ఆచార్య హ్రుదయం – 32

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 31

అవతారిక
కర్మ నిష్ఠులకు(కర్మమును ఆచరించు వారికి) మరియు కైంకర్య నిష్ఠులకు(కైంకర్యమును చేయువారికి) మధ్య సఖ్యత పొసగదు అను విషయాన్ని ఇక్కడ వివరించుచున్నారు.

చూర్ణిక
సాధనసాధ్యజ్గళిల్ ముదలుమ్ వర్ణధర్మికళ్ దాసవృత్తికళెన్ఴు తుఴై వేఴిడువిత్తతు

సంక్షిప్త వివరణ
కర్మములను ఆచరించు వర్ణధర్మిలు మరియు కైంకర్యమును ఆచరించు దాసవృత్తులు కలిసి ఉండలేరు అందుచేత కైంకర్యమును ఆచరించు వారు కర్మమును ఆచరించువారితో గల సంబంధమును విడిచిపెట్టును.

వ్యాఖ్యానము
అనగా – సాధనములో మొదటి మెట్టు కర్మము మరియు సాధ్యములో అంతిమ మెట్టు కైంకర్యము. దీనిని గ్రహించిన వారు “మీరు వర్ణ ధర్మము కలవారు, మేము దాసవృత్తి చేయువారము” అని చెప్పి వారితో గల సంబంధమును త్యజించి(వీడి) వేరొక స్నానము ఆచరించు రేవునకు వెళ్ళును. అది ఏమి అనగా తిరువహీంద్రపురమున “విల్లిపుత్తూర్ప్ పగవర్” అను ఒక సన్యాసి ఉండే వారు. అందరూ తమ తమ అనుష్ఠానములను ఒక రేవులో ఆచరించుచుండగా వీరు మాత్రము వేరొక రేవులో ఆచరించెడివారు. ఇలా ఉండగా ఒకనాడు ఆ స్వామి స్నాన అనుష్ఠానములను పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా ఒక బ్రాహ్మణుడు ఇలా అడిగిరి “ఓ జీయరు గారు! మీరు మీ అనుష్ఠానములను మా రేవులో ఎందుకు ఆచరించట్లేదు?” దానికి సమాధానముగా ఆ జీయరు ఇలా పలికిరి “విష్ణుదాసా వయం , యూయం బ్రాహ్మణ వర్ణధర్మిణః అస్మాకం దాసవృత్తీనాం యుష్మాకం నాస్తి సంగతిః” (ఓ బ్రాహ్మణులారా! మేము దాసవృత్తిని ఆచరించు విష్ణువునకు దాసులము, మీరు వర్ణాశ్రమ ధర్మాలను మాత్రమే ఆచరించు బ్రాహ్మణులు. మాకు మీతో ఎటువంటి సంబంధమూ లేదు” అని చెప్పి వేరొక రేవుకు వెళ్లిరి.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-32-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment