శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
9. వకుళాభరణ
వకుళాభరణ అనేది సంస్కృత నామం. వకుళ అనేది ఒక పువ్వు. తమిళంలో, దీనిని మగిళమ్ అని పిలుస్తారు.
ఆళ్వార్లు ఎల్లప్పుడూ ఈ వకుళ మాలని ధరించి ఉంటారు కాబట్టి వకుళాభరణులు అని పిలువబడ్డారు. ఆ మాలయే ఆళ్వార్లకి ఆభరణం.
పరాంకుశాష్టకంలో “వకుళాభరణం వందే జగదాభరణం మునిమ్” అని ఆళ్వార్లు కీర్తించబడ్డారు.ఈ శ్లోకం యొక్క అర్థం: “వకుళ మాలను ధరించినవారు, వకుళ మాలలతో అలంకరించబడినవారు మరియు సమస్త జగత్తుకే ఒక ఆభరణం వంటివారు అయిన ‘వకుళాభరణుడిని’ నేను ఆరాధిస్తున్నాను.” అటువంటి ఆళ్వారును నేను ఆరాధిస్తున్నాను.
శ్రీమాన్నారాయణునికి తులసి మాల లేదా వనమాల అనేది ఎలా ఒక ముఖ్యమైన గుర్తింపో, అలాగే నమ్మాళ్వార్లకి వకుళ మాల కూడా ఒక ముఖ్యమైన గుర్తింపు.తిరువాయ్మొళి 4.10 దశకం “ఒన్ఱుమ్ దేవుమ్” లోని చివరి పాశురంలో, ఆళ్వార్లు తమను తాము ఈ మాలతో అలంకరించుకున్నట్లు ఇలా పేర్కొన్నారు: “ఆట్చెయ్దు ఆళిప్ పిరానైచ్ చేర్న్దవన్ వణ్ కురుగూర్ నగరాన్ | నాట్కమళ్ మగిళ్ మాలై మార్బినన్ మాఱన్ శఠకోపన్“. ఇక్కడ “మగిళ్ మాలై” అంటే వకుళ మాల (పొగడ పూల దండ). ‘మగిళ్ మాలై మార్బినన్’ అంటే ఆళ్వార్ల యొక్క దివ్య వక్షస్థలం వకుళ మాలతో అలంకరించబడి ఉందని అర్థం, అందుకే ఆళ్వార్లకు “వకుళాభరణ” అనే పేరు వచ్చింది.
10. వకుళ భూషణ భాస్కర
‘భాస్కర’ అంటే సూర్యుడు అని అర్థం. సూర్యుడు బాహ్య అంధకారాన్ని (బయటి చీకటిని) తొలగిస్తాడు; అలాగే ఆళ్వార్లు అంతర్గత అంధకారాన్ని, అంటే అజ్ఞానాన్ని తొలగిస్తారు.
ఆళ్వార్లు ‘వకుళ మాల’తో అలంకరించబడి ఉన్నారు. ‘వకుళ భూషణ భాస్కర’ అనే పదబంధం ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఇందులో ‘వకుళ’ అంటే వకుళ మాల అని, ‘భూషణ’ అంటే ఆభరణం అని అర్థం. ‘ఆభరణం’ లాగే ‘భూషణం’ కూడా అలంకార వస్తువునే సూచిస్తుంది.
ఈ విధంగా, ఆళ్వార్లు మన అజ్ఞానాన్ని తొలగిస్తారు మరియు అటువంటి ఆళ్వార్లు వకుళ మాలను ధరించి ఉంటారు.
వీడియోలింక్: https://www.youtube.com/shorts/4Gn7bRKLv6o
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org