ఆచార్య హృదయం – 9

ఆచార్య హృదయం

<< చూర్ణిక 8

అవతారిక 

వీటికి కారణమును వివరించుచున్నారు.  

చూర్ణిక

కర్మ కృపా బీజమ్ పొయ్ నిన్ఴ,  అరుళ్ పురిన్ద, ఎన్గిఴ అవిద్యా సౌహార్దజ్గళ్ 

సంక్షిప్త వివరణ 

కర్మకు గల కారణము ఏమి అనగా ఆత్మ తాలూకు అవిద్య(అజ్ఞానము) మరియు కృపకు గల కారణము ఏమి అనగా దయ కలిగిన సర్వేశ్వరుని హృదయము.

వ్యాఖ్యానము 

అనగా – తిరువిరుత్తం 1 లో చెప్పినట్టు “పొయ్ నిన్ఴ జ్ఞానం” (అసత్యమగు జ్ఞానము) కర్మకు గల కారణము ఆత్మ యొక్క అజ్ఞానము. ఇరండామ్ తిరువందాది 59 “అరుళ్ పూరింద సిన్దై” (కృప తో కూడిన ఆలోచన) అని చెప్పినట్టుగా కృపకు గల హేతువు దయ కలిగిన సర్వేశ్వరుని హృదయము. “ఈశ్వరస్యచ సౌహార్దమ్ యద్రుచ్చా సుకృతం హరేః విష్ణోః కటాక్షం అద్వేషం ఆభిముఖ్యం చ సాత్వికైః సంభాషణమ్ షడేతాని ఆచార్య ప్రాప్తి హేతవః” (ఈశ్వరుని దయ కలిగిన హృదయము, తెలియకుండా ఈ చేతనుడు చేసిన మంచి పనులు, పాపములను హరించు ఆ సర్వేశ్వరుని చల్లని చూపులు, సర్వేశ్వరుని పట్ల ద్వేషము లేకుండుట మరియు అనుకూలముగా ఉండుట సత్త్వ గుణము మెండుగ(అధికముగా)  కలిగి ఉన్న పురుషులతో సన్నిహితముగా మెలుగుట అనే ఈ ఆరు కారణములు చేతనుని సదాచార్యుని ఆశ్రయించుటకు సహకరించును). ఈ చేతనుని ఉజ్జీవమునకు ఆ సర్వేశ్వరుడు చేసే ప్రయత్నాలకు గల కారణము ఆయనకు ఉండు మంచి హృదయము అని వివరించబడినది. అటువంటి దయ వలన ఆ సర్వేశ్వరుని మనస్సులో చేతనుని పట్ల కరుణ వికసించును.   

అడియేన్ పవన్ రమనుజ డసన్

మూలము : https://granthams.koyil.org/2024/03/04/acharya-hrudhayam-9-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment