ఆచార్య హ్రుదయం – 52

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 51

అవతారిక
అయితే సామ వేదములో వివిధ శాఖలు ఉన్నవి కదా, తిరువాయిమొళి సామములో ఏ శాఖతో పొసుగునో అని అడిగినచో దానికి సమాధానమును నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు.

చూర్ణిక
శన్దోకనెన్ఴు సామాన్యమాకామల్ ముతలిలే పిరిత్తు యాళ్ పయిల్ గానస్వరూపయై పాలైయాకి ఎన్ఴు విశేషిక్కైయాలే వేతకీతచ్చామి నానెన్ను సామమ్ తోన్ఴ ఉద్గీథప్రణవత్తై ప్రధమత్తిలే మాఴాడి చరమగతి ముడివాక తొణ్డర్కు అముతెన్న దేవాన్నమాక్కి మహాఘోష నల్ వేదవొలిపోలే మహాధ్యయనమెన్న పాడుకైయాలే ఇత్తై ఛందోగ్య సమమ్ ఎన్బర్ గళ్

సంక్షిప్త వివరణ
తిరువాయిమొళిలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణములు భగవానుని “ఉత్” అని కీర్తించు మరియు గొప్ప ఉత్సుకతతో గోష్ఠులలో పఠించబడునది అయిన ఛాందోగ్య ఉపనిషత్తుకు సామ్యము ఉండడము చేత ఈ తిరువాయిమొళి కేవలము సామ వేదమునకు సామ్యమని సాధారణముగా చెప్పడము గాక సామ వేదములో భాగమైన ఛాందోగ్య ఉపనిషత్తుతో సమానమని చెప్పబడినది.

వ్యాఖ్యానము

ఛందోగన్ ఎన్ఱు సామాన్యమ్ ఆగామల్ ముదలిలే పిరిత్తు
అనగా ఈ తిరువాయిమొళి సామ వేదముతో సమానమని అభియుక్తులు(ఆళ్వారు) మరియు కృష్ణుడు చెప్పినట్టు తిరుచ్ఛన్ద విరుత్తం 14 “సామ వ్ద గీతనాయ” (సామ వేదములో చెప్పబడిన) అనియు పెఱియ తిరుమొళి 2.2.7 “సామియప్పన్” (కారణ వస్తువుగా సామవేదములో చెప్పబడినవాడు) అనియు శ్రీ భగవద్గీత 10.22 “సామవేదోస్మి” (నేను సామ వేదమును)అని చెప్పినట్టుగా కాకుండా సామ వేదములో భాగమైన ఛాందోగ్య ఉపనిషత్తుతో సమానమని ప్రత్యేకముగా ప్రస్తావించబడినది. పెఱియ తిరుమొళి 5.5.9 “సందోగన్ పాళియన్ వెన్దళలోమ్బు తైత్తిరియన్ సామవేది”(సామ వేదములోని ప్రత్యేక విభాగము అయిన ఛందోగమును తెలిసిన వాడును, కౌషీతకీ బ్రాహ్మణము అర్థమును తెలిసినవాడును, తైత్తిరీయ ఉపనిషత్తు అర్థమును తెలిసినవాడును, సామ వేదార్ధమును తెలిసినవాడును అయిన ఎమ్పెరుమానుడు) అని చెప్పినట్టు “సామవేదీ” అని పైన చెప్పిన విధముగా “ఛందోకన్” అని మొదటనే విభజించి అనుట. ఈ అభిప్రాయము కానీ పక్షమున “సామవేదీ” అను దానిలో ఈ సామమును(ఛందోగ) అంతర్భూతమై ఉండగా పైన “ఛందోకన్” అని ఛందోగ సామమును ప్రత్యేకించి పేర్కొన నక్కర్లేదు కదా? అని భావము.

