ఆచార్య హ్రుదయం – 53

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 52

చూర్ణిక – 53

అవతారిక
ఇక మీద ఇంతక ముందు చూర్ణికలో చెప్పబడిన తిరువాయిమొళిలో మొదటి పాశురములో ఆళ్వారు ప్రణవము యొక్క క్రమమును మార్చిన విషయమును నాయనార్లు అభియుక్తుల యొక్క సూచనలు ద్వారా వివరించుచున్నారు.

చూర్ణిక
పురవియేళ్ ఒరుకాలుడైయతేరిలే తిరుచ్చక్కరమొత్తు కాలశక్కరచ్చెఙ్గోల్ నడావి జ్యోతిశ్చక్రవొళి శురుక్కి అగ్నీషోమియా తేజోమృతత్తుక్కు ఊత్తమ్ మన్దేహర్కు చ్చన్దీయుమ్ ముక్తిమార్గత్తలై వాశలుమ్ కణ్డావాన్ కణ్డిల్ పిఴన్ద కణ్మణియుమ్ త్రయీమయముమాన మణ్డలత్తిలే తణ్డామరైశుమక్క తోళ్వళైయుమ్ కుళైయుమ్ తిరుచ్చెయ్య ముడియుమ్ అరముమ్ పడైయుమ్ తికళుమ్ పొన్మేనియుమ్ శెఙ్గుడర్ త్తామరైకణ్డుమాయ్ అఴినిఴమూర్తి యీతెన్నుమ్బడి ఇరణ్డైయుమ్ తన్నిఴమాక్కుకిఴ శెయ్యాళాన విద్యయోడే అరుక్కన్ మేవిన సదధ్యేయతేజస్సిన్ సామరసోద్గాననామమ్ ఉళ్ళుఴైయాన ఆద్యంతఙ్గళాలే ఓరాయిరమామవత్తిలే ఒన్ఴై ఆయిరముకత్తినాలరుళిన తీర్తమ్బోలే తీర్తఙ్గళాయిరముమాక విస్తరిక్కిఴారెన్ఴు వేదగురూపదేశమ్

సంక్షిప్త వివరణ
వేదాచార్య భట్టరు వారు ఇట్లు సాయించిరి:
తన అందమైన దివ్యమైన ఆభరణములతోను, ఆయుధములతోను సూర్యమండల మధ్యన ప్రకాశించుచున్న “ఉత్” అని తిరునామమును కలిగి ఉన్న సర్వేశ్వరుడైన ఆ శ్రీమన్నారాయణుని గురుంచి “ఉయర్వఴ” తో మొదలగు “ఉయర్నదే” తో అంతమగు వేయి పాశురాములు ఈ లోకమును ఉద్ధరించును యెట్లు అనగా భగవానుని దివ్యపాదముల నుండి ఆవిర్భవించిన గంగానది వేయి ఉపనదులగా ప్రపంచమును శుద్ధి చేయునట్లు.

వ్యాఖ్యానము

పురవియేళ్ ఒఴు కాలుడైయ తేరిలే
అనగా శిఴియ తిరుమడల్ “కారార్ పురవియేళ్ పూణ్డ” (ఏడు గుఱ్ఱములను జోడించిన) అనియు పెఱియ తిరుమొళి 5.7.8 “ఒరు కాలడైయు తేర్” (ఒక చక్రమును కలిగిన రధము) అని చెప్పినట్టు గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతీ, త్రిష్టుప్, అనుష్టుప్, పఙ్క్తి అనబడు ఏడు ఛందస్సులను ఏడు గుఱ్ఱములై ఈడ్చునట్టి కాల చక్రము అయిన ఏక చక్రమును కలిగిన రధము. వేదములో చెప్పినట్టు “సప్తయజ్ఞన్తి రధమేక చక్రం” (ఏక చక్రమును కలిగిన రధము ఏడు గుఱ్ఱములచే ఈడ్చబడుట) అనియు శ్రీ విష్ణు పురాణము 2.8.4 “హయశ్చ సప్త ఛన్దాంసి తేషామ్ నామాని మేశృణు గాయత్రీచ బృహత్యుష్ణిక్ జగతి త్రిష్టుప్ ఏవ చః అవుష్టుప్ పఙ్గక్తిః ఇత్యుక్తాః ఛన్దాంసి హరయోవేః “(ఏడు          
ఛందస్సులు గుఱ్ఱములు; వాటి పేర్లను న నుంచి వినుము, గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతీ, త్రిష్టుప్, అనుష్టుప్, పఙ్క్తి అనునవి సూర్యుని యొక్క గుఱ్ఱములు). ఇది ఇలా ఉండగా వేదములోనే మరొక శ్లోకము “ఏకో అశ్వో వహతి సప్త నామా” (ఏడు పేర్లను కలిగిన ఒక గుఱ్ఱము సూర్యుని నడిపించుచున్నది). ఈ ప్రకారము వ్యాఖ్యానము ఉన్న చోట పైన చెప్పిన విధముగా చూసుకొనగలరు.

శ్రీ విష్ణు పురాణము 2.8.3 “త్రినాభిమతి సంచారే షణ్ణేమిన్యక్షయాత్మకే సంవత్సరమయే కృత్స్నం కాలచక్రే ప్రతిష్ఠతం”(సంవత్సరము, పరివత్సరము, ఇరావత్సరము. అనువత్సరము, ఇద్వత్సరము అనుబడు అయిదు సంవత్సరములను చువ్వలుగా కలిగినదియు, ఆరు ఋతువులను చక్రభాగముగా కలిగినదియు అని చెప్పినట్టు ఏక చక్రమానునది కాల చక్రముగా కలిగినదియై నదీ ప్రవాహము వలె నిత్యముగా ఉండును)కావున ఈ విధములుగా ఏడు గుఱ్ఱములను, చక్రమును కలిగి ఉండుట చేత ఇతర రథముల కంటే విలక్షణమైన వైభవము గల రధము అని చెప్పుట.

ఇక మీద నాయనార్లు మండలమును(సూర్యుని) గురుంచి వివరించుచున్నారు.

తిరుచ్చక్కరమ్ ఒత్తు
అనగా తిరువిరుత్తం 88 “అమ్మేరువిల్ శెన్జుడరోన్ తిరుమాల్ తిరుకైత్ తిరుచ్చక్కరమ్ ఒక్కుమ్” (మేరు పర్వతము పైన సూర్యుని ఎర్రని కిరణాలు సర్వేశ్వరుని దివ్య హస్తములో ఉన్న దివ్యమైన సుదర్శన చక్రముతో సదృశముగా ఉన్నది) అని చెప్పినట్టు గుండ్రముగా ఉండుట చేత మరియు తేజో విశేషము చేత సుదర్శన చక్రముతో సమానముగా ఉన్నది అని అర్థము.

కాలశక్కరచ్చఙ్గోల్ నడావి
అనగా తిరువిరుత్తం 33 “తిరుచ్చక్కరత్తాల్ అగల్ విశుమ్బుమ్ నిలనుమ్ ఇరుళార్ వినై కేడచ్చన్గోల్ నడావుదిర్”(దివ్యమైన నీ సుదర్శన చక్రము చేత విస్తారమైన ఆకాశము నందు మరియు ఈ భూమియందు అజ్ఞానముచే చేయు పాపములు పారిపోవునట్లు నీవు ఆజ్ఞను నడిపించుచున్నావు) అని చెప్పినట్టు సర్వేశ్వరుడు ఉభయ విభూతులలో తన ఆజ్ఞను జరిపించుటకు సాధనమగు చక్రాయుధము వలె తిరువాయిమొళి 7.2.7 “కాల చక్కరత్తాయ్” (కాల చక్రమును తన అధీనములో పెట్టుకున్నవాడు) అని చెప్పినట్టు కాల చక్ర నిర్వాహకుడగు భగవానుని కాల చక్ర ఆజ్ఞను తిరువిరుత్తం 13″తనివళర్ శఙ్గోల్ నడావు” (అద్వితీయముగా వృద్ధి చెందుతున్న తన ప్రకాశముతో  ఈ ప్రపంచమును పాలించుచున్న) అని చెప్పినట్టు నడిపించుట.

జ్యోతిశ్చక్ర ఒళి సురుక్కి
అనగా తిరుప్పళ్ళియెళుచ్చి 3 “సుడరొళి పరందన సూళదిశై ఎల్లామ్”(సూర్యుని కిరణాలూ అంతటా వ్యాపించాయి) అని చెప్పినట్టు అన్ని దిక్కులా వ్యాపించినట్టి దేదీప్యమానమగు తన తేజస్సు చేత కాంతిని విదజిమ్ము నక్షత్రములు మొదలగు వాటి యొక్క తేజస్సును క్షీణింపచేయుట అని అదే పాశురములో చెప్పినట్టు “తున్నియ తారగై మిన్నొళి సురుంగి”(దగ్గరగా ఉన్న నక్షత్రములు వాటి వెలుగును కోల్పోయినవి) అని అర్ధము.

అగ్నిషోమియా తేజోమృతత్తుక్కు ఊత్తుమ్
అనగా అష్టకం 2 “అగ్నిం వా వాదిత్యస్సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్ దూరాన్నక్తం దదృశేః ఉభేహి తేజసీ సంపద్యేతే”(సాయంకాలం సమయమున సూర్యుడు అగ్నిలో ప్రవేశించుచున్నాడు. అందుచేతనే అగ్ని రాత్రి సమయమున దూరముగా కనబడుచున్నది. ఈ రెండు తేజస్సులు కలుగజేయు బడుచున్నవి.)అనియు శ్రీ విష్ణు పురాణము 2.8.20 “ప్రభా వివస్వతో రాత్రావస్తం గచ్ఛతి భాస్కరే విశత్యగ్నిమతో రాత్రౌ వహ్నిర్దూరాత్ప్రకాశతే”(సూర్యుడు అస్తమించు సమయమున సూర్యుని ప్రకాశము అగ్నిలో ప్రవేశించుచున్నది. అందుచేతనే రాత్రి సమయమున అగ్ని దూరము నుండి ప్రకాశించుచున్నది) అని చెప్పినట్టు సూర్యుడు తన ప్రకాశమును అస్తమించు సమయమున అగ్నిలో ప్రవేశింపజేసి అగ్ని యొక్క తేజస్సును రాత్రి సమయమున వృద్ధి పొందించుట చేత సూర్యుడు అగ్ని యొక్క తేజస్సుకు మూలము(ఉత్పత్తి) అని చెప్పుట.

శ్రీ విష్ణు పురాణము 2.12.3 “క్షీణం పీతం సురై స్సోమమ్ ఆప్యాయతి దీప్తమాన్ | మైత్రేయైక కలం సన్తం రశ్మినైకేన భాస్కరః || క్రమేణా యేన పీతోసౌ దేవైనేన నిశాచరం| ఆప్యాయత్యనుదినం భాస్కరో వారితస్రః||” (ఓ మైత్రేయ! దేవతలు చంద్రుని నుంచి అమృతమును సేవించగా చంద్రుడు తన భాగమును కోల్పోయినాడు. ఒక భాగమును మాత్రమే కలిగి ఉన్న చంద్రుని తిరిగి ఉజ్జీవించుటకై ప్రకాశించు సూర్యుడు సుషుమ్న అను తన కిరణముతో కలుగ చేయుచున్నాడు. ఎలా అయితే దేవతలా చేత చంద్రుడు వినియోగించబడినాడో అలా తాను సూర్యునిచే పోషించబడుచున్నాడు) అని చెప్పినట్టు కృష్ణ పక్షమున ప్రధమ(పాడ్యమి) మొదలుకొని చతుర్దశి వరకు నిత్యము అమృతముతో కూడిన ఒక భాగము చొప్పున పదునాలుగు భాగములను దేవతలు వినియోగించితిరి. పదిహేనవ(15 వ) భాగమున అమావాస్య సాయంకాలమున పితృ దేవతలచే వినియోగించబడెను(భుజించబడెను). ఈ విధముగా క్షీణించిన చంద్రునికి పూర్వ పసుఖము(శుక్ల పక్షము) పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు నిత్యము ఒక్కొక్క భాగమును సూర్యుడు తన కిరణములచే కూర్చెను. అందుచేతనే “సోమనుడైయ చండమృత్తత్తుక్కు ఊత్తు”(చంద్రుని అమృతమునకు మూలము) అని చెప్పబడినది. ఈ విధముగా సూర్యుడు చంద్రుని యందు ఉండు అమృతమునకు మరియు అగ్ని తేజస్సుకు మూలముగా ఉన్నది.

మన్దేహర్కు చెన్దీయుమ్
అనగా మందేహులు అనుబడు రాక్షసులు సంధ్యా సమయమున సూర్యుని రధము యొక్క చక్రములను పట్టుకొని రధమును ముందుకు పోనీయకుండా అడ్డుపడి సూర్యుని చంపుటకై అతనితో గొప్ప యుద్ధమును చేయుదురు. అట్టి సమయములో గాయత్రీ మంత్రముతో మంత్రించిన జలమును బ్రాహ్మణులు అర్ఘ్య రూపములో గాలిలో ఊర్ధ్వముగా విడువగా, గాయత్రీ మంత్రముతో మంత్రించిన జలము యొక్క శక్తి చేత ఎర్రని అగ్ని ఆదిత్య మండలములో ప్రకాశించును, అట్టి ఎర్రని అగ్నిలో మందేహులు పది చనిపోవుదురు. ఇది తిరువిరుత్తం 82 “మీణ్డవత్తుళ్ ఎరికోళ్ శెన్దీవీళశురరైపోల” (సూర్యుని ప్రకాశవంతమైన మంటలో పడి చనిపోవు రాక్షసుల వలె) అని ఆళ్వారు కృప చేసినట్టు అట్టి అగ్ని మందేహులను హరింపచేయు అగ్ని అని అర్థము. ఆళ్వారు రాక్షసులను అసురులుగా పాడిన కారణము ఏమి అనగా రాక్షసులకు కూడా అసుర స్వభావము ఉండడము చేత. పెఱియ తిరుమొళి 1.4.1 “తానవనాగమ్ తరణీయిల్ పురళ్”(ధను వంశమునకు చెందిన రావణుని శరీరము భూమి పై పడగా) అనియు పెఱియ తిరుమొళి 2.2.2 “తానవన్ వాళ్ అరక్కన్” (అసురుడైన రావణుడు కత్తిని కలిగి ఉండుట) [రాక్షసులు అనగా మానవ జాతి యందు ఉండు చెడ్డ వారు. అసురులు అనగా దైవ జాతి యందు ఉండు చెడ్డ వారు. ఈ రెండు పాదములను కొన్ని కొన్ని సందర్భాలలో మార్చి మార్చి ప్రయోగించబడును]. వేదము ” తదుహవా ఏతే బ్రహ్మవాదినః పూర్వాభిముఖాః సంధ్యాయామ్ గాయత్రియా అభిమంత్రితా ఆప ఊర్ధ్వం విక్షీబంధీ” (అనగా వేదమును చదివిన వారు సంధ్యా సమయమున తూర్పు దిక్కున గాయత్రీ మంత్రముతో మంత్రించిన జలమును పైకి విడుచుచున్నారు). శ్రీ విష్ణు పురాణము “సన్ధ్యాకాలే తు సంప్రాప్తే రౌద్రే పరమదారుణే మందేహా రాక్షసా ఘోరా స్సూర్య మిచ్ఛన్తి ఘాతితుంప్రజాపతి కృతాశ్శాపస్తేషాం మైత్రేయ రక్షసాం అక్షయత్వం శరీరాణాం మరణం చ దినే దినే”(దారుణమైన మరియు భయంకరమైన సంధ్యా కాలము రాగానే క్రూరమైన మందేహులు అనబడు రాక్షసులు సూర్యుని చంపుటకై కోరికతో ఉన్నారు. ఓ మైత్రేయ! ఆ మందేహులకు రోజు నశించు శరీరము మరియు మరణము కలుగునట్టు బ్రహ్మ శాపము ఇచ్చాడు. అందుచేత అతి భయంకరమైన యుద్ధము సూర్యునికి మందేహులకు మధ్య ఏర్పడినది. ఓ మైత్రేయ! దీని వలన శ్రేష్ఠులైన బ్రాహ్మణులు ప్రణవము మరియు గాయత్రీ మంత్రముతో అభిమంత్రించిన జలమును ఊర్ధ్వముగా గాలిలోకి విసిరెదరు. పాపాత్ములు అయిన మందేహులు వజ్రాయుధముగా మారిన ఆ జలము వలన చంపబడితిరి. ఇందు చేతనే వేదము మరియు పురాణములో అర్ఘ్యముగా పైకి బ్రాహ్మణుల చేత చల్లబడిన జలము వజ్రాయుధముగా మారి ఆ రాక్షసులను సంహరించును. దీని వలన అర్ఘ్య జలము సూర్యునికి తేజస్సును కలుగజేసి మరియు సూర్యునికి దగ్గరగా వచ్చు రాక్షసులను సంహరించును అని చెప్పబడినది.

ముక్తి మార్గత్తలై వాశలుమ్
అనగా మోక్షమునకు దారి అయిన అర్చిరాది గతి ద్వారా వెళ్లేప్పుడు “అర్చిషమే వాభి సమ్భవన్తి”(అగ్ని లోకమును పొందుచున్నారు) ఒకడు అర్చిస్సు మొదలగు వాటికీ పోవుట మాత్రమే కాకుండా “భిత్వా సూర్యస్య మండలం” (సూర్యుని భేదించుకొని) అనియు శిఴియ తిరుమడల్ “తేరార్ నిరై కదిరోన్ మణ్డలత్తైక్ కీణ్డు పుక్కు”(సూర్యుని భేదించుకొని) అనియు పెఱియ తిరుమొళి 4.5.10 “వెఙ్గతిల్ పరితిట్టత్తూడుపోయ్” (సూర్య మండలము మధ్య నుంచి వెళ్ళు) అని చెప్పినట్టు ఆత్మ సూర్య మండలము నుండి వెళ్ళడము వలన మరియు అండమును భేదించుకొని వెళ్ళడము వలనను ఇది ముక్తిమార్గమునకు చివరి ద్వారము “తలై వాశల్” అని చెప్పబడినది.

కణ్ణావాన్ కణ్ణిల్ పిఴన్ద కణ్మణియుమ్
నాగ్ తిరువాయిమొళి 1.8.3 “కణ్ ఆవాన్ ఎన్ఴుమ్ మణ్ణోర్ విణ్ణోఴ్కు”(భూలోక వాసుల మరియు ఊర్ధ్వలోక వాసుల కొరకు సమృద్ధిగా చల్లదనమును కలిగిన తిరువేంగడము పైన నిత్య నివాసము చేయువాడు, అన్నింటినీ నియంత్రించువాడు) యజుర్ వేదము “చక్షుర్దేవానా ముత మర్త్యానామ్” (దేవతలను, మనుష్యులను నియంత్రించువాడు) అని చెప్పినట్టు అందరికి దృష్టిభూతమైన వాడు పురుష సూక్తము “చక్షో స్సూర్యో జాయత” (భగవానుని నేత్రముల నుండి సూర్యుడు పుట్టెను) మరియు ఈ జగత్తుకు దృష్టిభూతుడై ఉండును “జగదేక చక్షుషే”(జగత్తుకు నేత్రమైన వాడు).

త్రయీమయముమాన మణ్డలత్తిలే
అనగా “త్రయీ మాయాయ” (వేదముతో నిండిన) అని చెప్పినట్టు వేదముతో నిండియున్న ఆదిత్య మండలము. దీనితో సావిత్రి మండలములో తాను వేంచేసియున్న విషయమును ఇంతవరకు ఛాందోగ్య ఉపనిషత్తు “ధ్యేయన్ సదా సవితృ మండల మధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నవిష్ఠః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృత శంఖ చక్రః” (భుజకీర్తులను, మకర కుండలములను, కిరీటమును, హారమును ధరించియుండు వాడు హిరణ్మయ వర్ణము కలిగిన శరీరమును కలవాడు, శంఖ చక్రములను ధరించిన వాడు అయినా శ్రీమన్నారాయణుడు సూర్య మండలమున పద్మాసనములో వేంచేసి ఉన్న వాడిగా ధ్యానింపవలసిన వాడు)

ఇక మీద నాయనార్లు అట్టి సూర్య మండలమున వేంచేసి యుండు పద్ధతిని వర్ణించుచున్నారు.

తణ్డామరై సుమక్క
అనగా తిరువాయిమొళి 4.5.8 “తణ్ తామరై సుమక్కుమ్ పాదప్పెరుమాన్” (పద్మము పైన ఉన్న సర్వేశ్వరుడు) అని చెప్పినట్టు పద్మాసనం పైన ఉన్నవాడు “సరసి జాసన సన్నివిష్టహ”

తోళ్ వాళైయుమ్ కుళైయుమ్
దీనితో “కేయూరవాన్ మకర కుణ్డలవాన్” వివరించబడినది. (అనగా  – భుజ కీర్తులను మరియు మకర కుండలములను కల వాడు)

తిరుచ్చెయ్య ముడియుమ్ ఆరముమ్ పాడైయుమ్
దీనితో ” కిరీటీహారీ ధృత శంఖ చక్రః” వివరించబడినది. (అనగా – కిరీటమును మరియు దివ్యమైన శంఖమును, దివ్యమైన చక్రమును ధరించిన వాడు)

తిగళుమ్ పొన్మేనియుమ్
అనగా పెఱియ తిరుమొళి 1.5.10 “ఆరముమ్ పడైయుమ్ తిగళ” (హారము మరియు దివ్యాయుధములు ప్రకాశింపగా) అని చెప్పినట్టు ఇంతక ముందు ప్రస్తుతింపబడ్డ దివ్య ఆభరణములు మరియు దివ్య ఆయుధములు ప్రకాశించబడినవి అయినట్లు. దివ్య శరీరము బంగారు వర్ణములో ఉండు మూండ్రామ్ తిరువందాది 1 “పొన్మేని కణ్డేన్” (బంగారు వర్ణమును దర్శించితిని). ఛాందోగ్య ఉపనిషత్తు “య ఏషోన్తరాదిత్యే హిరణ్మయః పురుషో దృశ్యతే హిరణ్యశ్శశ్రు ర్హిరణ్యకేశ అప్రణఖాత్సర్వ ఏవ సువర్ణః” (సూర్య మండల మధ్యన ఉన్న మరియు యోగులచే దర్శింపబడు ఆ సర్వేశ్వరుడు బంగారు మీసకట్టు ,బంగారు జుట్టు(కేశములు) కలిగి ఉన్నాడు. అతని భుజములు బంగారు వర్ణములో ఉన్నవి) మరియు “హిరణ్మయ వపుః”(బంగారు రూపము)

శెఞ్జుడర్ త్తామరైకణ్ణుమాయ్ అణినిఴమూర్తి ఈతెన్నుమ్బడి
అనగా తిరువాయిమొళి 5.4. 9 “అన్జుడర్ వెయ్యోన్ అణి నెడుందేర్ తోన్ఴాదాల్” (సుందరమైన తేజస్సుగల ఆదిత్యుని యొక్క సుందరమైన మరియు గొప్పదైన పొడవాటి రధము కనిపించక ఉన్నది) “శెఞ్జుడర్ త్తామరైక్కణ్ శెల్వనుమ్ వారాణాల్” (తామరుల వంటి ఎర్రని కన్నులు కలిగిన శ్రీమాన్ అయినట్టి ఎమ్పెరుమానుడు రాలేదే) అని ఆళ్వారు చెప్పినది ఆ సూర్య మండలమున వేంచేసి యున్న ఆ సర్వేశ్వరుని గురించే కదా! శృతి కూడా అట్టి లోకములో వేంచేసియున్న భగవానుని గురుంచి ఛాందోగ్య ఉపనిషత్తు “తస్య యధా కప్యాసం పుణ్డరీక మేవ మక్షిణీ”(సూర్యుని స్పర్శ చే వికసించిన తామరుల వంటి రెండు నేత్రములను కలవాడు) అని చెప్పినది ఇదే కదా! అందుచేత సూర్య కిరణములు ప్రవేశించుటచే వికసించిన మరియు ఎర్రని కాంతి కలిగిన తామర పువ్వు వంటి తిరునేత్రములను కలవాడు భగవానుడు.

అణినిఴమూర్తి ఈతెన్నుమ్బడి యిరణ్డైయుమ్ తన్నిఴమాక్కుగిఴ శెయ్యాళాన విద్యైయోడే
అనగా మూండ్రామ్ తిరువందాది 1 “తిరుక్కణ్డేన్”(మహాలక్ష్మిని చూచితిని) అని చెప్పినట్టు ఆమెను చూసిన తర్వాత ఆయన దివ్య రూపమును చూసి “రుక్మాభమ్” (బంగారు వంటి వర్ణము) అని చెప్పినట్టు సర్వేశ్వరుని దివ్య మంగళ విగ్రహమును సేవించి “పొన్మేని కణ్డేన్” (అతని బంగారు వర్ణమును చూచితిని) అది తేలికపాటి సూర్యుని కాంతితో పోలిఉన్న ఆమె దివ్య వర్ణముతో కలిసి ఉండడము చేత ఎంతో అందముగా ఉన్నట్టు, ఆళ్వారు “తిగళుమ్ అరుక్కన్ అణి నిఴముమ్ కణ్డేన్”(ప్రకాశించుచున్న సూర్యుని వలె దేదీప్యమానమైన తేజస్సును దర్శించితిని) అని చెప్పిరి. తిరువాయిమొళి 4.4.2 “శెయ్యదోర్ జ్ఞాత్తైక్ కాట్టిచ్ చరీతన్ మూరిత్తి ఈదెన్నుమ్”(ఎర్రని కాంతి గల విశిష్టమైన సూర్యుని వైపు చేతులను చూపి తాను ఇలా పలికెను “పెఱియ పిరాట్టిమార్లతో పాటు పూజింపబడు వాని యొక్క దివ్యమైన రూపము ఇది”) అని చెప్పినట్టు ఆ మండలమున ఉండు తన యొక్క తేజో వ్యాప్తి చేత ఎర్రని కాంతిచే అద్వితీయముగా ఉండు స్థితిని చూసి శ్రీమన్నారాయణుని దివ్య రూపము(శరీరము) ఇదియే అని భ్రమించి చెప్పినట్టు భగవద్విగ్రహము సూర్య మండలము ఈ రెండిటిని తన ప్రకాశమే అనుకునేట్టు చేయు ఎర్రని కాంతి కలది అని “హిరణ్య వర్ణామ్” (బంగారు వర్ణము కలిగివుండు) అని శ్రీ సూక్తములో చెప్పినట్టు మరియు అట్టి వర్ణముచే గుర్తింపబడు అని తిరువాయిమొళి 9.4.1 “కమల మలర్ మేల్ సెయ్యాళ్”(పద్మము పైన ఆశీనురాలైన ఎర్రని వర్ణమును కలది) అని చెప్పినట్టు తాను విద్యా అని పిలువబడుతుంది. “విద్యా సహాయం ఆదిత్య సమస్త విద్యా ప్రశదకమ్” (విద్యతో కలిసి ఉన్నవాడు, సూర్యుని యందు ఉండువాడు పెఱియ పిరాట్టిమార్లతో ఉండి విద్యను ఇచ్చువాడు) అనియు “విద్యా సహాయవన్తం మా మాదిత్యస్థం సనాతనం”(పెఱియ పిరాట్టిమార్లను తన సహచరిగా ఉన్నవాడు, ఆదిత్య మండలమున ఉన్నవాడు మరియు నిత్యమైనవాడు) అని పెఱియ పిరాట్టిమార్లతోకలిసి ఉన్న సర్వేశ్వరుడు అని అర్ధము.

ఆరక్కున్ మేవిన
అనగా పెఱియ తిరుమొళి 2.1.7 “వానిడై అరుక్కన్ మేని నిఴ్పాఴ్కు”(సూర్యుని అంతరాత్మగా ఉండు వాడు) అని చెప్పినట్టు సూర్యమండల మధ్యన ఉన్నవాడు. ఛాందోగ్య ఉపనిషత్తు “య యేషోంతరాదిత్యే” (సూర్య మండలములో ఉన్నవాడు) అని చెప్పినట్టు దాని గురుంచి ఇక్కడ ప్రస్తావించబడినది.

సదా ధ్యేయ తేజస్విన్
అనగా “ధ్యేయ స్సదా” అని చెప్పినట్టు సర్వ కాలమున ధ్యానమును చేయువారికి తేజస్సు కలిగిన భగవానుని విషయమున, కాటకము “హిరణ్మయ శ్శకుని ర్బ్రహ్మ నామ యేన సూర్య స్తపతి తేజసేత్తః”(బ్రహ్మము అనబడు పక్షి బంగారుమయమైనది. ఆతని తేజస్సు చేతనే సూర్యుడు ప్రకాశించుచున్నాడు), గాయత్రీ మంత్రము “తత్ సవితుర్ వరేణ్యమ్” (అన్నింటికీ కారణమగు భగవానుని తేజస్సును ధ్యానించుట) మరియు శ్రీ రంగరాజా స్తవం 2.79 “తేజః పరం తత్స వితుర్వరేణ్యం ధామ్నా పరేణా ప్రణఖాత్సువర్ణం”(సూర్యునికి తేజస్సు ఇచ్చునది నీవే అని వేదములు చెప్పుచున్నవి మరియు అతని తేజస్సు లోకులకు సూర్యుని ఉపాసించుటకు ఉపకరించుచున్నది. నీవు బంగారు వర్ణముతో ఉన్నావు.)

సామరసోద్గాన నామమ్ ఉళ్ళుఴైయాన్ ఆద్యన్తఙ్గళాలే
అనగా ఛాందోగ్య ఉపనిషత్తు “సామ్న ఉద్గీతో రసః”(ఉద్గీతము సామము యొక్క రసముగా ఉండును)అని చెప్పినట్టు ఉద్గీతము అను పిలువబడి ఉద్గణము ఛందోగ సామము యొక్క సారము. అందులో అది “ఉత్” అను దివ్య నామమును కలిగి ఉండి “తస్య ఉదితి నామ”(ఆ పేరు “ఉత్”)అని చెప్పినట్టు “ఉత్” అను తిరునామము తిరువాయిమొళి యొక్క అంతరంగ అర్ధమని మరియు ఆది అంతములను కలదని, తిరువాయిమొళి “ఉయర్వఴ” అని “ఉ” కారముతో ఆరంభించి “ఉయర్ న్దే” అని “త” కారముతో ముగించినదిగ ఉన్నది. “ఆద్యంతములలో” అని చెప్పినది పైన చెప్పినదానికి హేతువని(కారణము) తెలుపుటకుగా తెలుసుకొననిది.

ఓరాయిరమామ్ అవత్తిలే ఒన్ఴై
అనగా వేయి తిరునామములలో ఒక తిరునామము మనలను వేయి విధములుగా రక్షింపగలదు. తిరువాయిమొళి 9.3.1″ఓరాయిరమామ్ ఉలగేళళిక్కుమ్” (వేయి విలక్షణమైన తిరునామములను కలిగిన ఎమ్పెరుమానుడు. అందులో ఒక్కో నామము చేతనాచేతనులను వేయి విధములుగా రక్షింపగలవు.) అని అర్థము.

ఆయిరముగత్తినాల్ అరుళిన త్తీరం పోలే తీర్తన్గళ్ ఆయిరముమాగ విస్తారిక్కిరార్ ఎన్ఴు వేద గురు ఉపదేశమ్
అనగా వేదాచార్య భట్టరు వారు కృప చేసినట్టు ఎలా అయితే ఒక గంగ వేయి ఉపనదులుగా మరి లోకమును పవిత్రము చేసినట్టు పెఱియ తిరుమొళి 1.4.7 “ఆయిరముఖత్తినాల్ అరుళి మన్దరత్తిళిన్దు గంగై” (సర్వేశ్వరుడు దయతో తన దివ్య హృదయములో కోరికతో గంగా నది వేయి ఉపనదులుగా మరి మంధర పర్వతము గుండా ప్రవహించి క్రిందకు పడునట్టు చేసెను.) నమ్మాళ్వారు “ఉత్” అను తిరునామమును వేయి పాశురములుగా విస్తరింపజేసి ఈ లోకమును పవిత్రము చేసారు. తిరువాయిమొళి 7.10.11 “తీర్తన్గళ్ ఆయిరముమ్” (పవిత్రమును చేకూర్చు వేయి పాశురములు).

“విస్తరిక్కార్” అనుదానిచే తెలుపబడిన కర్తృత్వము అపౌరుషేయత్వమునకు హాని కలుగకుండా పూర్వము (శడకోపన్ శొల్) చెప్పిన రీతిన ఉన్నది.

చూర్ణిక 39 “ఎవ్వులగత్తు ఎవ్వెవైయుమ్” నుంచి ఇక్కడి వరకు ఈ క్రిందివి చెప్పబడినవి.

– నమ్మాళ్వార్లు ప్రసాదించిన నాలుగు ప్రబంధములు నాలుగు వేదములతో సామ్యమును కలిగి ఉండుట. \
– నమ్మాళ్వార్ల ప్రబంధములకు అంగములు, ఉపాంగములు కలవు.
– నమ్మాళ్వార్ల ప్రబంధములకు వేదము యొక్క ముఖ్య లక్షణములు ఉండుట.
– నమ్మాళ్వార్ల కర్తృత్వమునకు నిత్యత్వము, అపౌరుషేయత్వములకు హాని లేకుండుట.
– ఏ ప్రబంధము ఏ వేదమునకు సమానము అగుట.
– అందులో సామ వేదముతో సామ్యమును కలిగిన తిరువాయిమొళి సామ శ్రేష్ఠమగు ఛందోగ సామోపనిషత్తుతో సమానమైనది అని చెప్పబడినది.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-53-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment