శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
5. కారిమాఱన్
నాలుగవ దివ్య నామము లో పేర్కొన్నట్లుగా, ‘మాఱన్’ అంటే లౌకిక వ్యక్తులకు భిన్నమైనవాడు అని అర్థం. ‘కారి’ అనేది నమ్మాళ్వార్ యొక్క తండ్రి గారి పేరు. కాబట్టి ‘కారిమాఱన్’ అంటే కారి కుమారుడైన నమ్మాళ్వార్ అని అర్థం.
నమ్మాళ్వార్ల వంశం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆ వంశంలోని వారందరూ భగవంతునికి పూర్తిగా శరణాగతులై ఉండేవారు మరియు ఇతర దేవతల పట్ల ఎటువంటి అనుబంధం కలిగి ఉండేవారు కాదు. కాబట్టి, నమ్మాళ్వార్ల వంశపారంపర్యంలో ఒక అత్యంత ముఖ్యమైన గుణం కనిపిస్తుంది.
నమ్మాళ్వార్ల వంశక్రమం ఇలా ఉంది – తిరువళుతి వళ నాడర్, ఆయన కుమారుడు అఱందాంగియార్. అఱందాంగియార్ కుమారుడు చక్రపాణియార్. చక్రపాణియార్ కుమారుడు అచ్యుతర్. అచ్యుతర్ కుమారుడు సెందామరై కణ్ణర్. సెందామరై కణ్ణర్ కుమారుడు పొఱ్కారియార్ పొఱ్కారియార్ కుమారుడు కారియార్ మరియు కారియార్ కుమారుడే మాఱన్ (నమ్మాళ్వార్).
అందువల్లనే ఆళ్వార్లు ‘కారిమాఱన్’ అని పిలువబడతారు.
6. తిరునావిఱుడైయ పిఱాన్
తిరునావిఱుడైయ పిఱాన్ అనేది తమిళ నామం.
పిఱాన్ అంటే శ్రేయోభిలాషి. తిరునావిఱుడైయ పిఱాన్ అంటే తమ దివ్యవాక్కులో శక్తిని కలిగి ఉన్నవారు అని అర్థం.
ఆళ్వార్లు స్వయంగా తమ తిరువాయిమొళి 6.4.9 లో ఇలా చెప్పారు – ‘కలక్క ఏళ్ కడళ్ ఏళ్ మలై ఉలగేళుమ్ కళియక్ కడాయ్’.ఈ పాశురంలో ఆళ్వార్లు ‘మాల్ వణ్ణనై మలక్కు నావుడైయేర్కు’ అని చెప్పారు; “సాక్షాత్తు భగవంతుడినే విస్మయానికి గురిచేయగలదు నా వాక్కు , అదే నా వాక్కు శక్తి”.
తిరువాయిమొళి 3.9.11 పాశురంలో – “ఏర్కుమ్ పెరుమ్ పుగళ్ వానవర్ ఈశన్ కణ్ణన్ తనక్కు| ఏర్కుమ్ పెరుమ్ పుగళ్ వణ్ కురుగూర్ చఠగోపన్ సొల్| ఏర్కుమ్ పెరుమ్ పుగళ్ ఆయిరత్తుల్ ఇవయుమ్ ఓర్ పత్తు|ఏర్కుమ్ పెరుమ్ పుగళ్ సొల్ల వల్లార్కిల్లై సన్మమే”,అంటే”కృష్ణునికి చాలా పవిత్రమైన అద్భుతమైన గుణాలు ఉన్నాయి మరియు అలాంటి భగవంతుని పాడటానికి అర్హత ఉన్నవాడెవడు?” అని అంటారు. అదే పాశురం యొక్క తదుపరి పంక్తిలో, ఆళ్వార్లు “ఏర్కుమ్ పెరుమ్ పుగళ్ వనణ్ కురుగూర్ చఠగోపన్” – “ఈ శఠగోపన్ అనే నేను,నాకు అలాంటి భగవానుని గురించి పాడే లక్షణాలు ఉన్నాయి” అని విశేషంగా చెప్పారు.
ఆళ్వార్లే స్వయంగా తమ వాక్కు అసాధారణమైనదని మరియు అత్యంత శక్తివంతమైనదని ప్రకటించారు.
వీడియోలింక్: https://www.youtube.com/shorts/_uIK0mPZtUw
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/03/nammazhwars-divine-names-karimaran-thirunavirudaiya-piran/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org