యాళ్ పయిల్ గానస్వరూపియై పాలైయాకి యెన్ఴు విశేషిక్కైయాలే
అనగా తిరువాయిమొళి 2.3.7 “యాళ్ పయిల్ నూల్ నరంబిన్ ముదిర్ సువైయే!”(తీగ నుండి ఉద్భవించు మరియు యాళ్ అను సంగీత వాయిద్యములో సాధన చేయబడినదియై అభ్యసించతగిన శాస్త్రమునందు చెప్పిన లక్షణములను కలిగినదియై పక్వమైనది అయిన గాన రసము వలే భోగ్యమైన వాడా!) అని చెప్పినట్టు యాళ్ అను వాయిద్యమున పుట్టినదియు, శాస్త్రము చెప్పిన లక్షుణములను కలిగినదియు అయినట్టి తీయని గాన స్వరూపము వలే భోగ్యమయినట్టి సర్వేశ్వరుని సామాన్య గానము వలె కాకుండా పెఱియ తిరుమొళి 7.3.7 “యాళ్ నరమ్ బిల్ పెత్త పాలైయాగి”(యాళ్ అను వాయిద్యము యొక్క తీగలో నుండి వచ్చిన పాలు) అని ఛందోగ సామము యొక్క సారభూతమగు పాలను వీణా గానముతో చేర్చి విశేషించి చెప్పుట. ఇప్పుడు “సామవేదకీతన్” అని చెప్పుట సామ వేదమైనవాడు అని మాత్రమే కాకుండా దాని గానమైన వాడు అని చెప్పుటచే అటువంటి గానము ఛందోగ సామముని తెలుపుట కోసమని తోచుతున్నది.

వేదగీతచ్చామి నాన్ ఎన్ఴ సామమ్ తోన్ఴ
అనగా ఇలా విశేషించి చెప్పటము చేత పశ్వధికరణ న్యాయమును(జంతు బలి ఏ రోజున ఇవ్వాలో చెప్పునట్టి శాస్త్రము యొక్క నియమము ఆ తర్వాత అదే శాస్త్రములో మరొక చోట ఏ  జంతువు ఆధారముగా కుదించబడినట్టు)  బట్టి “సామవేద గీతనాయ్”, “సామియప్పన్”, “సామవేదోస్మి” లో రూఢిగా ఉపయోగించిన “సామ” మరియు “గీత” శబ్దములు అంతిమముగా నిశ్చితమైన ఛందోగ సామమును ఇంతక  ముందు చెప్పినట్టు తెలుపును. ఇందువలన ఛందోగ సామమే చెప్పబడడము చేత అభియుక్తులు అయిన వారు, తాను(సర్వేశ్వరుడును) తానేయని చెప్పుటకు తగినంత ఉత్క్రుష్టమైనదై సర్వేశ్వరునిచే ఆదరింపతగినదియగు ఛందోగ సామమే తిరువాయిమొళి అని అర్థము అవుతున్నది.

ఉద్గీత ప్రణవత్తై ప్రధమత్తిలే మాఴాడి
అనగా ఒక్క సామమునకే ప్రస్థానము, ఉద్గీతము, ప్రతిహారము, ఉపద్రవము మరియు నిధనము అని అయిదు విభాగములు ఉన్నప్పటికీ ఆ అయిదులో ఒక దానిని మాత్రమే సామము యొక్క రసము అని ఛాందోగ్య ఉపనిషత్తు “సామ్న ఉద్గీథో రసః” (ఉద్గీతమే సామము యొక్క రసముగా ఉండును)అని చెప్పినట్టు మరియు ప్రణవము ఉఛ్చరించిన పిదప దానిని(ఉద్గీతము) గానము చేయబడినది. అందుచేత అట్టి ఉద్గీతములో భాగమైన ప్రణవము ఛాందోగ్య ఉపనిషత్తు మొదట చెప్పబడిన “ఓమిత్యేతత్ అక్షరం ఉద్గీతం ఉపాసీత”(ఉద్గీతలో భాగమైన ప్రణవమును ఉపాసించాలి) అని చెప్పినట్టు ఇక్కడ కూడా నమ్మాళ్వారు మొదట ప్రణవమునే పలికితిరి. ఆలా పలికినప్పుడు ప్రణవమును అలానే (యధాతధముగా) పలికినచో అది అధికృతాధికారము అవ్వును(అర్హత గల అధికారి మాత్రమే ఉఛ్చరించతగినది). అందుచేత నమ్మాళ్వారు ప్రణవమును మూడు భాగములు చేసి (అ, ఉ, మ)మూడు అక్షరములను ప్రధమ, ద్వితీయ, త్రితీయ పాదములందు ప్రయోగించవలసి ఉండగా మొదటి అక్షరమగు “అ”కారమును మొట్టమొదట ప్రయోగింపక “ఉ”కారమును మొదట ప్రయోగించినందున ప్రణవము యొక్క క్రమమును మార్చినట్టు చెప్పడము జరిగినది.

“ఉ” కారముతో మొదలుపెట్టుటకు గల కారణము ఏమి అనగా ఛాందోగ్యము యొక్క సంగ్రహ రసము అయిన “ఉత్” అనునది భగవానుని నామము కావడము చేత. అందువలన ఆళ్వారు మొదటి పాశురము “ఉ”కారముతో ఆరంభమగు “ఉయర్వఴ” తో మొదలు పెట్టి “త” శబ్దమును కలిగి ఉన్న “ఉయర్నదే” తో ముగించిరి. ఇది తరువాత వచ్చు చూర్ణికలో వివరించబడినది. అందువలన మూడు అక్షరములు కలిగిన ప్రణవమును మొదట ప్రకాశింపచేయబడి పైన చెప్పిన కారణము చేత దాని క్రమమును మార్చడము జరిగినది.  

చరమగతి ముడివాగ
అనగా చరమ గతి అయిన అర్చిరాది గతిని(మోక్షమునకు దారి చూపు వెలుగు) ఛాందోగ్యమున మధ్య భాగములో వివరించబడినట్టు తిరువాయిమొళి 10.9 “సూల్ విశుమ్బణి ముగిల్” చివరిన చెప్పబడినది. ఈ అర్చిరాది గతిని చరమ గతిగా చెప్పబడినది, ఎందుచేత అంటే ఇది తక్కిన గతులు అయిన గర్భ, యామ్య, ధూమాది గతుల కంటే భిన్నముగా ఉత్క్రుష్టమైన పరమపదమునకు దారి తీయును.

తొణ్డర్కు అముదెన్న దేవాన్నమాక్కి
అనగా ఎలా అయితే సామము నిత్యముక్తులగు దేవతలకు భోగ్యమైన అమృతమైనట్లు తైత్తిరీయ ఉపనిషత్తు “ఏతత్ సామ గాయన్ నాస్తే” (వారు అట్టి సామమును గానము చేయుచుండిరి)లో చెప్పినట్టు భగవదనుభవ జనితమగు సంతోషాతిశయమునకు తగినట్లు “హావు హావు  హావు” అని సామ గానము చేసి “అహమన్నాద” అన్నట్లు నిత్య ముక్తులకు భోగ్యమైనట్లు ఈ తిరువాయిమొళి కూడా భగవానుని అనుభవించాలని కోరిక గల వారికి భోగ్యమైనది. తిరువాయిమొళి 9.4.9 “తొణ్డర్కు అముదెన్న” (దాసులకు భోగ్యము అయ్యేటట్టు చేయుట)

మహాఘోష నల్ వేద ఒలిపోలే మహధ్యాయనమెన్నుమ్ పాడుగైయాలే
తిరువాయిమొళిని పెఱియ తిరువధ్యయనము అప్పుడు పాడడము అనేది గొప్ప శబ్దములను కలిగిన సామ వేదమును “సర్వేభ్యోభి హి వేదేభ్యః సామ ఘోషో మహానభూత్ అన్వఘోషోయ దద్వర్ధమ్ తేన బ్రహ్మాణ్డ మణ్డపః” (ఇతర వేదముల కంటే సామ వేదం ధ్వని పెద్దగా ఉండును, అట్టి గొప్ప ధ్వని ఘోష చేత మండపము అంతా ప్రతిధ్వనించినట్టు) మరియు తిరువాయిమొళి 5.9.3 “పాడు నాల్ వేద ఒలి”(గొప్ప సామ వేద ధ్వని వినబడినది)

ఇత్తైచ్ ఛాందోగ్య సమమ్ ఎన్బర్గళ్
అనగా ఇలా ముందు చెప్పిన లక్షణములను బట్టి తిరువాయిమొళిని ఛందోగ సామములో భాగమైన ఛాందోగ్య ఉపనిషత్తుతో సమానమని అభియుక్తులు అయిన పెద్దలు చెప్పెదరు.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-52-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment