ఆచార్య హృదయం – 36

ఆచార్య హృదయం << చూర్ణిక – 35 అవతారికఇక మీద కర్మ నిష్ఠులకు మరియు కైంకర్య నిష్ఠుల ఇరువురికి ప్రధానమైన పూర్వీకులను తెలుపుచున్నారు. చూర్ణికవిప్రర్ క్కు గోత్రచరణసూత్రకూటస్థర్ పరాశర పారాశర్య బోధాయనాధికళ్ ప్రపన్నజనకూటస్థర్ పరాజ్కుశ పరకాల యతివరాదికళ్ సంక్షిప్త వివరణబ్రాహ్మణుల యొక్క గోత్ర, చరణ మరియు సూత్రమునకు ప్రధాన పూర్వులు పరాశర, వ్యాస, బోధాయన మొదలగు వారు. ప్రపన్నులకుప్రధాన పూర్వులు నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు, శ్రీ రామానుజులు మొదలగు వారు. వ్యాఖ్యానముఅనగా – “అన్దణర్”  మరియు “మఴైయోర్” … Read more

ఆచార్య హృదయం – 35

ఆచార్య హృదయం << చూర్ణిక – 34 అవతారికఈ లక్షణములేనా వీరికి తగినవి? ఊరు, వంశము మొదలగు వాటి గురించి ఏమిటి అని అడుగగా నాయనార్లు వాటి గురించి చెప్పుచున్నారు. చూర్ణికఒరుతలైయిల్ గ్రామకులాది వ్యపదేశమ్ కులన్దరుమ్ మాశిల్కుడి ప్పళయెన్ఴు పతియాక క్కోయిలిల్ వాళుమ్ ఎన్బర్ కళ్ సంక్షిప్త వివరణకర్మ నిష్ఠులు తమకి తాము వారి ఊరు, వంశముతో గుర్తింపబడతారు. కైంకర్య నిష్ఠులు ఊరి పేరు, వంశమును పక్కనపెట్టి తమకి తాము దివ్యదేశములతో గుర్తింపబడతారు. వ్యాఖ్యానముఅనగా – ఒక … Read more

ఆచార్య హృదయం – 34

ఆచార్య హృదయం << చూర్ణిక – 33 అవతారికఈ విధముగా వీరి శ్రేష్ఠమైన జన్మముల యొక్క లక్షణములు వివరింపబడ్డాయి. చూర్ణికఅన్దణర్ మఴైయోరెన్ఴుమ్ అడియార్ తొణ్డర్ ఎన్ఴుమ్ ఇవర్కళుక్కు నిరూపకమ్ సంక్షిప్త వివరణకర్మ నిష్ఠులు “అన్దణర్”  మరియు “మఴైయోర్” గాను కైంకర్య నిష్ఠులు “అడియార్” మరియు “తొణ్డర్ ” గాను గుర్తింపబడ్డారు. వ్యాఖ్యానముకర్మ నిష్ఠులకు ఆత్మకు విశేషణమైన శరీరము ద్వారా వచ్చిన వర్ణము ఆ వర్ణమును బట్టి వచ్చిన వైదికత్వము లక్షణము. తిరుమాలై 43 “శాది అన్దణర్” (బ్రాహ్మణ … Read more

ఆచార్య హృదయం – 33

ఆచార్య హృదయం << చూర్ణిక – 32 అవతారికనాయనార్లు ఇంతక ముందు 31వ చూర్ణికలో కర్మమునకు, కైంకర్యమునకు గల అధికార భేదములను చూపించారు. 32వ చూర్ణికలో కర్మ నిష్ఠులతో కైంకర్య నిష్ఠులకు ఎటువంటి సంబంధము లేదనే విషయమును చూపించారు. ఇప్పుడు దీనితో మొదలుకొని కర్మ నిష్ఠుల, కైంకర్య నిష్ఠుల యొక్క జన్మము యందు గల భేదములను చూపించదలచి మొదట జన్మ తారమ్యతలను వివరించుచున్నారు. చూర్ణికవేదవిత్తుక్కళుమ్ మిక్కవేతయరుమ్ ఛందసామ్ మాతావాలుమ్ అతుక్కుమ్ తాయాయ్ తాయినుమాయిన  శెయ్యుమ్ అత్తాలుమ్ పిఴప్పిక్కుమతు … Read more

ఆచార్య హృదయం – 32

ఆచార్య హృదయం << చూర్ణిక – 31 అవతారికకర్మ నిష్ఠులకు(కర్మమును ఆచరించు వారికి) మరియు కైంకర్య నిష్ఠులకు(కైంకర్యమును చేయువారికి) మధ్య సఖ్యత పొసగదు అను విషయాన్ని ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికసాధనసాధ్యజ్గళిల్ ముదలుమ్ వర్ణధర్మికళ్ దాసవృత్తికళెన్ఴు తుఴై వేఴిడువిత్తతు సంక్షిప్త వివరణకర్మములను ఆచరించు వర్ణధర్మిలు మరియు కైంకర్యమును ఆచరించు దాసవృత్తులు కలిసి ఉండలేరు అందుచేత కైంకర్యమును ఆచరించు వారు కర్మమును ఆచరించువారితో గల సంబంధమును విడిచిపెట్టును. వ్యాఖ్యానముఅనగా – సాధనములో మొదటి మెట్టు కర్మము మరియు సాధ్యములో అంతిమ … Read more

ఆచార్య హృదయం – 31

ఆచార్య హృదయం << చూర్ణిక – 30 అవతారికఈ అసాధారణమైన పనిలో (కైంకర్యములో) నిమగ్నమైన వారికి సాధారణమైన పనులు(కర్మములు) సహజముగానే ఎలా వీడిపోవునో నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికజాత్యాశ్రమ దీక్షైకళిల్ భేదక్కుమ్ ధర్మజ్గళ్పోలే అత్తాణిచ్చేవకత్తిల్ పొతువానతు నళువుమ్ సంక్షిప్త వివరణఎలా అయితే కొన్ని ధర్మములు జాతి, ఆశ్రమ, దీక్షల యందు భేదములు కలవో కైంకర్యమున నిమగ్నమైనప్పుడు సాధారణ కర్మము విడిచిపోవును. వ్యాఖ్యానముఅనగా – ఆపస్తంబ సూత్రములో చెప్పినట్టు “స్వకర్మ బ్రాహ్మణస్య అధ్యయనమ్, అధ్యాపనమ్, యజనమ్, యాజనమ్, దానమ్, … Read more

ఆచార్య హృదయం – 30

ఆచార్య హృదయం << చూర్ణిక – 29 అవతారికకర్మము మరియు కైంకర్యములను ఇలా చెప్పుటకు గల కారణము వాటికి గల ఆయా స్థితులు చూర్ణికఇవత్తాలే సాధారణమ్ అసాధారణమ్ ఎన్నుమ్ సంక్షిప్త వివరణదీనితో భగవానుని సాధారణ మరియు అసాధారణ రూపములు చెప్పబడినవి వ్యాఖ్యానముఅనగా – ఈ విధముగా దేవతలలో అంతర్యామిగా మరియు అర్చావతారముగా ఉండు విషయమున సాధారణ రూపాలను కలిగిన భగవానుని లక్ష్యముగా చేసుకున్న కర్మము సాధారణము మరియు అసాధారణ(ప్రత్యేక) రూపములను కలిగిన భగవానుని లక్ష్యముగా చేసికొని ఉన్న … Read more

ఆచార్య హృదయం – 29

ఆచార్య హృదయం << చూర్ణిక-28 అవతారికవాటికి గల లక్ష్యములను వివరించుచున్నారు చూర్ణికఅరుళ్ ముడియనిఴుత్తి అడైయనిన్ఴతుమ్ నల్లతోర్అరుళ్ తన్నాలే నన్ఴుమ్ ఎళియనాకిఴతుమ్ విషయమ్ సంక్షిప్త వివరణఆ సర్వేశ్వరుని కృప చేత నియమితులై ఆయనని అంతర్యామిగా కలిగి ఉండు దేవతలు కర్మమునకు లక్ష్యము. తన కృప చేత అత్యంత సులభుడుగా ఉన్న ఆ సర్వేశ్వరుని అర్చావతారము కైంకర్యమునకు లక్ష్యము. వ్యాఖ్యానముఅది ఏమి అనగా – నాన్ముగన్ తిరువందాది 2 “ఎత్తవమ్ శెయ్దార్కుమ్ అరుళ్ ముడితాళి యాన్బాల్”(ఎవరైతే వారి శక్తికి తగ్గ … Read more

ఆచార్య హృదయం – 28

ఆచార్య హృదయం << చూర్ణిక – 27 అవతారికవీటికి ఆశ్రయములను వివరించుచున్నారు చూర్ణికమణ్డినారుమ్ మత్తైయారుమ్ ఆశ్రయమ్ సంక్షిప్త వివరణకర్మమునకు గల ఆశ్రయము ఇతరులైనవి మరియు కైంకర్యమునకు గల ఆశ్రయము దివ్యదేశములు. వ్యాఖ్యానముఅనగా – తిరుక్కురుందాండగం 19 “కణ్డియూర్ అరంగమ్ మెయ్యమ్ కచ్చిపేర్ మల్లై ఎన్ఴు మణ్డినార్”(తిరక్కండియూర్, శ్రీరంగము, తిరుమెయ్యమ్, కాంచీపురము, తిరుప్పేర్ నగర్, తిరుక్కడల్ మల్లై  ఇత్యాది దివ్యదేశముల యందు ప్రీతీ గల వారు) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుడు ప్రీతితో వేంచేసి ఉన్నట్టి దివ్యదేశముల యందు … Read more

ఆచార్య హృదయం – 27

ఆచార్య హృదయం << చూర్ణిక – 26 అవతారికకర్మమును కైంకర్యమును ఏవి కలుగచేయునో ఇక్కడ వివరించుచున్నారు చూర్ణికఇవత్తుక్కు విధి రాగజ్గళ్ ప్రేరకజ్గళ్ సంక్షిప్త వివరణవిధి మరియు కోరిక ఈ స్థితులను కలుగచేయును వ్యాఖ్యానముఅనగా – శాస్త్రములో చెప్పబడిన విధులైన యజుర్ వేదం “యజేత” (యజ్ఞమును చేయవలెను), కర్మ మీమాంస “జుహుయాత్” (హవిస్సును అర్పించు) అనునవి కర్మమును కలుగజేయునవి. శరణాగతి గద్యములో చెప్పబడిన కోరిక “అశేష శేషతైక రతి”(ఏ ఒక్క కైంకర్యమునూ వదలకుండా అన్ని విధముల కైంకర్యములను చేయుటకు … Read more