నమ్మాళ్వారుల దివ్య నామములు – శఠకోపన్, తొండర్ పిఱాన్ 

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి ధారావాహిక

మునుపటి

1. శఠకోపన్

శఠకోప అనేది సంస్కృత నామం.

ఈ నామము నమ్మాళ్వారులకి అత్యంత ఇష్టమైన పేరు. దీనిని ఆళ్వారులే స్వయంగా వారి దివ్య ప్రబంధాలలో చాలాసార్లు ప్రస్తావించారు.ఈ నామము యొక్క గొప్పతనం ఏమిటంటే, శఠకోప అనే పేరు వినబడినప్పుడల్లా, ఆళ్వార్లు జన్మించిన దక్షిణ దిక్కు వైపుకు తిరిగి మనం అంజలి ఘటిస్తాము.అదే ఈ నామములోని గొప్ప వైశిష్ట్యం.

‘శఠకోప’ అంటే ‘శఠం’ పట్ల కోపం చూపినవారు అని అర్థం. ‘శఠం’ అనేది ఒక రకమైన వాయువు; ఇది పుట్టిన శిశువును ఆవరించి, అజ్ఞానాన్ని కలిగిస్తుంది.

నమ్మాళ్వార్లు జన్మించినప్పుడు ఆ శఠం (వాయువు) వారిని ఆవరించడానికి ప్రయత్నించగా, ఆళ్వార్లు కోపంతో దానిని తన్ని బయటకు పంపారు. అందుకే నమ్మాళ్వార్లు ‘శఠకోప’ అని పిలవబడ్డారు. ఇది నమ్మాళ్వార్ల యొక్క ప్రథమ మరియు ప్రధాన నామం.


2. తొండర్ పిఱాన్

తమిళంలో ‘తొండర్’ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ‘తొండర్’ అంటే భగవానుని యొక్క  ప్రియ భక్తులు అని ఒక అర్థం; అలాగే, లౌకిక విషయాలలో నిమగ్నమైనవారు అని మరొక అర్థం. నమ్మాళ్వార్ భగవద్భక్తులకూ, లౌకిక జీవనంలో ఉన్నవారికి కూడా తన అనుగ్రహాన్ని ప్రసాదించారు. అందుకే ఆయనను ‘పిఱాన్’ అని పిలుస్తారు.

పిఱాన్ అంటే ఉపకారం చేసే శ్రేయోభిలాషి అని అర్థం. నమ్మాళ్వార్లు భక్తులతో పాటు భౌతికవాదులను కూడా ఆదరించారు. ఆళ్వార్లు స్వయంగా తిరువాయ్‌మొళి 9.4.9 లో “తొండర్కముదుణ్ణాచ్ చోల్ మాలైగళ్ సొన్నేన్” అని చెప్పారు – నేను ఈ దివ్య ప్రబంధాలను ప్రియమైన భక్తులకు అమృతంలాగా చెప్పాను.

ఈ విధంగా,ఆయన భాగవతులకు (భక్తులకు) అమృతం లాంటి అద్భుతమైన దివ్య ప్రబంధాలను ప్రసాదించి వారిని అనుగ్రహించారు.మరోవైపు, భౌతికవాదులకు, తమ ప్రబంధాల ద్వారా, భగవానుని గురించి గొప్ప జ్ఞానాన్ని అందించారు. ఈ విధంగా, ఆళ్వార్లు భౌతికవాదులకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు.

అనేక భౌతికవాదులు ఆళ్వార్ల ప్రబంధాలను విని సరిదిద్దుకొని, సంస్కరించబడ్డారు. అంతేకాకుండా, తిరువాయ్‌మొళి 8.10.11 లో చెప్పినట్లుగా ‘తొండర్ తొండర్ తొండన్ శఠకోపన్’ అని వారే తమ స్వభావాన్ని తెలియజేసుకున్నారు. అంటే, ఆళ్వార్లు భగవానుని దాసుల యొక్క దాసుల యొక్క దాసుడు. వారు తమను తాము అత్యంత వినమ్రతతో,అందరికంటే కింద  స్థాయిలో ఉంచుకుంటారు. ఇది ఆయన భాగవత శేషత్వాన్ని (భాగవతులకు దాసునిగా ఉండటాన్ని) అనే గుణాన్ని చూపిస్తుంది

ఈ విధంగా, భగవంతునికి దాసుడిగా ఉండటంలోని మొదటి స్థాయిని అర్థం చేసుకోవడానికి ఆళ్వార్లు సహాయపడతారు. అలాగే, భాగవతులకు (భక్తులకు) దాసుడిగా ఉండటంలోని అత్యున్నత స్థాయిని కూడా ఆళ్వార్లు ఆచరించి నిరూపిస్తారు.

అందువల్ల ఆళ్వార్లు తొండర్ పిఱాన్, అనగా భక్తులకు, అందరికీ మేలు చేసేవారు.

వీడియోలింక్ : https://www.youtube.com/shorts/QWIhyqt_SdM

ఆంగ్లంలో : https://granthams.koyil.org/2026/06/18/nammazhwars-divine-names-satakopan-thondar-piran-english/

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – దాసరి శ్రీ తేజ రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment