శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
ఈ సంచికలోని శీర్షికలు ఈ పుస్తకము నందు పొందుపరపబడినవి – https://onedrive.live.com/redir?resid=32ECDEC5E2737323!138&authkey=!AGEzjjKBL7vQGaw&ithint=file%2cpdf
జగదాచార్యులైన శ్రీ రామానుజులను “కారేయ్ కరుణై ఇరామానుజ” గా కీర్తిస్తారు – అనగా వారు, ప్రతి ఒక్కరిపై స్వేచ్ఛగా వర్షాన్ని కురిపించి ఆశీర్వదించు మేఘం వలె ఎంతో దయగలవారు (రామానుజ నూత్తందాది – 25) మరియు “దయైక సింధు” – అనగా కరుణా సముద్రులు (యోనిత్య మచ్యుత – తనియన్). ఆదిశేషుని అవతారమైన వీరిని, ప్రముఖంగా ఉడైయవర్, ఎమ్పెరుమానార్, శ్రీ భాష్యకార, యతిరాజ మొదలైన పేర్లతో పిలుస్తారు.
ఎమ్పెరుమానార్ కరుణ యొక్క గొప్పతనాన్ని మణవాళ మాముణులు తమ ఉపదేశ రత్నమాలై 37వ పాసురంలో ఆనందంగా తెలుపుతూ అన్నారు..
ఒరాణ్ వాళియై ఉపదేసిత్తార్ మున్నోర్
ఏరార్ ఎతిరాసర్ ఇన్నరుళాళ్
పారులగిల్ ఆసైయుడైయోర్కెల్లాన్ ఆరియర్గాళ్ కూరుం ఎన్ఱు
పేసి వరంబఱుత్తార్ పిన్
ఇతరులతో దివ్య జ్ఞానాన్ని పంచుకోవడం / బోధించడంలో ఎమ్పెరుమానారుకి ముందు ఆచార్యులు చాలా ప్రత్యేకత వహించే వారు. వారు ఉత్తరాపేక్షగల శిష్యులను సంపూర్ణంగా పరీక్షించి అర్హులైన వారికి మాత్రమే ఆ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే వారు. కానీ అపరిమితమైన సహజ కరుణతో నిండి ఉన్న ఎమ్పెరుమానార్ మాత్రం ఆ దివ్య సూత్రాలను తెలుసుకోవాలని ఇచ్చ ఉన్న వారికందరికీ వివరించి చెప్పారు. వారు నియమించిన ఎందరో ఆచార్యులను కూడా ఈ నియమాన్ని పాటించమని నిర్దేశించారు. అందువలన వారిని “కృపా మాత్ర ప్రసన్నాచార్య”గా (అనగా జీవాత్మ పట్ల కరుణతో నిండి ఉన్నవారు) మహిమాన్వితులయ్యారు. వారి కాలంలోనే ఈ శ్రీవైష్ణవ దర్శనం అత్యున్నత శిఖరాలకు చేరుకొని ఎమ్పెరుమానార్ దర్శనంగా పిలువబడింది.
ఎమ్పెరుమానార్ కు అసంఖ్యాకులైన శిష్యులు ఉండేవారు. వారు 74 మంది ఆచార్యులను నియమించారు, 12000 మంది గృహస్తులు, 700 మంది సన్యాసులు మరియు వేలమంది శ్రీవైష్ణవులు (ఎమ్పెరుమానార్ కు సంపూర్ణ శరణాగతి చేసిన ఎందరో స్త్రీలు మరియు పురుషులు) వారి కాలంలో ఉన్నారు. వివిధ బంధాలలో చిక్కుకొని బాధలుపడుచున్న వారిని చూచి ఎమ్పెరుమానార్ గొప్ప మనస్సుతో, స్త్రీలను మరియు పురుషులను మన సత్ సాంప్రదాయంలోకి తీసుకురావటానికి వున్న నిబంధనలను తొలగించారు, అభ్యున్నతి కొరకు సంకల్పించిన వారెవరైనా ఏ వ్యక్తి అయినా వారికి నిజమైన మార్గం చూపించాలనేవారు. “రామానుజ దివ్యాజ్ఞా వర్తదాం అభివర్తధాం” అని చెప్పినట్లుగా, వారు ప్రతి ఒక్కరి యొక్క ఉద్ధరణ కొరకు ఈ దివ్య ఆదేశాలను ఇచ్చారు.
వారి చివరి క్షణాల్లో, ఎమ్పెరుమానార్ వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా వారి శిష్యులకు చరమ సందేశం (అంతిమ సూచనలు) అని పిలువబడే విలువైన సూచనలను ఇచ్చారు. వీటిని 6000 పడి గురుపరంపరా ప్రభావం , వార్తా మాలై, ప్రపన్నామృతం మొదలైన వాటిలో గ్రంధస్తం చేశారు. ఇవే కాకుండా, వారు వంగి పురత్తు నంబికి ప్రత్యేకంగా ఇచ్చిన సూచనలు “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు)” అనే గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. విరోధి పరిహారంగళ్ అనగా అవరోధాల నిర్మూలన, విరోధి అంటే అవరోధాలు / విజ్ఞాలు అని అర్థం, పరిహారం అంటే తొలగింపు / నిర్మూలన అని అర్థం. ఈ గ్రంథంలో 83 వాక్యాలు (వచనములు / వాక్యములు) మరియు ఆ వాక్యాలకు తగిన వ్యాఖ్యానము ఎమ్పెరుమానార్ సూచనల ఆధారంగా వంగి పురత్తు నంబిచే సంగ్రహించబడినవి. ఈ వాక్యములు తత్వశాస్త్రం, అభ్యాసముల (నిద్ర, తినడం మొదలైనవి) యొక్క వివిధ నిర్దిష్ట అంశాలతో కూడినవి మరియు వంగి పురత్తు నంబి యొక్క వ్యాఖ్యానం ప్రతి అంశాలకు సంబంధించిన వివిధ చిక్కులను వివరిస్తుంది.
శ్రీ వైష్ణవులకు ఎంతో విలువైన ఈ గ్రంథం, ఈ రోజుల్లో మనం ఎదుర్కొనే అనేక సమస్యలను, వాని సూక్ష్మమైన వివరాలను తెలుపుతుంది. మన యొక్క ప్రతి చర్యలో, పరిస్థితిలోనూ మనం ఎలా ప్రవర్తించాలోనని మన మనస్సులో అనేక సందేహాలు ఉంటాయి. ఈ గ్రంథం స్పష్టంగా మన సరైన ప్రవర్తన, వ్యవహారాలను వివరంగా తెలియజేస్తుంది.
ఈ గ్రంథం మొదట శ్రీశైల అత్తంగి తిరుమలై శ్రీమాన్ శ్రీ ఉ. వే విధ్వాన్ తిరువేంకట తాతాచార్య స్వామి ద్వారా ధృవీకరించబడింది మరియు సిర్కా 1914 లో భాగవత విధేయ భాష్యం రామానుజ దాసన్ ద్వారా ప్రచురించబడింది. ఈ గ్రంథానికి సంక్షిప్త ఆంగ్ల అనువాదంతో పాటు వ్యాఖ్యానం శ్రీ ఉ. వే బి.ఎస్.ఎస్ అయ్యంగార్ స్వామి వ్రాశారు. శ్రీ ఉ. వే. వి. వి. రామానుజం స్వామి వారు ఈ వ్యాఖ్యానానికి సవివరంగా అర్థమును వ్రాశారు. శ్రీ ఉ. వే. బి.ఎస్. ఎస్ అయ్యంగార్ స్వామి ద్వారా ఈ గ్రంథం యొక్క ఆంగ్ల అనువాదాన్ని చూసి. వారి నుండి తెలుగు లిపిలో వ్రాసిన మూలంను వారు తీసుకొని శ్రీ ఉ. వే. డాక్టర్ ఎం. వరదరాజన్ స్వామి వారి సహాయంతో మూల గ్రంథాన్ని తమిళంలో వ్రాశారు. వారు క్రమంగా వ్యాఖ్యానమునకు సవివరంగా అర్థమును వ్రాసి, వాటిని ‘యతిరాజ పాదుకా’ అను పత్రికలో ధారావాహికగా విడుదల చేశారు. చివరికి వారు ఈ గ్రంథాన్ని ఒక పుస్తక రూపంగా ప్రచురించి ఏప్రిల్ 2010 లో విడుదల చేశారు. వారు కృతజ్ఞతతో ఈ విషయంపై శ్రీ ఉ. వే. ఎన్. ఎస్. కృష్ణన్ ఐయ్యంగార్తో చేసిన అనేక చర్చలను గుర్తుచేసుకున్నారు. శ్రీమత్ పరమహంస ఇత్యాది కలియన్ వానమామలై రామానుజ జీయర్ వారు వి. వి. రామానుజం స్వామిని ప్రశంసిస్తూ ఈ ప్రచురణకు వారి శ్రీముఖం (ప్రశంసా పత్రం) ఇచ్చారు.
ఈ పరిచయభాగం ప్రధానంగా శ్రీ ఉ. వే. వి. వి. రామానుజం స్వామి వారి పుస్తకం ఆధారంగా రాయబడింది. ఇందులో ప్రతి అంశంపై వివరంగా చర్చించబడే వ్యాసాల సుదీర్ఘ శ్రేణిలో ఉంటుంది. ఈ సూత్రాలను గురించి తెలుసుకోవటానికి ఉత్సాహం ఉన్న అనేక శ్రీవైష్ణవుల ప్రయోజనం కోసం సాధారణమైన తెలుగులో సూత్రాలను ఉత్తమంగా అందించడానికి అడియేన్ ప్రయత్నిస్తారు. అస్మదాచార్య కృపతో, శ్రీ యు.వి.వి.వి.రా రామానుజం స్వామి ఇచ్చిన సరళమైన తమిళ్ వివరణల సహాయంతో ఈ కార్యాన్ని మొదలు పెడుతున్నాను.
అండాళ్ నాచ్చియార్ తిరుప్పావై చివరలో ఎమ్బెరుమాన్ ని తన సేవాకాలంలో అడ్డంకులను తొలగించమని ప్రార్థిస్తుంది. ఆమె “ఉనక్కేనాం అట్చేవోం మాత్తైనం కామంగళ్ మాత్తు” అని – నిర్మలమైన మనస్సుతో కేవలం మీ ఆనందం కోసమే సేవించాలని ఆశీర్వదించమని కోరుతుంది (ఎమ్బెరుమాన్ ని సేవిస్తున్నప్పుడు మన స్వంత ఆనందాన్ని సంతృప్తి పరచడమేమీ ఉండకూడదు). మన రోజువారీ జీవితంలో మనము ఎదుర్కొంటున్న అడ్డంకులను స్పష్టంగా అర్థం చేసుకునే ప్రాముఖ్యత ఉంది మరియు వాటిని ఎలా తొలగించాలో స్పష్టంగా అర్థం చేసుకొని, తద్వారా కేవలం ఎమ్బెరుమాన్ ఆనందం కోసమే సేవించే స్థితిని చేరుకోవాలి.
- భాగము 1 (ప్రాథమికములు)
- భాగము 2
- భాగము 3
- భాగము 4
- భాగము 5
- భాగము 6
- భాగము 7
- భాగము 8
- భాగము 9
- భాగము 10
- భాగము 11
- భాగము 12
- భాగము 13
- భాగము 14
- భాగము 15
- భాగము 16
- భాగము 17
- భాగము 18
- భాగము 19
- భాగము 20
- భాగము 21
- భాగము 22
- భాగము 23
- భాగము 24
- భాగము 25
- భాగము 26
- భాగము 27
- భాగము 28
- భాగము 29
- భాగము 30
- భాగము 31
- భాగము 32
- భాగము 33
- భాగము 34
- భాగము 35
- భాగము 36
- భాగము 37
- భాగము 38
- భాగము 39
- భాగము 40
- భాగము 41
- భాగము 42
- భాగము 43
- భాగము 44
- భాగము 45
- భాగము 46
- ముగింపు
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/virodhi-pariharangal-english/
మూలము : https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org