అవతారిక
వీటికి కారణమును వివరించుచున్నారు.
చూర్ణిక
ఇవత్తుక్కు మూలమ్ ఇరు వల్లరుళ్ నల్ – వినైకళ్
సంక్షిప్త వివరణ
ఈ సంసారములో జన్మించునప్పుడు సర్వేశ్వరుని కటాక్షమునకు గల కారణము ఆ శ్రియః పతి యొక్క గొప్ప దయ మరియు అట్టి కటాక్షము లేకుండుటకు గల కారణము ఈ జీవుని తాలూకు మిక్కిలి బలమైన పుణ్య /పాపములు.
వ్యాఖ్యానము
అనగా – ఈ సంసారమున జన్మకు గల కారణము ఆత్మతో విడదీయుటకు వీలుపడని మిక్కిలి బలమైన పుణ్య పాపములు, తిరువాయిమొళి 1.5.10 “శార్ న్దవిరువల్ వినై” (రెండు విధముల మిక్కిలి బలమైన కర్మ (పుణ్య /పాప) నాతోనే విడదీయుటకు వీలు కాకుండా ఉండుట)అని చెప్పినట్లు, సర్వేశ్వరుని కటాక్షణమునకు గల కారణము ఆయన యొక్క స్వభావరీత్యా ఉండు కృపా రూపమగు సుకృతము. తిరువాయిమొళి 5.9.10 “తొల్ అరుళ్ నల్ వినై” (గొప్ప విషయములు అయిన అతని కృప).
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/03/02/acharya-hrudhayam-8-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org