కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 34 – రుక్మిణి కళ్యాణం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 33 – ద్వారకా నిర్మాణం, ముచ్చుకుందుడిని అనుగ్రహించటం

కృష్ణుడు కాలయవన సైన్యాన్ని సంహరించిన తర్వాత, జరాసంధుడు భారీ సైన్యంతో యుద్ధం చేయడానికి వచ్చాడు. కృష్ణుడు అప్పుడు వారిని సంహరించాలి అనుకోలేదు. అందుకే బలరాముడితో కలిసి ద్వారకాకు పారిపోయాడు. జరాసంధుడు వారిని గుర్తించలేక, వారు చనిపోయారని భావించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు.

ఇప్పుడు, విదర్భ రాజు భీష్మకుడు తన కూతురు రుక్మిణికి వివాహం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. అతని కుమారుడు రుక్మి తన స్నేహితుడు శిశుపాలుని రుక్మిణిని వివాహం చేయాలని కోరాడు. కానీ రుక్మిణి శ్రీమహాలక్ష్మి పూర్ణావతారం. భగవాన్ ఈ లోకంలో అవతరిస్తే, ఆమె కూడా అతనితో పాటు వస్తుంది. ఆమెకు కృష్ణుని గురించి బాగా తెలుసు, ఆయననే వివాహం చేసుకోవాలని కోరుకుంది. కృష్ణుడు కూడా ఆమెను కోరాడు. రుక్మి బలవంతంగా రుక్మిణి-శిశుపాలుల వివాహం ఏర్పాటు చేసి, తేదీ నిర్ణయించారు. నిర్ణయించిన తేదీకి కొన్ని రోజుల ముందు, వివాహ కృతువులు ప్రారంభమయ్యాయి.

రుక్మిణి మనసులో అలజడి చలరేగింది. ఆమె ఒక బ్రాహ్మణుని తన తరపున కృష్ణునికి దూతగా పంపింది. ఆమె ఒక పత్రం రాసి అతనికి ఇచ్చి, ద్వారకకు త్వరగా వెళ్ళి కృష్ణునికి అప్పగించమని చెప్పింది. ఆ బ్రాహ్మణుడు త్వరగా ద్వారకాకు చేరి, పత్రాన్ని కృష్ణునికి అప్పగించాడు. ఆ పత్రంలో రుక్మిణి తనకు కృష్ణుని పట్ల ఉన్న గొప్ప ప్రేమను అందంగా వ్యక్తం చేసింది. అంతే కాకుండా, వివాహానికి ముందటి రోజు ఆమె నగరం బయట దుర్గా ఆలయానికి ఊరేగింపులో వెళ్తానని, అక్కడ నుండి ఆయనను తీసుకెళ్లమని కోరింది.

అది చూసి, కృష్ణుడు వెంటనే తన రథంపై బయలుదేరాడు, ఆమె నివసించే నగరం సరిహద్దుకు చేరాడు. బలరాముడు, ఇతర యాదవులు అతనితో పాటు వచ్చారు. అప్పుడు రుక్మిణి ఆలయానికి వెళ్లేందుకు సిద్ధపడుతోంది. ఆలయం సమీపంలో ఉండి, కృష్ణుడు తన పంచజన్య శంఖాన్ని పూరించి, తన విజయాన్ని ప్రకటించాడు. రుక్మిణి కృష్ణుడు వచ్చాడని అర్థం చేసుకొని ఆనందంతో మునిగిపోయింది. ఆమె ఆలయం సమీపంలోకి వచ్చినప్పుడు, కృష్ణుని రథంపై ఎక్కింది. కృష్ణుడు వెంటనే రథాన్ని గొప్ప వేగంతో నడిపాడు. రుక్మి, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనవారు కృష్ణుని ఓడించాలని ప్రయత్నించారు. బలరాముడు, ఇతర యాదవులు వారితో యుద్ధం చేసి గెలిచారు. రుక్మి చాలా కోపంతో తన సైన్యంతో కృష్ణుని వైపు వచ్చి యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో కృష్ణుడు రుక్మిని తన ఖడ్గముతో చంపాలని ప్రయత్నించాడు, కానీ రుక్మిణి అతన్ని అడ్డుకుంది. ఆ తర్వాత కృష్ణుడు రుక్మి తలను గొరిగించి, అతని ముఖాన్ని విరూప పరిచి, అవమానించాడు. ఆ తర్వాత రుక్మిణితో కలిసి ద్వారకకు చేరాడు.

ద్వారకా ప్రజలు కృష్ణుడు, రుక్మిణిని చూసి ఆనందంతో మునిగిపోయారు. వారికి అక్కడ ఒక్క గొప్ప వివాహ మహోత్సవం జరిగింది.

పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళిలో లో కృష్ణుడు రుక్మిణిని రథంపై ఎక్కించుకుని, రుక్మిని అవమానపరిచినట్టు చెబుతూ “ఉరుప్పిణి నంగైయైత్ తేరెఱ్ఱేక్ కొండు విరుప్పుఱ్ఱు అంగేగ విరైందు ఎదిర్ వందు సెరుక్కుఱ్ఱాన్ వీరం సిదైయ తలైయైచ్ చిరైత్తిట్టాన్ వన్మైయైప్ పాదిప్పఱ ధేవగి సింగత్తైప్ పాదిప్పఱ” (రుక్మిణిని రథంపై ఎక్కించుకుని, తీవ్ర యుద్ధం చేసి, వచ్చిన వీర రుక్మి తలను గొరిగంచిన, సింహమువంటి దేవకీ సుతుడు!, కృష్ణుని మహిమలను పాడుకొనుము) అని చెప్పాడు. ఆండాళ్ నాచ్చియార్ తమ నాచ్చియార్ తిరుమొళిలో శిశుపాలుడు రుక్మిణిని వివాహం చేసుకుంటానని ఆశతో ఉండగా కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడని “కణ్ణాలం కోదిత్తుక్ కన్ని తన్నైక్ కైప్పిదిప్పాన్ తిణ్ణార్న్దిరుందు శిశుపాలన్ తేసళిందు అణ్ణాందిరుక్కవే ఆంగవలైక్ కైప్పిదిత్తు పెణ్ణాళన్ పేణుమ్ ఉర్ పేరుమ్ అరంగమే” (శిశుపాలుడు రుక్మిణి పిరాట్టిని వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తిగా చేసుకుని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా నిలిచాడు. ఆ సమయంలో శిశుపాలుడు ఆకాశాన్ని చూస్తుండగా, ఎమ్పెరుమాన్ పరమ కరుణతో రుక్మిణి పిరాట్టి యొక్క దివ్య హస్తాన్ని పట్టుకున్నాడు. స్త్రీలందరికీ సహాయం చేసే వాడిగా ప్రసిద్ధి చెందిన ఆ ఎమ్పెరుమాన్, ఆసక్తితో కరుణతో నివాసం ఏర్పరుచుకున్న దివ్యస్థలం తిరువరంగం) అని చెప్పారు. నమ్మాళ్వార్ తిరువాయ్ మొళిలో “అన్ఱంగమర్ వెన్ఱు ఉరుప్పిణి నంగై అణి నెడుందోల్ పుణర్ందాన్” (ఆ రోజు యుద్ధంలో విజయం సాధించి, అందమైన విశాల భుజాలు గల రుక్మిణిని ఆలింగనం చేసాడు) అని చెప్పారు.

ఈ సంఘటనలో సారాంశం:

  • భగవంతుడి, ప్రధాన పట్టమహిషి, శ్రీ మహాలక్ష్మి భగవంతుడితో కలిసి అవతరిస్తూ, ఆయనను అనుభవిస్తుంది.
  • భక్తులు ప్రమాదంలో ఉన్నప్పుడు, భగవంతుడు, ఆ విపత్తు తొలగించడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/10/krishna-leela-34-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment