నమ్మాళ్వారుల దివ్య నామములు

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సంప్రదాయంలో, ఆళ్వార్లకు గొప్ప ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత ఉంది. ఆళ్వార్లందరిలో, నమ్మాళ్వార్ (శఠకోప స్వామి) ప్రధానులుగా ఉంటారు.

నమ్మాళ్వారులను ‘వేదం తమిళ్‌ శెయ్ద మాఱన్’ (వేద సారాన్ని తమిళ ప్రబంధాల రూపంలో అందించినవారు) అని అంటారు. ‘తిరువాయ్ మొళి’ (దీనిని ‘సహస్రగీతి’ అని కూడా అంటారు) వంటి తమిళ ప్రబంధాలలో ఆయన నాలుగు వేదాల సారాంశాన్ని అందించారు. అటువంటి నమ్మాళ్వార్ మనకు ఎంతో మేలు చేశారు.

నమ్మాళ్వార్లు చేసిన గొప్ప ఉపకారాలలో రెండు గొప్పగా నిలుస్తాయి. మొదటిది నాలుగు వేదాల సారాంశమైన నాలుగు దివ్య ప్రబంధాలను నమ్మాళ్వారులు మనకు అనుగ్రహించడం. నాలుగు ప్రబంధములు; తిరువిరుత్తం, తిరువాసిరియమ్, పెరియ తిరువందాది మరియు తిరువాయ్ మొళి; అవి వరుసగా ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం మరియు సామవేదం యొక్క సారాంశం. శ్రీమన్నాథమునులతో మొదలుకొని మన పూర్వాచార్యులను అనుగ్రహించడం నమ్మాళ్వార్లు చేసిన రెండవ గొప్ప ఉపకారం. నమ్మాళ్వార్ల యొక్క గొప్ప అనుగ్రహం కారణంగా వారు అద్భుతమైన, గొప్ప ఆచార్యులు అయ్యారు. అందుచేత శ్రీమన్నాథమునులతో మొదలుకొని ఆచార్యులందరూ నమ్మాళ్వార్ల (శఠకోప స్వామి)ని చాలా ఉన్నత స్థానంలో ఉంచారు.

నమ్మాళ్వార్లు కేవలం భగవంతుని అనుగ్రహం వల్లే ఆళ్వార్లుగా మారారు. అనేక జన్మలలో తిరుగుతూ, ఈ సంసారంలో బాధపడుతున్న జీవాత్మలలో వారు కూడా ఒకరు. భగవానుడు తన నిష్కారణ కరుణతో నమ్మాళ్వార్లును ఎంపిక చేసుకుని, ఆయనకు ‘మయర్వఱ మదినలం’ (పరిశుద్ధమైన, స్పష్టమైన జ్ఞానం మరియు భక్తి) ప్రసాదించారు. అటువంటి నమ్మాళ్వార్ల యొక్క దివ్య నామాలను మనమందరం తెలుసుకోవాలి, కీర్తించాలి.

నమ్మాళ్వార్ల జన్మస్థలమైన తిరుక్కురుగూరులో, కోవెలలో, ఒక ప్రదర్శన బోర్డుపై, నమ్మాళ్వార్ల యొక్క 32 దివ్య నామములు దర్శించవచ్చును. వారి దివ్య నామాలు మరియు వాటి అర్థాలను ఇకపై చూద్దాం.

మూలం: https://www.youtube.com/shorts/5_S0_6YT-cM

పూర్తి ప్లేలిస్ట్: https://www.youtube.com/playlist?list=PLcJLpGJlP9mrfsv5if9t3WpxR9FHvMMru

ఆంగ్లంలో: https://granthams.koyil.org/nammazhwars-divine-names-english/

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment