ఆచార్య హ్రుదయం – 73

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 72

చూర్ణిక – 73

అవతారిక
ఆళ్వార్ల ప్రబంధములు వేద కార్యము(వేదము నుంచి వచ్చినది) అయినప్పటికీ వేదము వలె అధికారి నియమము లేకుండా ఇది (ఈ ఆళ్వార్ల ప్రబంధములు) అందరిచే అధ్యయనము చేయబడుటకు ఎట్టి బాధకము లేదు అని ఒక ఉదాహరణమును నాయనార్లు కృప చేయుచున్నారు.

చూర్ణిక
మృద్ఘటమ్బోలన్ఴే పొఴ్కుడమ్

సంక్షిప్త వివరణ
మట్టి కుండ వంటిది కాదు కదా బంగారపు కుండ

వ్యాఖ్యానము
అనగా మట్టి కుండ అందరూ తాకకూడనట్టిదై దానిని తాక కలిగే వారే తాకవచ్చునట్టు ఉండును కాని భూమి సంబంధము కలదైననూ బంగారపు కుండ అందరూ తాకతగినదిగా ఉంది కదా. అలానే కారణమగు వేదము అధికారి నియమము కలదియై ఉన్ననూ వేదం కార్యములు అయిన ఆళ్వార్ల ప్రబంధములు సంస్కార విశేషము చేత సర్వాధికారము కలిగినది అగుటకు ఎట్టి బాధకము లేదు. ఈ దృష్టాంతమున చెప్పబడిన కారణ వస్తువు (పృధివి) కంటే కార్య వస్తువు(బంగారు)  యందు తెలియబడు గొప్పతనము ఈ ఉదాహరణ ద్వారా వివరించబడిన సూత్రంలో వర్తిస్తుంది (అంటే, వేదం కంటే గొప్పదైన దివ్యప్రబంధం ).

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/06/29/acharya-hrudhayam-73-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment