇతర శాస్త్రముల కంటే వేదము గొప్పదైనట్టుగా నమ్మాళ్వార్ల ప్రబంధములకు అంత ప్రాధాన్యత ఉన్నదా అని అడిగితే దానికి సమాధానమును నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు.
గమనిక: ఇక మీదట ప్రధానముగా తిరువాయిమొళి పైనే దృష్టి పెట్టినప్పటికీ, నమ్మాళ్వారులు అనుగ్రహించిన తక్కిన ప్రభంధములు కూడా ఇందులో కలవు.   

చూర్ణిక
సకల విద్యాధిక వేదమ్బోలె ఇతువుమ్ దివ్యప్రబంధ ప్రధానమ్

సంక్షిప్త వివరణ
జ్ఞానాన్ని ప్రసాదించు అన్ని శాస్త్రముల కంటే వేదము ఎలా అయితే గొప్పదో అలానే అన్ని దివ్య ప్రబంధములలో నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధములు గొప్ప ప్రాధాన్యతను కలిగినవి. 

వ్యాఖ్యానము 
అనగా స్మృతిలో చెప్పినట్టు “అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతాశ్ చతుర్దశా”. (ఆరు అంగములు, నాలుగు వేదములు, మీమాంస, న్యాయ(తర్క) పురాణము మరియు ధర్మ శాస్త్రము అని పద్నాలుగు విద్యలు కలవు). అయితే వేదములను ఇతర శాస్త్రములతో అభ్యసించుట చేత అంగములు, ఉపాంగముల కంటే వాటి వైభవము చేత వేదములు గొప్పవి. అలానే నమ్మాళ్వార్ల నాలుగు ప్రబంధములు అయిన తిరువిరుత్తం, తిరువాశిరియమ్, పెరియ తిరువందాది మరియు తిరువాయిమొళిలను అంగము,ఉపాంగములు అయిన దివ్య ప్రబంధములన్నిటితో చేర్చి వాటికి గల వైభవము చేత ఈ నాలుగు ప్రబంధములు అన్నిటి కంటే గొప్పవి. 

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-44-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment