శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 59 – పరమపదానికి తిరిగి వెళ్ళుట

నమ్మాళ్వార్ తన తిరువాయ్మొళిలో “కణ్ణణ్ కళల్ ఇణై నణ్ణుం మనం ఉడైయీర్ ఎణ్ణుం తిరునామం తిణ్ణం నారణమే” అని అనుగ్రహించారు. అంటే, శ్రీకృష్ణుని దివ్యపాదాలను చేరాలని కోరుకునేవారు “నారాయణ” అనే దివ్యనామాన్ని ధ్యానించాలి.
మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో నారాయణ నామానికి మరియు ఆ నామాన్ని కలిగియున్న అష్టాక్షర మంత్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ అష్టాక్షర మంత్రాన్నే తిరుమంత్రం అని గౌరవిస్తాము. ఒక ఆచార్యుడు శిష్యునిగా స్వీకరించిన వ్యక్తికి ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ తిరుమంత్రం మహిమను వేదాలు, ఋషులు, ఆళ్వారులు మరియు ఆచార్యులు ఎంతో విస్తారంగా కీర్తించారు. మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన అర్థ పంచకాన్ని ఈ తిరుమంత్రం ద్వారా గ్రహించగలుగుతాము. అర్థ పంచకం అంటే జీవాత్మ స్వరూపం (మన స్వరూపం) పరమాత్మ స్వరూపం (భగవంతుని స్వరూపం) ఉపాయ స్వరూపం (ఆయనను చేరే మార్గం) ఉపేయ స్వరూపం (ఆయనను చేరిన తరువాత పొందవలసిన పరమగతి) విరోధి స్వరూపం (ఆయనను చేరకుండా అడ్డుకునే అవరోధాలు)
ఈ లోకంలో మనం ఈ ఉన్నతమైన తత్త్వాలను తెలుసుకొని, మన పూర్వాచార్యులు చూపిన మార్గంలో జీవించాలి. అనంతరం భగవంతుని చేరి, ఆయనకు నిత్యకైంకర్యం చేయాలి.
భగవంతుని కళ్యాణగుణాలను, దివ్యలీలలను నిరంతరం ఆస్వాదిస్తే, మన పూర్వాచార్యులు చూపిన మార్గంలో నడవడం మనకు సులభమవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ శ్రీకృష్ణుని లీలలను, వాటి అంతరార్థంతో సహా, మనకు సాధ్యమైనంతవరకు ఆస్వాదించాము.
ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
మూలం : https://granthams.koyil.org/2023/11/05/krishna-leela-60-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org