శ్రీ వచన భూషణము – సూత్రము 5

శ్రీ వచన భూషణము << సూత్రము – 4 సూత్రము – 5 అవతారికమొట్టమొదట “వేదార్ధం.. ” మొదలగు వాక్యములచే పిళ్ళై లోకాచార్యుల వారు వేదమును, వాటి అర్ధములను, ఉపబృంహణములను విస్తృతముగా వివరించినారు. వేదము యొక్క భాగములు అయిన పూర్వ(కర్మ), ఉత్తర(బ్రహ్మ) విభాగములను వివరించినప్పటికీ చేతనుల ఉజ్జీవనమునకు కావలసిన అర్ధములను ప్రతిపాదించుటకు ఉపక్రమించిన వారై అవి (ఆ అర్ధములు) పూర్వ భాగము నుండి తెలియరానివి అగుట చేతను, ఉత్తర భాగము నందే తెలియవచ్చునవి అగుట చేతను, పూర్వ … Read more

శ్రీ వచన భూషణము – సూత్రము 4

శ్రీ వచన భూషణము << సూత్రము – 3 సూత్రము – 4 అవతారికఇతిహాసములు యొక్క గొప్పతనమును పిళ్ళై లోకాచార్యులు ఇంకనూ వివరించుచున్నారు. సూత్రముఅత్తాలే అదుముఴ్పట్టత్తు సంక్షిప్త వ్యాఖ్యానముఆ కారణము చేతనే ఇది మొదటగా పేర్కొనబడినది వ్యాఖ్యానము అత్తాలే…ఛాందోగ్య ఉపనిషత్తు 7.21 “ఇతిహాస పురాణం పంచమం”(ఇతిహాసములు మరియు పురాణములు పంచమ వేదము) అనియు బార్హస్పత్య స్మృతి “ఇతిహాస పురాణాభ్యామ్”(ఇతిహాసములు మరియు పురాణములతో) అని శృతి, స్మృతులలో ఈ రెంటిని గూర్చి చెప్పినప్పుడు ఇతిహాసములు పురాణముల కంటే ముందుగా … Read more

ఆచార్య హృదయం – 88

ఆచార్య హృదయం << చూర్ణిక  87 చూర్ణిక  88 భగవానుని కైంకర్యమునకు తగినవైన జంతు, పక్షి జన్మలను నిత్యసూరులు అంగీకరించుట సరియైనదే అయినా అలా కాకుండా ముముక్షువులు  భగవద్భాగవత శేషత్వమున కోరికతో  జంతు, పక్షి జన్మలను స్వీకరించుటకు ప్రార్థన చేసినప్పటికీ శాస్త్రములో ఉత్కృష్టమైన జన్మగా చెప్పబడిన బ్రాహ్మణ వర్ణమును ఎలా నిషేధించెదరు అన్న ప్రశ్నకు నాయనార్లు జవాబును కృప చేయుచున్నారు. చూర్ణికశేషత్వ బహిర్భూత జ్ఞానానన్ద మయనైయుం సహియాదార్ త్యాజ్యోపాధియై యాదరియార్ కళే సంక్షిప్త  వ్యాఖ్యానముజ్ఞానము మరియు ఆనందముతో … Read more

ఆచార్య హృదయం – 87

ఆచార్య హృదయం << చూర్ణిక – 86 చూర్ణిక – 87 అవతారికఆత్మకు స్వరూప నిరూపక ధర్మము అయిన శేషత్వమునకు తగినదైన జన్మయే ఉత్క్రుష్టమైనది అనునది సంసార వాసన(గంధము) ఎంత మాత్రము లేని నిత్య సూరులకు, ముముక్షువులకు(మోక్షమును పొందాలని కోరిక గల వారు) గల అట్టి జన్మ మీద ప్రీతి చేతనే అని ఇక మీద నాయనార్లు వివరించుచున్నారు.   చూర్ణికఅణైయ వూర పునైయ అడియుమ్ పొడియుమ్ పడ పర్వత భవనఙ్గళిలే ఏతేనుమాక జనిక్కప్పెఴుకిఴ తిర్యక్ స్ధావరజన్మన్గళై … Read more

ఆచార్య హృదయం – 86

ఆచార్య హృదయం << చూర్ణిక – 85 చూర్ణిక – 86 అవతారికఇంతక ముందు సూత్రములో “జన్మ ఉత్కర్ష అపకర్షఙ్గల్ తెరివతు” అని నాయనార్లు చెప్పడము చేత జన్మము యొక్క ఎక్కువ తక్కువు స్థాయిలకు కొన్ని అంశములు కారణమని సూచించబడ్డాయి. ఇక మీద చెప్పబోవు రెండు సూత్రములలో నాయనార్లు వాటిని బయలుపరుస్తూ అందులో మొట్టమొదట భగవానుని గురుంచిన జ్ఞానము లేకపోవుట వలన కలుగు తక్కువ జన్మ, తక్కువ వర్ణములను ప్రమాణములతో సూచించుచున్నారు. చూర్ణికఆజ్ఞర్ భ్రమిక్కిఴ వర్ణాశ్రమవిద్యావృత్తంగళై గార్ధభ … Read more

ఆచార్య హృదయం – 79

ఆచార్య హృదయం << చూర్ణిక – 78 చూర్ణిక – 79 అవతారికఇప్పుడు ఈ ముగ్గురి జన్మ స్థానమున పరిమళములను బట్టి ఆళ్వార్ల జన్మ స్థానము తక్కిన ఇద్దరితో పోలిస్తే ఎంతో గొప్పది అని నాయనార్లు ప్రతిపాదించుచున్నారు. చూర్ణికమీన నవనీతఙ్గళ్ గంధిక్కుమ్ ఇడముమ్ వెఴికొళ్ తుళాయ్ కమళు మిడముమ్ తన్నిలొక్కుమో సంక్షిప్త వ్యాఖ్యానముచేపల వాసన మరియు వెన్న వాసన గల స్థలము సహజ పరిమళమును గల తులసిచే పరిమళించునట్టి స్థలము సమానములు అవుతాయా? వ్యాఖ్యానముఅనగా – భగవత్సంబంధమును … Read more

ఆచార్య హృదయం – 78

ఆచార్య హృదయం << చూర్ణిక – 77 చూర్ణిక – 78 అవతారిక“ఆళ్వార్ల జన్మ వ్యాసకృష్ణాదుల జన్మము కంటే ఎలా గొప్పది”? అని అడిగినచో దానికి సమాధానముగా అనేక కారణములు చేత ఆళ్వార్ల జన్మము యొక్క గొప్పతనమును చెప్పి అందులో మొదట ఆళ్వార్ల తల్లిగారు వ్యాస, కృష్ణుని తల్లుల కంటే గొప్పవారు అని నాయనార్లు ప్రతిపాదించుచున్నారు. చూర్ణికపెత్తుమ్ పేఴిళన్దుమ్ కన్యకైయానవళుమ్ ఎల్లామ్ పెత్తాళాయుమ్ తత్తుక్కొణ్డాళ్ ఎన్బర్ నిన్నార్ ఎన్ఴుమవళుమ్ నెడుఙ్గాలుమ్ నఙ్గైమీరెన్ను మివర్ క్కు నేరన్ఴే సంక్షిప్త … Read more

ఆచార్య హృదయం – 77

ఆచార్య హృదయం << చూర్ణిక 76 చూర్ణిక – 77 అవతారికశ్రీ నమ్మాళ్వార్ల జన్మము, వ్యాసుని మరియు శ్రీ కృష్ణుని జన్మముతో సమానముగా ఇంతక ముందు నాయనార్లు కృప చేసినారు. ఇప్పుడు వీటికి గల తారతమ్యములను కృప చేయుచున్నారు. చూర్ణికకృష్ణ కృష్ణద్వైపాయన ఉత్పత్తిపోలన్ఴే కృష్ణతృష్ణాతత్త్వ జన్మమ్ సంక్షిప్త వ్యాఖ్యానము కృష్ణ తృష్ణా తత్త్వముగా తెలియబడు నమ్మాళ్వార్ల జన్మము కృష్ణ మరియు కృష్ణద్వైపాయన(వ్యాస) జన్మము కంటే వేరైనది. వ్యాఖ్యానముఅనగా – తిరుప్పావై 25 “ఒరుత్తి మగనాయ్ ప్పిఴన్దు ఓరురవిల్ ఒరుత్తి … Read more

ఆచార్య హృదయం – 76

ఆచార్య హృదయం << చూర్ణిక – 75 అవతారికభాషా నిరూపణము (తమిళము) బట్టి తిరువాయిమొళిని మరియు గ్రంధకర్త అయిన ఆళ్వారు యొక్క జన్మను(వర్ణమును) బట్టి విశ్లేషించుట తగదు అని ఇంతకు ముందు చెప్పినట్టుగా కాకుండా అట్టి వారికీ సంప్రాప్తమగు అనిష్టమును నాయనార్లు తెలుపుచున్నారు. చూర్ణికప్పేచ్చుప్పార్కిల్ కళ్ళ ప్పోయ్ న్నూల్ కళుమ్ గ్రాహ్యజ్గళ్ పిఴవి పార్ క్కిల్ అజ్ఞామోత్తుమ్ ఆఴుమూన్ఴుమ్ కళిప్పనామ్ సంక్షిప్త వ్యాఖ్యానముభాషకు ప్రాధాన్యతను ఇచ్చినచో వేదమును తిరస్కరించు సంస్కృతములో ఉండు తక్కిన సాహిత్యమును కూడా మనము … Read more

ఆచార్య హృదయం – 75

ఆచార్య హృదయం << చూర్ణిక – 74 అవతారికఈ విధముగా ప్రమాణము(తిరువాయిమొళి) మరియు ప్రమేయముల(అర్చావతారము) వైభవమును బయలుపరచిన తరువాత ప్రమాతృ(తిరువాయిమొళి చెప్పిన నమ్మాళ్వార్ల) వైభవుమును విస్తారముగా నాయనార్లు ప్రతిపాదించుచున్నారు. అందులో మొదటగా ఈ విధముగా అడిగినచో “తిరువాయిమొళి మరియు అర్చావతారములు గొప్పవి అయినప్పటికిని, ఈ ప్రబంధకర్త చతుర్ధ (శూద్ర) వర్ణమునకు చెందిన వారు కదా?” నాయనార్లు ఈ విధముగా సమాధానమును ఇచ్చుచున్నారు – భాగవతులలో శ్రేష్ఠులైన ఆళ్వార్ల జన్మ ఇటువంటిది అని నిరూపించుట వలన కలుగు దోషమును … Read more