ఆచార్య హ్రుదయం – 55

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 54

చూర్ణిక – 55

అవతారిక
నమ్మాళ్వార్ల ప్రబన్ధములకు వేద ఉపబృంహణములతో సామ్యము ఉన్నప్పటికీ ఆ ప్రబంధములకు గల గొప్పతనము ఆర్షములు(ఋషులచే ప్రసాదించబడినవి)అయిన పురాణములకు లేదని చూపించదలచి పురాణములు మరియు ప్రబంధముల యొక్క ఆవిర్భావమునకు గల కారణములను వివరించదలచి నాయనార్లు మొదట ఋషులచే సృష్టింపబడ్డ పురాణములను గూర్చి చెప్పుచున్నారు.

చూర్ణిక
కల్పాదియిల్ తోత్తిత్తు వర్ణిక్కుమ్ చతుర్ముఖన్ ఛన్దస్సుమ్ మోహశాస్త్ర ప్రవర్తకన్ పిణచ్చుడలై వెన్దార్ అక్కుమ్ ఆఴుమ్ అణిన్దు ఏఴేఴి చ్చుళన్ఴాడుమ్ ఆలమమర్ పిచ్చుత్తెళిన్దు తాన్ వణఙ్గుమాఴు ఉరైక్క కేట్ట సజాతీయర్ ప్రసాదముమ్ ఆర్షమూలమ్

సంక్షిప్త వివరణ
ఇతిహాసములు మరియు పురాణములకు మూల కారణము తన గుణములను బట్టి మాట్లాడు వాడు అయిన చతుర్ముఖ బ్రహ్మ యొక్క దయ మరియు మోహ శాస్త్రమును(తికమక పెట్టు సాహిత్యము) ప్రవర్తింపచేయువాడు శ్మశానమున భస్మమును పూసుకుని శవములు యొక్క ఎముకలను, పులి చర్మమును, గంగా నదిని ధరించి వృషభమును స్వారీ చేయువాడు, నృత్యము చేయువాడు, కంఠమున విషమును ధరించినవాడు అయిన రుద్రుడు తన యొక్క భ్రాంతి (భ్రమ) పోయిన తర్వాత ఋషులకు ఉపదేశించుట.

వ్యాఖ్యానము
అనగా – మాత్స్య పురాణము “యస్మిన్ కల్పేతు యత్ప్రోక్తం పురాణం బ్రహ్మణా పురా తస్య తస్యతు మహాత్మ్యం తత్స్వరూపేణ కధ్యతే” (ఇంతక ముందు కల్పమున బ్రహ్మచే చెప్పబడిన పురాణములు బ్రహ్మకు గల గుణములను బట్టి ఆయా దేవతల యొక్క గొప్పతనము చెప్పబడినది) అని చెప్పినట్టు సత్త్వ, రజస్సు, తమస్సు అను మూడు గుణములచే ప్రవర్తించు బ్రహ్మకు ఈ మూడు గుణములు ఒక్కొక్క  కాలములో ఒక్కోలా ఉంటూ మరియు ఒక గుణము కొన్ని సార్లు అధికముగా కలిగి ఉండుట.

కల్పము యొక్క ఆరంభమున సత్త్వ, రజో, తమో గుణములు మిశ్రమముగా ఉండుట వలన మాత్స్య పురాణము “సంకీర్ణా స్సాత్త్వికాశ్చైవ రాజసా స్తామసా స్తధా” (సత్త్వ, రజస్సు, తమస్సు గుణములు మిశ్రమముగా ఉండిన సమయమున) అని చెప్పినట్టు ఆయా గుణమునకు అనుగుణముగా మాత్స్య పురాణము “అగ్నేః శివస్య మహాత్మ్యం తామసేషు ప్రకీర్తితమ్ రాజసేషుచ మాహాత్మ్యమధికం బ్రహ్మణోవిధుః సాత్వికేష్వథ కల్పేషు మాహాత్మ్యమధికం హరేః తేష్వేవయోగ సంసిద్ధా గమిష్యన్తి పరాఙ్గతిమ్ సఙ్కీర్ణేషు సరస్వత్యాః పితృూణాఞ్చ నిగద్యతే”(తామస గుణము అధికముగా ఉన్న కల్పముల యందు శివుని యొక్క గొప్పతనము, రజో గుణము అధికముగా ఉన్న కల్పముల యందు బ్రహ్మ యొక్క గొప్పతనము,

సత్త్వ గుణము అధికముగా ఉన్న కల్పముల యందు శ్రీమన్నారాయణుని యొక్క గొప్పతనము,

సంకీర్ణ కల్పముల యందు పితృల యొక్క మరియు సరస్వతి యొక్క గొప్పతనమును వర్ణించు వాడు అయిన చతుర్ముఖ బ్రహ్మా) అని చెప్పినట్టు చతుర్ముఖ బ్రహ్మ తామస కల్పముల యందు అగ్ని, శివ, రాజస కల్పముల యందు అతని గొప్పతనమును, సాత్త్విక కల్పముల యందు సర్వేశ్వరుని గొప్పతనమును, సంకీర్ణ కల్పముల యందు పితృ, సరస్వతి యొక్క గొప్పతనమును వివరించును.

శ్రీ రామాయణ బాల కాండము 2.30 “మచ్ఛన్దాదేవతే బ్రహ్మాన్ ప్రవృత్తీయం సరస్వతీ” (ఓ వాల్మీకి! నీ యొక్క ఈ పలుకులు నా ఇఛ్చ వలన బయటకి వచ్చినవి) అని చెప్పినట్టు బ్రహ్మ యొక్క దయ వలన వాల్మీకి వాక్కులు పలికినారు. ఛందస్సు అనగా తలంపు అని అర్థము చేసుకొనవలెను. ఛందము అను దానికి కదా తలంపు అని అర్థము అని అనినచో ఛందస్సు అని అన్నా తలంపునే అర్థముగా ఆయా చోట్ల తీసుకొనుము అని.

కావున బ్రహ్మ యొక్క తలంపు వాల్మీకికి సహాయపడినది.

రుద్రుడు గొప్పవాడు అవ్వదలచి ఒక కోరికను ప్రార్థించెను. “అన్యం దేహి వరం దేవ ప్రసిద్ధం సర్వజన్తుషు మర్త్యో భూత్వా భవాదేవ మామారాధయ కేశవ మాం వృణీష్వ చ దేవేశ వరం మత్తో గృహాణ చ యేనాహం సర్వభూతానాం పూజ్యాత్పూజ్యతరోభవమ్”(ఓ స్వామి! ఓ కేశవ! దేవతలకు అధిపతి అయిన స్వామి! మానవునిగా నీవు నన్ను ఆరాధించు. నన్ను స్వామిగా అంగీకరించు. నా నుంచి వరమును కోరి నన్ను ప్రార్థించి వాటిని స్వీకరించుము. అట్టి వరము చేత నేను సర్వ స్వామి కంటే గొప్ప వాడిని అవుతానో, నాకు అట్టి వరమును ప్రసాదించుము.) అని అట్టి రుద్రుడు భగవానుని ఆజ్ఞ మేరకు “త్వంచ రుద్ర! మహాబాహో మోహ శాస్త్రాణి కారయ” (గొప్ప బాహువులను కలిగిన ఓ రుద్రా! మనుషులను తికమక పెట్టు శాస్త్రమును సృష్ఠించుము) అని చెప్పినట్టు తక్కువ స్థాయివి అయిన కర్మములను కలిగినది మరియు అధికముగా తమస్సును కలిగినదైన మోహ శాస్త్రములను(శైవము) కల్పించెను. పెఱియ తిరుమొళి 2.6.9 “పిణఙ్గిళిడు కాడు అతనూళ్ నడుమాడు పిఞ్చకన్” (శవములను తగలబెట్టు శ్మశానమున నృత్యమును చేయువాడు అయిన సంహారి రుద్రుడు) అనియు        
పెఱియ తిరుమొళి 10.1.5 “శుడలైయిల్ శుడనీఴన్”(శ్మశాన వాటిక నుండి భస్మమును ధరించువాడు) అనియు పెఱియ తిరుమొళి 1.5.8 “వెన్దార్ ఎమ్బుమ్ శుడనీఴుమ్ మెయ్యిల్ పూసి”(రుద్రుడు తనకు తాను గొప్పవాడిగా భావించి ప్రేత శరీరముల ఎముకలను ధరించి వాటి బూడిదెను పూసుకొనువాడు) అనియు పెఱియ తిరుమొళి 9.6.2 “అక్కుమ్ పులియిన్ అతళుమ్ ముడైయార్” (ఎముకలను, పులి చర్మమును ధరించువాడు) అనియు పెఱియ తిరుమొళి 6.7.9 “అఴుమ్ పిఴైయుమ్ అరవముమ్ అడమ్బుమ్ శడై మేల్ అణిన్దు”(గంగా నదిని, చంద్రుని, సర్పముని, అడప్పం అను పువ్వుని తన జటలలో ధరించినవాడు) అనియు ఇరండాం తిరువందాది 63 “ఏఴేఴి” (వృషభమును స్వారీ చేయువాడు) అనియు పెఱియ తిరుమాడల్ “శుళన్ఴు ఆడుమ్ కొణ్ణవిలుమ్ మూవిలై వేల్ కూత్తన్” (తన చూట్టూ తాను తిరుగుతూ నృత్యము చేయువాడు మూడు పదునైన కోరలను కలిగి సంహారమున ఉపకరించునట్టి సూలము అను ఆయుధమునును ధరించిన వాడు అయిన నృత్యకారుడు అని గొప్పగా పిలువబడువాడు) అనియు ముదల్ తిరువందాది 4 “ఆలమ్ అమర్ కణ్డత్తు అరన్” (కంఠములో విషమును కలిగిన శివుడు) అని చెప్పినట్టు “ఉన్మత్తవదనున్మత్తః ప్రభుః ప్రభువతామపి రాత్రౌశ్మశానేప్యటసి తత్ కిమేతత్ తవేశ్వరః”(ఓ ఈశ్వర! నీకు ఎట్టి చికాకు(గందరగోళము) లేకున్నను గొప్పవారికి ప్రభువైనట్టి నీవు రాత్రుల పూట శ్మశానములో సంచరించు అల్పమైన పనులు ఎందుకు చేస్తున్నావు?) అని చెప్పినట్టు అట్టి విధముగా ఉన్న అతనిని తన భార్య అయిన పార్వతి ఇలా అడిగినట్లు “శ్మశానమున సంచరించుచు నీచ పనులు ఎందుకు చేసెదవు”? శ్మశానములో సంచరించుచు శవ భస్మమును శరీరమంతటా పూసుకొని, ఎముకల దండను మెడలో వేసుకొని, పులి చర్మమును ధరించి, గంగా నదిని, చంద్రుని ,సర్పముని జడలో ధరించి ఎలా అయితే సర్వేశ్వరుడు వేదమయుడు అయిన గరుత్మంతుని పైన ఎక్కి సవారి చేయునట్లు తన(శివుని) యొక్క మందబుద్ధికి అనుగుణముగా జ్ఞానహీనమగు వృషభమును వాహనముగా తీసుకుని తాగుబోతులు తాగి నృత్యము చేయునట్లు చుట్టూ తిరుగుతూ నృత్యము చేస్తూ కంఠములో విషమును ధరించుట చేత తన కంటే ఎక్కువ గొప్పవారు ఎవ్వరు లేరు అనుకోని తానే ఈశ్వరుడు అని భావన పోయి సత్త్వ గుణము వృద్ధి బొంది, సత్త్వ గుణము అనునది శ్రీ మహా విష్ణువును ప్రకాశింపజేయునది అని తలచి “అఘటిత ఘటనా” సమర్ధుడు అయిన ఆ సర్వేశ్వరుని ధ్యానించి, ఉపాసించి దానినే నలుగురు మహర్షులు అయిన అగస్త్య, పులస్త్య, దక్ష మరియు మార్కండేయునికి ఉపదేశించెను. నాన్ముగన్ తిరువాందాది 17 “ఆల్ మేల్ వళర్ న్దానైత్తాన్ వణఙ్గుమాఴ – నాల్వర్క్కు మేలైయు కత్తుఴైత్తాన్” (ఎమ్పెరుమానుని తాను ఆశ్రయించిన విధముగా నలుగురు ఋషులకు ఉపదేశించెను) అని చెప్పినట్టు సత్త్వ గుణ నిష్ఠులు అయిన ఆ నలుగురిలో ఒక్కరైన పులస్త్యుడు శ్రీ పరాశర భగవానునికి ఒక వరమును కృప చేసెను శ్రీ విష్ణు పురాణము 1.1.25 “పురాణసంహితా కర్తా భవాన్ వత్స భవిష్యతి దేవతా పారమార్థ్యంచ యధావద్వేత్స్యతే భవాన్”(ఓ వత్సా పరాశర! నీవు పురాణములను మరియు సంహితములను రచించువాడువగు. పరాత్పరుడు ఎవరో నీవు తెలుసుకొనగలవు.) అని చెప్పినట్టు మహర్షుల యొక్క అనుగ్రహము వలన ఋషి ప్రోక్తములగు ప్రబంధములు ఆవిర్భవించుటకు గల కారణమని తెలుస్తున్నది.

వాల్మీకి భగవానుని విషయములో తనను అనుగ్రహించిన బ్రహ్మ వేరొక జాతికి చెందినవాడు (వాల్మీకి నరుడు , బ్రహ్మ దేవత). కానీ పరాశర ఋషి విషయములో తనను అనుగ్రహించినది పులస్త్య ఋషి, అందుచేత వారు ఇరువురూ ఒకే గణమునకు చెందిన వారు అయ్యెను. మిగిలిన ఇతిహాస పురాణముల యొక్క మూలము ఆలోచించినచో అవి కూడా ఈ విధముగా ఉండునే కానీ నిర్హేతుకమగు భగవదనుగ్రహమును చూడలేము(గోచరించదు). అందుచేతనే వీటిని “ఆర్ష మూలము”(ఋషి మూలకము) అని నాయనార్లు చెప్పుచున్నారు.  

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/04/20/acharya-hrudhayam-55-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment