కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 33 – ద్వారకా నిర్మాణం, ముచుకుందుడిని అనుగ్రహించటం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 32 – సందీపని ముని వద్ద గురుకుల వాసం

గురుకుల వాసం పూర్తి చేసిన తర్వాత, కృష్ణుడు మథురలో నివసించాడు. కంసుని మరణం తర్వాత, అతని ఇద్దరు భార్యలు జరాసంధుని కూతురులు తమ తండ్రి దగ్గరకు వెళ్లి తమ దుఃఖాన్ని తెలియజేశారు. జరాసంధుడు చాలా కోపంగా, కృష్ణుని హతం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. భారీ సైన్యాన్ని సమీకరించి మథురకు చేరుకున్నాడు. కృష్ణుడు, బలరాముడు తమ సైన్యాన్ని సమీకరించి మథుర నుండి బయటకు వచ్చి జరాసంధుతో యుద్ధం చేశారు. చివరికి జరాసంధుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. బలరాముడు జరాసంధుని పట్టుకున్నాడు. కానీ కృష్ణుడు బలరాముడితో, “ఇప్పుడు జరాసంధుని విడిచి పంపేద్దాం. మనం భూమిలో అవతరించిన లక్ష్యం భూ భారం తొలగించడమే. ఇప్పుడు విడిచేస్తే, అతడు అన్ని దుష్ట శక్తులను సమీకరించి మళ్లీ వస్తాడు. అప్పుడు వారందరినీ హతం చేయవచ్చు” అన్నాడు. బలరాముడు అతడిని విడిచి పంపేశాడు. అక్కడి నుండి తప్పించుకున్న జరాసంధుడు మళ్ళీ వచ్చి కృష్ణుడితో పదిహేడు సార్లు ఇలాగే యుద్ధం చేసి ప్రతిసారీ ఓడిపోయి వెనక్కి తిరిగి వెళ్లాడు.

అప్పుడు, కృష్ణుడు, సమీపిస్తున్న గొప్ప ప్రమాదాన్ని అర్థం చేసుకుని వేరే చోటికి వలస వెళ్లాలని నిర్ణయించాడు. విశ్వకర్మను పిలిచి పశ్చిమ దిశలో సముద్ర తీరంపై ద్వారకా నగరాన్ని నిర్మించమన్నాడు. మథుర ప్రజలందరిని తీసుకెళ్లి ద్వారకలో నివసింపజేశాడు.

ఇంతలో జరాసంధుడు కృష్ణుని ఓడించే మార్గాన్ని ఆలోచిస్తున్నాడు. అప్పుడు కాలయవన అనే రాజు అక్కడికి వచ్చాడు. అతడు చాలా వీరోచితంగా కనిపించి భారీ సైన్యంతో ఉన్నాడు. జరాసంధుడు కాలయవనుడి సహాయంతో కృష్ణుని ఓడించవచ్చని భావించి అతడిని తన సైన్యంతో మథురకు పంపాడు. కాలయవనుడు మథుర ద్వారాలకు చేరుకున్నప్పుడు, కృష్ణుడు అందమైన తామర మాల ధరించి బయటకు వచ్చాడు. కాలయవనుడు చూస్తుండగానే కృష్ణుడు పరుగెత్తాడు. కాలయవనుడు కృష్ణుని వెంబడి పరిగెత్తాడు. ఇలా కొంత సేపు పరుగెత్తిన తర్వాత కృష్ణుడు ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు.

ఆ గుహలో ఇక్ష్వాకు వంశస్తుడైన మాంధాత పుత్రుడు, ముచుకుందుడు, చాలా కాలం నిద్రించి ఉన్నాడు. తన కుటుంబం నుండి చాలా కాలం దూరంగా ఉండి దేవతలకు సహాయం చేశాడు. దేవతలను యుద్ధాలలో గెలిపించాడు. దేవతలు వరం ఇస్తామని చెప్పగా, మోక్షం కావాలని అడిగాడు. వాళ్లు “మోక్షం మేము ఇవ్వలేం. ముందు మంచిగా నిద్రించండి” అన్నారు. అతడు ఆ గుహకు వచ్చి నిద్రించడం మొదలుపెట్టాడు.

కృష్ణుడు చీకటి గుహలోకి ప్రవేశించి ఒక మూలలో నిశ్శబ్దంగా నిలబడ్డాడు. వెనుక వచ్చి లోపలికి ప్రవేశించిన కాలయవనుడు నిద్రించే ముచుకుందుని చూసి అది కృష్ణుడు నటిస్తున్నాడని భ్రమించి కాలుతో తన్నెడు. ముచుకుందుడు నిద్ర నుండి మేల్కొని గొప్ప కోపంతో చూశాడు. ఆ చూపు వల్ల కాలయవనుడు బూడిదగా మారాడు.

అప్పుడు కృష్ణుడు బయటకు వచ్చి ముచుకుందుని ముందు నిలబడ్డాడు. ముచుకుందుడు కృష్ణుని సౌందర్యం చూసి ముగ్ధుడయ్యాడు. కృష్ణుడు తన స్వరూపాన్ని దర్శింపచేసాడు. ముచుకుందుడు అత్యంత ఆనందంతో మోక్షాన్ని ప్రార్థించాడు. కృష్ణుడు “నీ తర్వాత జన్మలో, నన్ను పొందుతావు” అన్నాడు.

ఆ తర్వాత కృష్ణుడు మథురకు తిరిగి వచ్చి కాలయవన సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఇలా జరాసంధుడు, కాలయవనుల ద్వారా సమీకరించిన దుష్ట శక్తులను నాశనం చేసి కృష్ణుడు భూభారాన్ని తొలగించాడు.

ఈ సంఘటనలోని సారాంశం:

  • భగవంతుడు దుష్టులను సంహరించడానికి వివిధ పద్ధతులు ఉపయోగిస్తాడు.
  • తన భక్తులకు అన్ని శుభాలను ప్రసాదిస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/09/krishna-leela-33-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment