కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 8 – యమలార్జున శాప విమోచనం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి 

<< 7 – వెన్న దొంగలించి దొరికిపోవటం

పూర్వం, మనం ఎలా భగవానుడు యశోదా దేవి చేత రోటికి కట్టివెయ్యటం అనుభవించాము. అలా యశోదా దేవి రోటికి కట్టివేసి తన దైనందన కార్యక్రమాలు చెయ్యటానికి వెళ్ళిపోయింది. కృష్ణుడు ఏమీ తోచక ఉండిపోయి, అలా రోటితో పాటుగా ప్రాకటానికి ప్రయత్నిచ్చారు, రోటిని క్రిందకి త్రోసి, దానితో వెళ్లసాగాడు, అలా అతను ప్రాకుతుండగా, వారు రెండు అర్జున వృక్షాలు ఒక్కదాని లాగా పెనవేసుకుని ఉండటం చూశారు. ఆ వృక్షాల వెనుక ఉన్న కథను చూద్దాం.

కుబేరుడి కుమారులు నళకూవర మరియు మణిగ్రీవులు, ఒక్కసారి ఆడుతూ నారద మహర్షి రాకను గమనించలేదు. నారద ఋషి ఆగ్రహంతో చెట్లుగా మారండి అని శపించారు, వారు భయపడి, శాపవిమోచన మార్గాన్ని ప్రార్థించారు. నారదుడు అనుగ్రహంతో, “మీరు గోకులంలో చెట్లుగా మారి ఉంటారు, భగవానుడే స్వయంగా వచ్చి మీ శాప విమోచనం కలిగిస్తాడు” అని చెప్పారు, వేరే దారి లేక వారి విధిని ఒప్పుకుని, యమార్జున వృక్షాలుగా మారారు.

ఆ రెండు వృక్షాలు చాలా దగ్గర ఉన్నాయి. గోకులంలో ఆ సమయంలో కృష్ణుడు ఈ జంట వృక్షాలు వద్దకు తన తల్లి కట్టిన రోటితో పాటుగా వచ్చాడు. మొదట తాను ఆ చెట్ల మధ్యన ఉన్న చీలిక నుండి వచ్చి రోటిని లాగ సాగడు, ఈ క్రమంలో, ఆ చెట్లు నేల మట్టం అయ్యాయి, ఆ శబ్దం విని, తిరిగి చూడగా, తాను ఎప్పడు చూడని దృశ్యం తారస పడటంతో, ఒక్క చిరునవ్వు నవ్వాడు. మునులు ఆళ్వార్ ఆచార్యులు ఈ వృత్తాంతాన్ని ఎంతో అందముగా అనుభవించారు. నళకూవరుడు మరియు మణిగ్రీవుడు, ఇద్దరు చెట్టు నుండి బయటకు వచ్చి, కృష్ణుడిని స్తుతించి, ప్రార్థించి, వారి అనుమతితో అక్కడ నుండి బయలుదేరారు.

ఈ వృత్తాంతాన్ని ఆళ్వారాదులు ఎన్నో చోట్ల కీర్తించారు. నమ్మాళ్వార్ వారి తిరువాయిమోళి లో “పోనాయ్ మా మరుదిన్ నడువే ఎన్ పొల్లా మణియే” (ఓ! రెండు జంట మద్ది వృక్షాల మధ్యనుండి వెళ్లిన, నా అపూర్వ రత్నమా!!); తిరుమంగై ఆళ్వార్ వారి పెరియ తిరుమొళి లో “నిన్ఱ మామరుదు” (ఎత్తుగా, బలంగా నిల్చున్న మద్ది వృక్షాలు); కులశేఖరాళ్వార్ వారి పెరుమాళ్ తిరుమొళి “మరుదు ఇరుత్తాయ్” (మద్ది చెట్లను క్రింద పడివేసిన వాడా) అని. ఇలా చాలా చోట్లు, ఆచార్యులు ఈ చెట్లల్లో రాక్షసులు వసించటం వల్ల, శ్రీ కృష్ణుడు వాటిని క్రింద పడేశారు అని వివరించారు.

ఈ సన్నివేశంలోని సారాంశం:

  • ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ ఒకవేళ తన తప్పు తెలుసుకుంటే, భగవానుడి కృప చేత, దాని ఫలితాన్ని తప్పించుకోగలడు.
  • ఎంత పెద్ద శత్రువు అయినా, భగవానుడు వారిని నశింప చెయ్యగలడు.

మూలం : https://granthams.koyil.org/2023/09/05/krishna-leela-8-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment