శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

కంసుని సంహరించి, కృష్ణుడు నేరుగా తమ తల్లిదండ్రులైన దేవకి, వసుదేవుల వద్దకు వెళ్ళారు. కృష్ణుని చూసి ఇద్దరూ అతి ప్రసన్నులు అయ్యారు. కృష్ణుడు వారి సంకెళ్లను తెంచి, వారి దుఃఖాన్ని తొలగించాడు. కృష్ణ-బలరాములు తమ తల్లిదండ్రులకు ప్రణామాలు చేశారు.
కృష్ణుడితో చాలా కాలం కలిగిన ఎడబాటు తలచుకుని దేవకీ పిరాట్టి చాలా దుఃఖపడినది.. ఆ దుఃఖాన్ని తొలగించటానికి, కృష్ణుడు అపారమైన ప్రేమను చూపించాడు. మాతృత్వ అనురాగం వల్ల ఆమె చను-పాలు సహజంగా వచ్చాయి, కృష్ణుడు అది స్వీకరించాడు. ఈ సంఘటనను గురు పరంపరా ప్రభావంలో, పరాశర భట్టరు స్వామి నంజీయర్‌కు వివరించినట్టుగా వర్ణించబడింది.
ఆళ్వార్లు, కృష్ణుడు తన తల్లిదండ్రుల దుఃఖాలను తొలగించిన విధానాన్ని అనేక పాశురాలలో అనుభవించారు. తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళిలో, “తన్దై కాలిల్ పెరు విలంగు తాళ్ అవిళి నళ్ళిరుట్కన్ వన్త ఎన్దై పెరుమానార్” (రాత్రి అంధకారంలో వచ్చి తండ్రి కాళ్ళలోని పెద్ద బంధనాలను తొలగించిన నా గొప్ప భగవంతుడా) అని, “తన్దై కాలిల్ విలంగరా వన్దు తొన్ఱియ తొన్ఱల్” (తండ్రి కాళ్ళ బంధనాలను తొలగించుటకు అవతరించిన గొప్ప భగవాన్) అని చెప్పారు. కులశేఖర ఆళ్వార్ తమ పెరుమాళ్ తిరుమొళిలో “ఆలై నీల్ కరుమ్బు” దశకంలో, దేవకిప్పిరాట్టి మనస్సును ధరించి, కృష్ణుని బాలలీలలను చూడలేకపోయామే అని బాధ పడుతూ పాడారు.
ఈ సంఘటనలోని సారాంశం:
- ఈ సంసారంలో భగవంతుడికి తల్లిదండ్రులైనా, దుఃఖాలను తప్పించుకోలేరు. కానీ వారికి కూడా, భగవంతుడే దుఃఖాలను తొలగిస్తాడు.
- భక్తులకు సహాయం చేయడంలో భగవంతుడు ఆలస్యం చేసిన, సరైన సమయంలో తప్పకుండా కాపాడతాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/08/krishna-leela-31-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org