శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తిరుమంజనం అప్పా తిరుకుమార్తె జీయర్ వద్ద ఆశ్రయం పొందుట
ఒకానొక రోజు తెల్లవారుజామున, జీయర్ తమ స్నానమాచరించుటకు కావేరికి బయలుదేరినపుడు అనుకోకుండా వర్షం కురవడం మొదలైంది. వర్షం ఆగే వరకు ఒక ఇంటి అరుగులో నిలుచొని జీయర్ ఎదురుచూస్తున్నారు. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని భార్య జీయర్ పట్ల భక్తితో తన చీర అంచుతోటి ఆ అరుగుని శుభ్రం చేసి, “స్వామీ, దయచేసి ఇక్కడ కూర్చోండి” అని వేడుకొని, అత్యంత వినయంతో, భక్తితో వారి చరణాలను సేవించింది. జీయర్ తమ పాదుకలను పక్కన వదిలి అరుగుపైన కూర్చున్నారు. వార్షంలో తడుచున్న జీయర్ పాదుకలను తీసుకుని శిరస్సుపై పెట్టుకుంది. ఆ పాదుకల నుండి జలం కారి ఆమె తడిచిపోయింది. తరువాత ఆమె తన చీర అంచుతో ఆ పాదుకలను తుడిచి ఆరబెట్టింది. ఇవన్నీ చూసిన జీయర్ ఆమెను “ఎవరు నీవు? నీ పేరు ఏమిటి? ఇది ఎవరి ఇల్లు?” అని అడిగారు. ఆమె బదులిస్తూ “అడియేన్ దేవార్వారి దివ్య తిరువడి సంబంధం ఉన్న తిరుమంజనం అప్పా కుమార్తెను. అడియేన్ పేరు ఆచ్చి. వారి అల్లుడు కందడై అయ్యంగార్ల ఇల్లు ఇది” అని వివరించింది. అప్పా ఆ పేరు వినగానే ఎంతో సంతోషించి జీయర్ “ఓ! మన అప్పాచ్చియార్! [అప్పా కూతురు]” అని పలికి కృపతో ఆమెను ఆశీర్వదించారు. వర్షం ఆగిన తర్వాత కావేరికి బయలుదేరెను.
జీయర్ పాదుకల నుండి జాలువారిన జలముతో ఆచ్చి తడిచి, ఒక్కసారిగా భగవత్ జ్ఞానాన్ని పొందింది. ఆమె తక్షణమే జీయర్ దివ్య తిరువడి సంబంధం పొందాలని నిశ్చయించుకుంది. ఆమె తన తండ్రి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసింది. వారు ఎంతో సంతోషించి, ఆమె కొడుకులకి ఈ విషయం తెలియకూడదని ఆమెతో అన్నారు. జీయర్ తిరువడి సంబంధం పొందిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఆమెను తమ ఇంట్లోనే ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో, వారు ఆమెను జీయర్ తిరుమాలిగకి తీసుకెళ్లెను. జీయర్ ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ, విషయాన్ని జీయరుకి విన్నపించారు. జీయర్ అతనితో “కందాడై అయ్యంగార్ల వంశంతో సంబంధ పరచ వచ్చు కదా? ఇది ఫలించదు” [కందాడై అయ్యంగార్లు ముదలియాండాన్ వంశానికి చెందినవారు, స్వయంగా ఆచార్యులు కాబట్టి]. తిరుమంజనం అప్పా మనసు చిన్నబుచ్చుకోకుండా, తమ కుమార్తె భగవత్ విషయాసక్తి గురించి, జీయర్ ఆశ్రయం పొందాలనే ఆమె కోరిక గురించి వారికి వివరించి విజ్ఞప్తి చేశారు. “దేవార్వారు అనుకుంటున్న అడ్డంకులు సంభవించవు. దయచేసి ఆమెను అనుగ్రహించండి” అని జీయరుని ప్రార్థించారు. బహుశా ఆమె ద్వారా, దివ్య కందడై వంశం మొత్తము ప్రయోజనం పొందుతుంది అని జీయర్ భావించి, సమాశ్రయణం (పంచ సంస్కారాలు – తాప, పుండ్ర, మంత్ర, నామ, యాగం) నిర్వహించారు. అప్పా తమ కుమార్తెను తమ నివాసానికి తీసుకువెళ్లి, ఆమె కుమారులు అణ్ణా మరియు ఇతరులకు మరేదో కారణము చెప్పి ఆచ్చిని కొంత కాలము తమ తండ్రి వద్దనే ఉంది. జీయర్ దివ్య పాదుకలనుండి జాలువారిన జలముతో ఆచ్చి అనుగ్రహం పొందబడిన ఈ సంఘటన ఈ క్రింది శ్లోకంలో వర్ణింపబడింది.
శ్రీపాదుకాంబుజనితాత్మ వివేకరంగ భూనాథ తీర్థ జలదాతజమాతృదేవం ద్వన్ద్వచ్చితం నిఖిలదేశిక వంద్యపాదం సౌమ్యోపయంతృ మునివర్యమహం నమామి
(వేడి/చలి, సంతోషం/దుఃఖం వంటి జంట ప్రభావాలను దూరం చేసే జీయర్, వారి దివ్య పాదుకల నుండి జాలువారిన జలము వల్ల జ్ఞానాన్ని పొందిన తిరుమంజన అప్పా తిరుకుమార్తె ఆచ్చికి ఆచార్యులైన అళగియ మణవాళ మాముణులకు నమస్కరిస్తున్నాను.)
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/25/yathindhra-pravana-prabhavam-41-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org