ఆచార్య హ్రుదయం – 51

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 50

అవతారిక
ఎలా అయితే ఋగ్ వేదము సమ వేదముగా విస్తరించినదో అట్టి విషయము ఇక్కడ కూడా పొసుగునా? అన్న ప్రశ్నకు నాయనార్లు సమాధానమును ఇచ్చుచున్నారు.

చూర్ణిక
ఋక్కుు సామత్తాలే సరసమాయ్ స్తోభత్తాలే పరమ్బుమాప్పోలే శొల్లార్ తొడైయల్ ఇశైకూట్ట అమర్శునైయై యాయిరమాయిత్తు

సంక్షిప్త వివరణ
ఎలా అయితే ఋగ్ వేదము గాన రసము కలదైన సామ వేదముగా విస్తరించునో అలానే తిరువిరుత్తమునకు గాన రసము కూడినచో తిరువాయిమొళిగా విస్తరించెను.

వ్యాఖ్యానము
అనగా ఋగ్ వేదము సామ వేదమునకు సంగ్రహ రూపము. గాన రసముతో ఉన్నఋగ్ వేదమునకు సామము రసములు కలుగచేయునది. “ఋచస్సామరసః”(ఋగ్ వేదము సామ వేదము యొక్క రసము) అన్నట్టు ఋగ్ వేదము స్తోబము(గాన రూపమగు పదములు)తో సామ వేదముగా విస్తరించెను “హావూహావూహావు” వంటివి. అలానే వంద పాశురములను కలదైన తిరువిరుత్తము తిరువిరుత్తం 100 “శొల్లార్ తొడైయల్” (దివ్యమైన పదములను కలిగిన మాలిక) మరియు గాన రసమును చేర్చినచో ఋగ్ వేదమును సూచించినదియూ తిరువాయిమొళి 2.4.11 “ఇశై కూట్ట” (నాదమును చేర్చి) అన్నట్టు నాదమును చేర్చినచో సామ వేదమును పోలినదైన తిరువాయిమొళికి రసము మరియు అనుభవించతగ్గ వేయి పాశురాములు కలిగినది. తిరువాయిమొళి 1.3.11 “అమర్ శువై ఆయిరమ్” (మంచి రసమును కలిగి ఉన్న వేయి పాశురాములు) అని అర్ధము.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-51-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment