శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 27 – మథురా నగరం లో కృష్ణుడి ఆగ్రహానుగ్రహాలు

ఈ విధంగా, కృష్ణుడు, బలరాముడు తమను అలంకరించుకుని, ధనుర్యాగం జరుగుతున్న చోటుకు నేరుగా వెళ్లారు. కాపలాదారులు వారిని ఆపినప్పుడు, కృష్ణుడు అక్కడ ఉంచిన ధనుస్సును ఎత్తి, వింటినారిని ఎక్కిపెట్టాడు. తమపై దాడి చేయడానికి ప్రయత్నించిన కాపలాదారులను కృష్ణుడు, బలరాముడు ఇద్దరూ ఓడించారు.
వారు ఇద్దరూ ఆ తర్వాత మధురా నగరంలో సంచరిస్తూ, ఆనందించారు. రాత్రి తమ విడిదికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం కంసుని వద్దకు బయలుదేరారు. అప్పుడు, కోట ద్వారం వద్ద మొదట కువలయాపీడం అనే ఏనుగు వారిని ఆపింది. ఆ ఏనుగు చాలా పెద్దది, బలిష్టమైనది. దాని మావటి వాడు నైపుణ్యవంతుడు. ఏనుగు కూలిపోయినా, అతని ప్రతిభతో మళ్లీ లేపగలడు. అది మత్తు పదార్థాలతో పెద్దగా పెరిగి మదగజంగా మారింది. కృష్ణుడిని, బలరాముడిని చంపడానికి ఆ ఏనుగు ఎదురుచూస్తూ ఉండేది.
ఏనుగు కృష్ణుడిని చూసిన వెంటనే, మావటి వాడి ప్రేరణతో కృష్ణుడి వైపు దూసుకువచ్చింది. కృష్ణుడు తప్పించుకుని, దాని పాదాల మధ్యలోకి దూరి గుద్దాడు. తర్వాత దాని దంతాలను పగులగొట్టి, ఏనుగును, మావటి వాడిని చంపాడు. దాని దంతాలు చేతిలో పట్టుకుని విజయయాత్ర చేశాడు.
ఆళ్వార్లు ఈ సంఘటనను అనేక పాశురాలలో చెప్పారు. పొయ్గైఆళ్వార్ తమ ముదల్ తిరువన్దాది “వెన్ఱిశూళ్ కళిర్ట్రై ఊన్ఱి పొరుదు ఉడైవు కణ్డానుమ్” (అజేయమైన ఏనుగును ఓడించి దానిని ధ్వంసం చేసినవాడు) అని చెప్పారు. ఆండాళ్ తిరుప్పావై పాశురం “కొట్టుక్కాల్ కట్టిల్ మేల్”కి అచార్యుల వ్యాఖ్యానంలో, కృష్ణుడు కువలయాపీడం దంతాలను తన మంచంకోళ్లుగా ఉపయోగించాడని చెప్పారు. కులశేఖర ఆళ్వార్ తమ పెరుమాళ్ తిరుమొళిలో “వెంగత్తిన్ కళిరదార్తాయ్” (బలమైన హృదయం కలిగిన [కంసుని] ఏనుగును [కువలయాపీడంను] చంపినవాడా!) అని కీర్తించారు. తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళిలో “విఱ్పేరు విళవుమ్ కంజనుమ్ మల్లుమ్ వేళముమ్ పాగనుమ్ వీళ” (పెద్ద ధనుస్సు ఉత్సవం, కంసుడు, మల్లయోధులు, ఏనుగు, మావటివాడిని పడగొట్టినవాడా) అని కీర్తించారు.
ఈ సంఘటనలోని సారాంశం:
- భగవంతుడు శ్రీవైకుంఠం నుంచి గజేంద్రుని భక్తిని చూసి పరుగెత్తి వచ్చి రక్షించాడు. కానీ కృష్ణుడిగా, తనను వ్యతిరేకించిన ఏనుగును చంపాడు. ఏనుగు అయినా, మనుష్యులైన అయినా, దేవతలు అయినా, తనను ప్రేమించేవారిని సహజంగా కాపాడతాడు, వ్యతిరేకించేవారిని నాశనం చేస్తాడు.
- భగవంతుడు అతి కష్టమైన అడ్డంకులను సులభంగా తొలగిస్తాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/05/krishna-leela-28-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org