ఆచార్య హ్రుదయం – 33

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 32

అవతారిక
నాయనార్లు ఇంతక ముందు 31వ చూర్ణికలో కర్మమునకు, కైంకర్యమునకు గల అధికార భేదములను చూపించారు. 32వ చూర్ణికలో కర్మ నిష్ఠులతో కైంకర్య నిష్ఠులకు ఎటువంటి సంబంధము లేదనే విషయమును చూపించారు. ఇప్పుడు దీనితో మొదలుకొని కర్మ నిష్ఠుల, కైంకర్య నిష్ఠుల యొక్క జన్మము యందు గల భేదములను చూపించదలచి మొదట జన్మ తారమ్యతలను వివరించుచున్నారు.

చూర్ణిక
వేదవిత్తుక్కళుమ్ మిక్కవేతయరుమ్ ఛందసామ్ మాతావాలుమ్ అతుక్కుమ్ తాయాయ్ తాయినుమాయిన  శెయ్యుమ్ అత్తాలుమ్ పిఴప్పిక్కుమతు ఇరువర్కుమ్ శ్రేష్ఠజన్మమ్

సంక్షిప్త వివరణ
వేదమందు నిష్ణాతులైన వారు అన్ని మంత్రములకు తల్లి వంటిది అయిన గాయత్రీ ఉపదేశము ద్వారా తిరిగి శ్రేష్ఠమైన జన్మమును పొందుతారు. వేదతాత్పర్యమందు నిష్ణాతులైన వారు అట్టి గాయత్రి మంత్రమునకే తల్లి అయిన తిరుమంత్రము ద్వారా శ్రేష్ఠమైన జన్మమును పొందుతారు.

వ్యాఖ్యానము
అనగా – పూర్వ భాగము(భగవానుని ఆరాధనాది విషయము గూర్చి మాట్లాడు వేద పూర్వ భాగము) యందు లగ్నమైన వేదాధికారులు మహాభారతము అరణ్య పర్వము 86.26 “యేచ వేదవిదో విప్రాః” (వేదములను తెలిసినవారు) లో చెప్పినట్టు అన్ని ఛందస్సులకు తల్లి అయిన గాయత్రి మంత్ర ఉపదేశము ద్వారా జన్మమును పొందుదురు. తైత్తిరీయములో చెప్పినట్టు “గాయత్రీం ఛందసాం మాతా” (అన్ని ఛందస్సులకు తల్లి)  ఇట్టి జన్మ కర్మ నిష్ఠులకు శ్రేష్ఠమైన జన్మ.

సకల వేద సారమైన వేద తాత్పర్య నిష్ణాతులను “మిక్క వేదియర్”అని పిలిచెదరు, శ్రీ పాంచరాత్రములో చెప్పినట్టు “రుచో యజుంషి సామాని తధైవ అధర్వణానిచ సర్వమ్ అష్టాక్షరన్తస్తమ్”(ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదములు మరియు ఇతర శాస్త్రములు అష్టాక్షరిలో పూర్తిగా కలవు). అట్టి అష్టాక్షరము గాయత్రికి కూడా తల్లి వంటిది. లోకములో తల్లి వలె కేవలము దేహమునకు జన్మనిచ్చుట కాక ఈ తిరుమంత్ర ఉపదేశము మోక్షమందు జ్ఞానమునకు దారి చూపించును. పెఱియ తిరుమొళి 11.9 “పెత్త తాయినుమ్ ఆయిన సెయ్యుమ్”(తల్లి కంటే ఎక్కువ ఉపకారము చేయు). కైంకర్య నిష్ఠులకు తిరుమంత్ర ఉపదేశము ద్వారా కలుగు జన్మ శ్రేష్ఠమైనది.

ఆపస్తంబ సూత్రము 1-1-6 “శరీరమేవ మాతా పితా జనతయః స హి విద్యాతస్తమ్ జనయతి తచ్ చ్రేష్ఠమ్ జన్మ”(మాతా పితరులు కేవలము దేహమును మాత్రము ఇవ్వగలరు,ఆచార్యుడు మాత్రమే జ్ఞానము ద్వారా ఆత్మ ఉజ్జీవనమును చేయగలడు. ఇట్టి ఆత్మయే శ్రేష్ఠమైన జన్మము). ఇక్కడ నాయనార్లు ఉట్టి జన్మ అని కాకుండా శ్రేష్ఠమైన జన్మ అని చెప్పుచున్నారు.

అట్టి జన్మ వర్ణ విధి నిషేధంబులకు మరియు అనుష్ఠానములకు మరియు ఫల ప్రాప్తికి తగినదైనందున అది కర్మ నిష్ఠులకు శ్రేష్ఠమైన జన్మ. ఈ జన్మ స్వరూపానురూపములగు విధి నిషేధములకు దానికి తగిన అనుష్ఠానములకు మరియు ఫల ప్రాప్తికి తగినదైనది అవ్వడము చేత వీరికి(కైంకర్య నిష్ఠులకు) ఆత్మ స్వరూపము శ్రేష్ఠమైన జన్మ.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-33-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment