ఆచార్య హృదయం – 7

ఆచార్య హృదయం

<< చూర్ణిక 6

అవతారిక
ఈ సత్త్వ రజస్తమో గుణములను కలిగియుండుటకు గల కారణమును వివరించుచున్నారు.

చూర్ణిక
సత్త్వ అసత్త్వ నిదానమ్ ఇరుళ్తరుమ్ అమలజ్గళాక ఎన్నుమ్ జన్మ జాయమాన కాల కటాక్షణ్గళ్

సంక్షిప్త వివరణ
ఈ సంసారము లో జన్మించునప్పుడు ఆ సర్వేశ్వరుని చల్లని చూపులు జీవుని పై ప్రసరించడం చేత సత్త్వ గుణము కలుగుటకును మరియు అట్టి చూపు ప్రసరించనందున అసత్త్వ (రజస్తమో) గుణము కలుగుటకు కారణమవుతున్నది.

వ్యా ఖ్యానము
అనగా – రజస్తమో గుణముల కారణము చేత అజ్ఞానముతో ఈ సంసారమున జన్మించుట, తిరువిరుత్తం 1 లో చెప్పినట్లు “ఇరుళ్ తరుమా జ్ఞాలత్తుళినిప్పి ఴవి” (ఈ సంసారమున జన్మించుట అజ్ఞానమును కలిగించును). సత్త్వ గుణమునకు కారణము ఏమి అనగా మహాభారత మోక్ష పర్వమున చెప్పినట్లు “జాయమానం హి పురుషం యం పశ్యే న్మధుసూదనః , సాత్విక స్సతు విజ్ఞేయః సవై మోక్షార్ధచిన్తకః ” (జన్మించు సమయమున ఎవ్వడిని సర్వేశ్వరుడు కటాక్షించునో, అట్టి వాడు సత్త్వ గుణ సంపన్నుడై, మోక్షమనబడు పురుషార్ధమున కోరిక కలిగి ఉంటాడు). తిరువాయిమొళి 1.9.9 “అవన్ కణ్గళాలే అమలజ్గళావిళిక్కు మ్” అని చెప్పి నట్లు (నా లో అన్ని దోషములను పోయేటట్టు ఆ శ్రియః పతి నన్ను కృపతో వీక్షించినాడు).

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/03/01/acharya-hrudhayam-7-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment