ఆచార్య హృదయం – 79

ఆచార్య హృదయం

<< చూర్ణిక – 78

చూర్ణిక – 79

అవతారిక
ఇప్పుడు ఈ ముగ్గురి జన్మ స్థానమున పరిమళములను బట్టి ఆళ్వార్ల జన్మ స్థానము తక్కిన ఇద్దరితో పోలిస్తే ఎంతో గొప్పది అని నాయనార్లు ప్రతిపాదించుచున్నారు.

చూర్ణిక
మీన నవనీతఙ్గళ్ గంధిక్కుమ్ ఇడముమ్ వెఴికొళ్ తుళాయ్ కమళు మిడముమ్ తన్నిలొక్కుమో

సంక్షిప్త వ్యాఖ్యానము
చేపల వాసన మరియు వెన్న వాసన గల స్థలము సహజ పరిమళమును గల తులసిచే పరిమళించునట్టి స్థలము సమానములు అవుతాయా?

వ్యాఖ్యానము
అనగా – భగవత్సంబంధమును ప్రకాశింపజేయునది అయిన తులసి యొక్క పరిమళముతో పరిమళించునట్టి ఆళ్వార్ల అవతార స్థలముతో వెన్న వాసనతో నిండియున్న కృష్ణుని జన్మస్థానము మరియు చేపల వాసనతో నిండియున్న వ్యాసుని జన్మస్థానుము సమానములు అవుతాయా? ప్రాకృత విషయములతో సంబంధమును కలిగినవైనట్టి చేప మరియు వెన్న యొక్క వాసనలు ఉపాదేయములు కాజాలవు. కానీ భగవానుని అలంకరించు తులసి దివ్యమైనదై అట్టి పరీమళమును తీసికొనవలెను (ఉపాదేయములు). దీనితో ఆళ్వార్ల జన్మస్థానము యొక్క గొప్పతనము తక్కిన వాటి జన్మస్థానముల కంటే గొప్పదైనది అని ప్రతిపాదించబడినది. 

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/05/acharya-hrudhayam-79-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment