శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 2 – సంగ్రహం

శ్రీ కృష్ణుడు క్షేమముగా శ్రీ గోకులములో పెరుగుతున్న సమయం లో, తల్లి యశోదా, శ్రీ నందగోపుడు మరియు గోప స్త్రీలు శ్రీ కృష్ణుడి పైన ఎంతో ప్రేమ కురిపించారు.
ఎలాగో కంసుడు, తనను సంహరించేది కృష్ణుడు అని తెలుసుకుని, తన మిత్రులు అయిన రాక్షసుల ద్వారా, కృష్ణుడిని చంపటానికి నిశ్చయించుకున్నాడు. మొదట తాను క్రూరమైన రక్కసి పూతనను పిలిచి, “నువ్వు గోకులానికి వెళ్లి కృష్ణుడిని చంపు” అని ఆదేశించాడు. అంతలో పూతన, తన సహజ స్వరూపములో వెళ్లకుండా, అందమైన యశోదా దేవిని పోలిన రూపాన్ని ధరించి వెళ్లింది. ఇక్కడ యశోదా దేవి కృష్ణుడిని నిద్రపుచ్చి ఇంటి పనులు చేసుకోవటానికి వెళ్లింది, ఆ సమయంలో పూతన, కృష్ణుడిని ఎత్తుకొని పాలివ్వాలనే ఉద్దేశంతో ముందుగా తన స్థనాలకు విషము పూసుకున్నది. విషపు పాలు కృష్ణుడికి పట్టించి చంపాలి అని ప్రణాళిక వేసుకుంది.
కృష్ణుడు, ఆ రాక్షసి రాకను గమినించి, తగిన రీతిలో సంహరించటానికి నిశ్చయించుకున్నాడు. తాను యశోదను పోలిన రూపములో ఉండటం కారణం చేత ఎవ్వరూ సందేహించలేదు. అప్పుడు ఆ రక్కసి కృష్ణుడిని వడిలో పడుకోపెట్టుకుని, పాలు పట్టటం మొదలు పెట్టింది. కృష్ణుడు కూడా అంతే ఆశగా తల్లి వద్ద లాగే త్రాగటం మొదలు పెట్టాడు. కానీ త్వరగా తన ప్రాణ వాయువును కూడా పీల్చి సంహరించాడు. ఆ రాక్షసి పెద్ద స్వరంతో “హా….” అనే శబ్దం చేస్తూ నేలకు ఒరిగి తన నిజరూపంలో ప్రాణం విడిచింది. అది చూసిన యశోద పరుగున వచ్చి, కృష్ణుడిని ఎత్తుకుని, దగ్గరికి తీసుకుంది.
ఈ సంఘటనని ఎందరో ఆళ్వార్లు తమ పాశురాలలో అనుభవించారు. పూతనను “పేయ్” , “పేయిచ్చి” , “పూతనై” అనే పదాలతో సంబోధించి, ఆ క్రూర సంఘటన తలుచుకుని భయపడేవారు.
ఈ సంఘటన వెనక ఉన్న కొన్ని అద్భుత అంశాలు చూద్దాం :
- శ్రీరామావతారంలో, స్వామి మొదట తాటక అనే స్త్రీని సంహరించారు, అలాగే శ్రీకృష్ణావతారంలో మొదట పూతనను చంపాడు.
- ఎలాగైతే ఆ రక్కసి ప్రేమ నట్టించిందో అలాగే కృష్ణుడు కూడా ప్రేమ నటించి, పాలు త్రాగాడు.
- తాను విషం కలిగినది అయినా, అది కృష్ణుడికే అని సమర్పించింది. కాబట్టే కృష్ణుడు, విషాన్ని స్వీకరించాడు, తనకే అని సమర్పించే వస్తువులను తాను స్వీకరిస్తాడు.
- కృష్ణుడు, పూతనను సంహరించాలి అని సంకల్పించలేదు, కానీ దురుద్దేశంతో వచ్చింది కనుక చనిపోయింది.
- ఎంత చక్కగా స్వామి పట్ల ప్రేమను నటించినా, ఆ దేవదేవుడు వాటిని అర్థం చేసుకుని వాటిని, నశింపచేస్తాడు.
మూలం : https://granthams.koyil.org/2023/08/24/krishna-leela-3-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org