ఆచార్య హృదయం – 96

ఆచార్య హృదయం

<< చూర్ణిక 95

చూర్ణిక – 96

అవతారిక
“ఆళ్వార్ల పైన ఆ సర్వేశ్వరుడు నిర్హేతుకముగా ఎందుకు విశేష కటాక్షము కురిపించెను? అట్టి ఆ సర్వేశ్వరుని దివ్య అనుగ్రహము ఎటువంటిది? ఆళ్వార్లు ఏమి అయ్యారు?” అని ప్రశ్నించగా నాయనార్లు ఇప్పుడు కృప చేయుచున్నారు.

చూర్ణిక
గోవృద్ధిక్కు  నెరిన్ఴెయై ప్పుల్లాక్కినవన్ జగద్ధితార్ధమాక ఎనక్కే నల్లవరుళ్ కళ్ ఎన్నుమ్బడి సర్వసౌహార్ధ ప్రసాదత్తై ఒరుమడైశెయ్ తు ఇవరై త్తన్నాక్క లోకమాక తమ్మైప్పోల ఆక్కుమ్బడియానార్

సంక్షిప్త వ్యాఖ్యానము
లోక హితము కొరకు ముళ్ళతో కూడియున్న అడవిని ఆవులకు మేతగా పనికొచ్చే పొలములా మార్చినట్టి భగవానుడు అందరి పట్ల దయతో ఉండే ఆతని కారుణ్యమును ఒకే ప్రవాహములా కురిపించి ఆళ్వారు స్వయముగా తనలా అయ్యేట్టు మరియు అందరూ ఆళ్వారులా అయ్యేట్టు చేసెను.

వ్యాఖ్యానము
అనగా – తిరువాయిమొళి 10.3.10 “తివత్తిలుమ్ పసు నిరై మేయ్ ప్పువత్తి” (పరమపదములో ఉండుట కంటే ఆవులను మేపడమే ఎంతో సంతోషకరము) అని అన్నట్టు ఆ సర్వేశ్వరునికి పరమపదమునందు ఉండుట కంటే ఆవులను మేపడమే ఎంతో ప్రీతిపాత్రము శ్రీ విష్ణు పురాణము 5.6.28 “బృందావనమ్ భగవతా కృష్ణేనాక్లిష్టకర్మణా శుభేన మనసా ధ్యాతమ్ గవామ్ వృద్ధిమభిప్సతా” (ముళ్ళతో కూడి ఉన్న ఈ పొలాలు ఆవులు తిరుగుటకు పచ్చని సారవంతమైన పొలాలుగా అవ్వుగాక అని సర్వశక్తివంతుడైన శ్రీ కృష్ణుడు సంకల్పించెను) అని చెప్పినట్టు అందరి బాగోగుల పట్ల పూర్తిగా జాగురూకుడై ఉండు సర్వ శక్తిమంతుడైన ఆ స్వామి తన సంకల్పముతో ముళ్ళతో ఉన్న అడవి తిరుగుటకు వీలుగా ఉండు పొలము వలె మారుగాక అని శ్రీ విష్ణు పురాణము 5.6.37 “ఉత్పన్న నవచష్పాత్యా” (పచ్చని మంచి గడ్డితో నిండిపోయెను) అని గోసంరక్షణార్ధము ప్రతిజ్ఞ చేసెను. ఎలా అయితే తాను గోసంరక్షణ కోసము ఉన్నాడో అలానే ఈ లోక రక్షణము కోసము కూడా ఉన్నాడు. మహాభారతము “నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ జగద్ధిదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః” (బ్రాహ్మణులకు స్వామియైన వాడు, బ్రాహ్మణ మరియు గోసంరక్షణ చేయువాడు అయిన ఆ భగవానుని నేను ఆరాధిస్తున్నాను. లోకము మరియు గోహితమును చేయువాడు అయిన కృష్ణ, గోవిందుడిని నేను తదేకముగా అర్చిస్తున్నాను) అని చెప్పినట్టు ఈ లోక హితము కోసము ఆళ్వార్ల చేత ఇలా చెప్పించెను.

– నేను ఎన్ని జన్మలు ఎత్తానో అన్ని జన్మలకు సమానముగా తానూ జన్మించి నన్ను అనుగ్రహించునట్లు ఆ సర్వేశ్వరుని కృపను ఆశ్రయించి తిరువాయిమొళి 2.7.6 “ఎనైత్తోర్ పిఴప్పుమ్ ఎదిర్ సూళల్ పుక్కు ఎనక్కే అరుళ్ గళ్ సెయ్య అమ్మాన్ తరువిక్కరమనై విధి సూళన్దదు” (నాకు మధుసూదనుడు(నా విరోధములను తొలగించు వాడు) తప్ప వేరొక ఉపాయము లేదు) అన్నట్టు ఎట్టి ఫలాపేక్ష లేకుండా నేను ఆతని అసంఖ్యాకములైన గుణములను స్తోత్రములా ఆడి పాడితిని. నన్ను ఆ విధముగా మార్చుటకు తాను అనేకానేక అనన్యమైన జన్మములు ఒక కల్పము తరువుత మరొక కల్పములలో తీసుకొని నన్ను ఏమార్చి నాతో చెలిమిని చేసి. అట్టి స్వామి అయిన త్రివిక్రముడు నన్ను అనుగ్రహించుట కొరకే సిద్ధపడి కృపతో తప్పించారాని విధిగా ఉండిపోయాడు. )

– నాలో దోషములను, తన యొక్క సర్వజ్ఞత్వమును లెక్కింపక తనకు ఏదో ప్రయోజనము చేకూరును అన్నట్టుగా నాకు ప్రత్యేకముగా కృప చేసి తిరువాయిమొళి 8.6.1 “నల్ల అరుళ్ గళ్ నమక్కే తన్దరుళ్ సెయ్ వాన్” (ఎమ్పెరుమానుడు ప్రత్యేకముగా తన నిర్హేతుక కృపను అనుగ్రహించెను)

ఈ విధముగా శ్రీ భగవద్గీత 5.29 “సుహృదమ్ సర్వభూతానామ్” (అన్ని ప్రాణులకు శ్రేయోభిలాషి) అన్నట్టు అన్ని ప్రాణుల పైన చూపించిన కృప అంతా కలిపి ఆళ్వార్ల పైనే ప్రత్యేకముగా కురిపించి అసమర్ధత, అజ్ఞానములో ఉత్క్రుష్టులైన ఆళ్వార్లను జ్ఞానము, సామర్ధ్యములలో ఉత్క్రుష్టులైన తనతో సమానముగా మార్చి తిరువాయిమొళి 7.9.1 “ఎన్నైత్ తన్నాక్కి” (నన్ను తన లాగా చేసి) అన్నట్టు ఈ విధముగా ఆయన చేత సంస్కరింపబడిన ఆళ్వార్లు   తాను ఆ భగవానుని పట్ల చూపు భక్తిని తనతో ఉన్నవారికి కూడా కలిగేట్టుగా మార్చెను. తిరువాయిమొళి 6.7.2 “ఊరుమ్ నాడుమ్ ఉలగముమ్ తన్నైప్ పోలే అవనుడైయ పేరుమ్ తార్గళుమే పిదత్త” (ఊరు, దేశము మరియు ఈ లోకమును తన పేరు మరియు మాలను గూర్చి మాట్లాడేలా చేసెను)

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-96-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment