ఆచార్య హృదయం – 80

ఆచార్య హృదయం

<< చూర్ణిక – 79

అవతారిక
తక్కిన వారి జన్మస్థానముల కంటే ఆళ్వార్ల జన్మస్థానమునకు గల వైలక్షణ్యమును నాయనార్లు వివరించుచున్నారు.

చూర్ణిక
అత్తిల్ తుఴైయిల్ ఊరిల్ ఉళ్ళ వైషమ్యమ్ వాచామగోచరమ్

సంక్షిప్త వ్యాఖ్యానము
నది యందు రేవు నందు ఊరి యందు ఉన్న వైషమ్యము (వైరుధ్యము) మాటలకు కూడా అందనిది.

వ్యాఖ్యానము
అనగా – వ్యాసుని జన్మస్థానమున గంగా నదికి అశిష్ఠ పరిగ్రాహము కలదై (శిష్ఠులతో సంబంధము) ఆ రేవు కూడా ఓడల రేవు అయ్యి మరియు ఆ ఊరు చేపలు పట్టు సంఘముగా ఉండెను(మత్స్యకారుల గూడెము).

శ్రీ కృష్ణుని జన్మస్థానమున యమునా నదిలో ప్రవహించు నీరు నల్లదై తమో గుణమునకు ప్రతీకయై ఆ రేవు కాళియ యొక్క విషము చేత కలుషితమై, ఊరు గొల్లలుండు తిరుప్పావై 28 “అఴివు ఒన్ఴుమ్ ఇల్లాద ఆయ్ క్కులత్తు”(కొంచెమైననూ జ్ఞానము లేని గోప కులము)అని చెప్పినట్టు కుడి చేతికి ఎడమ చేతికి తేడా తెలియని గోపకులముతో ఉండియున్న ఊరియై అన్నట్టు.

ఇక ఆళ్వార్ల జన్మ స్థానము – విలక్షణమైన పదార్ధములకు నిలయమైన గొప్పదైన తామ్రపర్ణీ నది తిరువాయిమొళి 9.2.5 “పవళ నన్ పడర్ క్కీళ్ చ్చెన్గుఴై పొరునల్”(గొప్పదైన పగడము యొక్క పొద క్రింద శంఖములతో కూడియున్న తామ్రపర్ణీ) అని చెప్పినట్టు రేవు కూడా పరిశుద్ధములై తెల్లని శంఖములు కొట్టుకొని వచ్చి చేరునట్టి తిరువాయిమొళి 10.3.11 “పొరునల్ శంగణి తుఴై” అని చెప్పినట్టుగా గొప్పవారితో శ్లాఘ్యమైన తిరుక్కురుగూర్ అను ఊరు తిరువిరుత్తం 100 “నల్లార్ నవిల్ కురుగూర్”(ఆ సర్వేశ్వరుని కీర్తించు గొప్ప వారు ఉండు తిరుక్కురుగూర్) అని చెప్పినట్టు సంసారమును జయించుటచే సంపాదించబడిన కీర్తి గల అనేక శ్రీ వైష్ణవులు సుఖముగా వేంచేసియున్న విశాలమైన తిరునగరి తిరువాయిమొళి 3.1.11 “శయ పుగళార్ పలర్ వాళుమ్ తడమ్ కురుగూర్” విలక్షణులగు అనేకులు నిత్యవాసము చేయుచున్న తిరునగరి అని చెప్పినట్టు సంసారమును జయించి కీర్తిగల వారై భగవంతుని సేవించుచూ సుఖముగా ఉండు జ్ఞానాధికులగు విలక్షణులు అనేకులు నిరంతరము చేరియుండునట్టి తిరునగరియై ఉండును.

అందుచేత వారి జన్మస్థానములు, నదులు, రేవులు, గ్రామములను బట్టి వీరి జన్మ స్థానమగు నదికి, రేవునకు, గ్రామమునకు గల వైషమ్యము మాటలకు అందరానిది అవ్వడము చేత శ్రీ కృష్ణుని, వ్యాసుని యొక్క జన్మముల కంటే కృష్ణ తృష్ణా తత్త్వము అయిన ఆళ్వార్ల జన్మమునకు గల వైభావుమనకు అనుగుణములుగాను ఇంతక ముందు చెప్పదలచిన వాటిని అన్నింటినీ పూర్తిగా బయలు పరచినారు.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/06/acharya-hrudhayam-80-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment