ఆచార్య హృదయం – 10

ఆచార్య హృదయం

<< చూర్ణిక 9

అవతారిక 

ఆత్మ తాలూకు అజ్ఞానము(అవిద్య) మరియు భగవానుని సౌహార్ధమునకు(మంచి హృదయము) గల కారణమును వివరించుచున్నారు.  

చూర్ణిక

ఏతన్నిమిత్తమ్ మున్నమే ముతల్ మున్నమేయాన అచిదయన అనాది సమ్బన్దజ్గళ్

సంక్షిప్త వివరణ 

వీటికి గల కారణము ఏమి అనగా ఆత్మకు అచిత్(ప్రకృతి) తోనూ అయన(సర్వేశ్వరుని) తోనూ గల అనాదియైన సంబంధం.   

వ్యాఖ్యానము 

పైన సూత్రములోని “ఏతత్” అను శబ్దము అవిద్య మరియు సర్వేశ్వరుని మంచి హృదయమును సూచిస్తుంది. అనగా – తిరువిరుత్తం 95 “ముదావియిల్ తారుమారు ముయిర్ మున్నమే” (జీవుడు అనాది గా దేహ సంబంధం తో బద్దుడై ఉండెను). ఈ అవిద్యకు గల కారణము అనాదియైన అచిత్ తోటి సంబంధం. తిరువాయిమొళి 2.3.6 “అడియే నడన్దేన్ ముదల్ మున్నమే”(స్వభావ రీత్యా దాసుడగు నేను అనాదిగ నిన్ను పొందలేక పోతిని?) అని చెప్పినట్లు భగవానుని సౌహార్ధమునకు గల కారణము అనాదియైన భగవత్ సంబంధం.(సమస్త భూతములకు(నారములకు/జీవ రాశులకు) ఆశ్రయమగు భగవానుని “నారాయణ” అని అంటాము కదా?) 

అందువలన అనాది అగు అచిత్(ప్రకృతి) సంబంధం చేత అవిద్య కలుగును, ఆ అవిద్య పుణ్య పాపములను కలిగించును, ఆ పుణ్య పాపములు జన్మలు పొందునట్లు చేయును. అట్టి జన్మ/అవిద్య చేతనుని రజస్తమో గుణములతో ప్రవర్తింపచేయుచూ అర్థపంచక జ్ఞాన శూన్యతను కలిగించును. అట్టి అర్థపంచక జ్ఞాన రాహిత్యము వలన “అజ్ఞానాత్ సంసారః” అని చెప్పినట్లు ఈ సంసారమున దుఃఖములకు హేతువగును. అలానే అనాది అగు భగవత్ సంబంధం అతని మంచి హృదయమునకు కారణమగును, అట్టి మంచి హృదయము అతని లో గల దయకు కారణమగును, అట్టి దయ ఈ చేతనుని పైన కరుణగా ప్రసరించును. అట్టి కరుణ ఈ చేతనుని సత్వ గుణముతో ప్రవర్తింపచేయుచూ అర్థపంచక జ్ఞానమును కలిగించును. అట్టి అర్థపంచక జ్ఞాన వికాసము చేత “జ్ఞానాత్ మోక్షః” అని చెప్పినట్లు చేతనుని కి మోక్షము కలుగును.  

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/03/04/acharya-hrudhayam-10-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment