శ్రీ వచన భూషణము – సూత్రము 5

శ్రీ వచన భూషణము << సూత్రము – 4 సూత్రము – 5 అవతారికమొట్టమొదట “వేదార్ధం.. ” మొదలగు వాక్యములచే పిళ్ళై లోకాచార్యుల వారు వేదమును, వాటి అర్ధములను, ఉపబృంహణములను విస్తృతముగా వివరించినారు. వేదము యొక్క భాగములు అయిన పూర్వ(కర్మ), ఉత్తర(బ్రహ్మ) విభాగములను వివరించినప్పటికీ చేతనుల ఉజ్జీవనమునకు కావలసిన అర్ధములను ప్రతిపాదించుటకు ఉపక్రమించిన వారై అవి (ఆ అర్ధములు) పూర్వ భాగము నుండి తెలియరానివి అగుట చేతను, ఉత్తర భాగము నందే తెలియవచ్చునవి అగుట చేతను, పూర్వ … Read more

శ్రీ వచన భూషణము – సూత్రము 4

శ్రీ వచన భూషణము << సూత్రము – 3 సూత్రము – 4 అవతారికఇతిహాసములు యొక్క గొప్పతనమును పిళ్ళై లోకాచార్యులు ఇంకనూ వివరించుచున్నారు. సూత్రముఅత్తాలే అదుముఴ్పట్టత్తు సంక్షిప్త వ్యాఖ్యానముఆ కారణము చేతనే ఇది మొదటగా పేర్కొనబడినది వ్యాఖ్యానము అత్తాలే…ఛాందోగ్య ఉపనిషత్తు 7.21 “ఇతిహాస పురాణం పంచమం”(ఇతిహాసములు మరియు పురాణములు పంచమ వేదము) అనియు బార్హస్పత్య స్మృతి “ఇతిహాస పురాణాభ్యామ్”(ఇతిహాసములు మరియు పురాణములతో) అని శృతి, స్మృతులలో ఈ రెంటిని గూర్చి చెప్పినప్పుడు ఇతిహాసములు పురాణముల కంటే ముందుగా … Read more

ఆచార్య హృదయం – 88

ఆచార్య హృదయం << చూర్ణిక  87 చూర్ణిక  88 భగవానుని కైంకర్యమునకు తగినవైన జంతు, పక్షి జన్మలను నిత్యసూరులు అంగీకరించుట సరియైనదే అయినా అలా కాకుండా ముముక్షువులు  భగవద్భాగవత శేషత్వమున కోరికతో  జంతు, పక్షి జన్మలను స్వీకరించుటకు ప్రార్థన చేసినప్పటికీ శాస్త్రములో ఉత్కృష్టమైన జన్మగా చెప్పబడిన బ్రాహ్మణ వర్ణమును ఎలా నిషేధించెదరు అన్న ప్రశ్నకు నాయనార్లు జవాబును కృప చేయుచున్నారు. చూర్ణికశేషత్వ బహిర్భూత జ్ఞానానన్ద మయనైయుం సహియాదార్ త్యాజ్యోపాధియై యాదరియార్ కళే సంక్షిప్త  వ్యాఖ్యానముజ్ఞానము మరియు ఆనందముతో … Read more

ఆచార్య హృదయం – 87

ఆచార్య హృదయం << చూర్ణిక – 86 చూర్ణిక – 87 అవతారికఆత్మకు స్వరూప నిరూపక ధర్మము అయిన శేషత్వమునకు తగినదైన జన్మయే ఉత్క్రుష్టమైనది అనునది సంసార వాసన(గంధము) ఎంత మాత్రము లేని నిత్య సూరులకు, ముముక్షువులకు(మోక్షమును పొందాలని కోరిక గల వారు) గల అట్టి జన్మ మీద ప్రీతి చేతనే అని ఇక మీద నాయనార్లు వివరించుచున్నారు.   చూర్ణికఅణైయ వూర పునైయ అడియుమ్ పొడియుమ్ పడ పర్వత భవనఙ్గళిలే ఏతేనుమాక జనిక్కప్పెఴుకిఴ తిర్యక్ స్ధావరజన్మన్గళై … Read more

ఆచార్య హృదయం – 86

ఆచార్య హృదయం << చూర్ణిక – 85 చూర్ణిక – 86 అవతారికఇంతక ముందు సూత్రములో “జన్మ ఉత్కర్ష అపకర్షఙ్గల్ తెరివతు” అని నాయనార్లు చెప్పడము చేత జన్మము యొక్క ఎక్కువ తక్కువు స్థాయిలకు కొన్ని అంశములు కారణమని సూచించబడ్డాయి. ఇక మీద చెప్పబోవు రెండు సూత్రములలో నాయనార్లు వాటిని బయలుపరుస్తూ అందులో మొట్టమొదట భగవానుని గురుంచిన జ్ఞానము లేకపోవుట వలన కలుగు తక్కువ జన్మ, తక్కువ వర్ణములను ప్రమాణములతో సూచించుచున్నారు. చూర్ణికఆజ్ఞర్ భ్రమిక్కిఴ వర్ణాశ్రమవిద్యావృత్తంగళై గార్ధభ … Read more

అనధ్యయన కాలం

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః  అధ్యయనం అంటే చదవడం, నేర్చుకోవడం, పునఃపునః ఉచ్చరించడం / పఠించడం. వేదం ఆచార్యుల ద్వారా శ్రవణం చేస్తూ, అదే విధంగా అధ్యయనం చేయబడుతుంది. వేద మంత్రాలు నిత్య అనుష్ఠానాలలో భాగంగా క్రమం తప్పకుండా జపించబడతాయి. అనధ్యయనం అంటే అధ్యయనం చేయకుండా, పఠనం చేయకుండా విరమించటం అని అర్థం. సంవత్సరంలో కొన్ని కాలాలలో వేద పఠనం చేయరాదు. ఆ కాలాన్ని స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు … Read more

108 దివ్యదేశములు

శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః  ఆళ్వారులు తమ పాశురాల ద్వారా స్తుతించిన శ్రీమన్నారాయణుని దివ్య నివాస స్థానాలను  దివ్యదేశాలు అని పిలుస్తారు. ఈ దివ్యదేశాలు ఎంపెరుమాన్ కు అత్యంత ప్రియమైనవిగా ఉండటంవల్ల, ఇవి “ఉగందరుళిన నిలంగళ్” అని కూడా ప్రసిద్ధి చెందాయి. చోళ నాడు (శ్రీరంగం పరిసర ప్రాంతం) నాడు నాడు (మధ్య తమిళనాడు) తొండై నాడు (చెన్నై పరిసర ప్రాంతం) మలై నాడు (కేరళ) పాండియ నాడు … Read more

ఆచార్య హృదయం – 85

ఆచార్య హృదయం  << చూర్ణిక 84 అవతారిక ఇంకనూ ఆళ్వార్ల వైభవమునకు అనుకూలముగా ఉండు సామాన్యమగు భాగవత వైభవమును అనేక ఉదాహరణములచే తెలుపుతూ ఇటువంటి వైభవములను తెలిసిన వారికే కదా జన్మము యొక్క హెచ్చుతగ్గులు తెలియును అని ఈ చూర్ణికలో నాయనార్లు తెలుపుచున్నారు. చూర్ణిక మ్లేఛ్ఛనుమ్ భక్తనానాల్ చతుర్వేదికళ్ అనువర్తిక్క అఱివికొడుత్తు పావనతీర్ధప్రసాదనామెన్గిఱ తిరుముఖప్పడియుమ్, విశ్వామిత్ర – విష్ణుచిత్త – తులసీభృత్యరోడే ఉళ్ కలన్దు తొళుకులమానవన్ నిలైయార్ పాడలాలే బ్రాహ్మణవేళ్వికుఱై ముడిత్తమైయుమ్, కీళ్  మకన్ తలైమకనుక్కు సమసఖావాయ్ … Read more

ఆచార్య హృదయం – 84

ఆచార్య హృదయం  << చూర్ణిక 83 అవతారిక “ఈ విధముగా పరోపకారమునకై జన్మించిన ఆళ్వార్లు మొదటి మూడు వర్ణములలో కాక తక్కువదైన నాల్గవ వర్ణములో ఎందుకు జన్మించారు?” అని అడుగగా దానికి సమాధానముగా “అది కూడా పరోపకారము కోసమే” అని నాయనార్లు చెప్పుచున్నారు. చూర్ణిక వంశ భూమికళై యుద్ధరిక్క కీళ్ కులమ్ పుక్క వరాహ గోపాలరైప్పోలే ఇవరుమ్ నిమగ్నరై యుయర్ త్త విళిన్దార్ సంక్షిప్త వ్యాఖ్యానము ఎలా అయితే వరాహ పెరుమాళ్ళు భూమిని ఉద్ధరించుటకై మరియు కృష్ణుడు … Read more

ఆచార్య హృదయం – 83

ఆచార్య హృదయం  << చూర్ణిక 82 అవతారికఇక మీద ఆళ్వార్ల అవతారము వల్ల ఈ లోకమునకు కలిగిన ఉపకారమును గూర్చి నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికఆదిత్య రామ దివాకర భానుకళుక్కు పోకాత ఉళ్ళిరుళ్ నీఙ్గి శోషియాత పిఴవిక్కడల్ అత్తి వికసియాత పోతిల్ క్కమలమలర్ న్దతు వకుళభూషణ భాస్కరోదయత్తిలే సంక్షిప్త వ్యాఖ్యానముసూర్యునిచే, శ్రీ రాముడను సూర్యునిచే, శ్రీ కృష్ణుడను సూర్యునిచే పొనట్టి లోపలి అజ్ఞానమును చీకటి, ఎండిపోని సంసార సముద్రము,  వకుళ భూషణ సూర్యులు అయిన నమ్మాళ్వార్లు ఉదయించినప్పుడు … Read more