శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
7. పరాంకుశ
అంకుశ అంటే ఏనుగును నియంత్రించే గాలం. మావటివాడు పెద్ద ఏనుగులను నియంత్రించడానికి గాలాన్ని ఉపయోగిస్తాడు.అలాగే నమ్మాళ్వార్ అంటే ఇతర తత్వాల వారిని నియంత్రించినవారు.
కొన్ని తత్వాలు వేదానికి వ్యతిరేకంగా ఉన్నాయి, మరికొన్ని వేదాన్ని తప్పుగా అన్వయించాయి. అటువంటి తత్వాలను ప్రచారం చేస్తున్న వ్యక్తులను నమ్మాళ్వార్లు నియంత్రించి, ఓడించారు. అందుకే ఆళ్వార్లను పరాంకుశ అని పిలుస్తారు.
పరాంకుశ అనే పేరుకు మరో వివరణ ఏమిటంటే, ‘పర’ అంటే భగవానుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. పరాంకుశ అంటే తమ ఆప్యాయమైన, ప్రేమపూర్వకమైన పాశురాలతో, దివ్యప్రబంధంతో భగవానుడిని నియంత్రించినవారు. నమ్మాళ్వార్లు భగవానుడిని మాయ చేసి, తమ అదుపులో ఉంచుకున్నారు. అందుకే ఆళ్వార్లను పరాంకుశ అని పిలుస్తారు.
కాబట్టి, పరాంకుశ అనే పేరుకు ఇవి రెండు వివరణలు. ఒకరు ఇతర తత్వవేత్తలను నియంత్రించిన నమ్మాళ్వార్. రెండవది, స్వయంగా భగవానుడినే నియంత్రించిన నమ్మాళ్వార్.
8. ఉదయభాస్కర
‘భాస్కర’ అంటే సూర్యుడు అని అర్థం. సాధారణంగా సూర్యుడు చీకటిని తొలగిస్తాడు.
నమ్మాళ్వార్లు ప్రజల మనస్సులలోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తారు. ‘ఉదయభాస్కర’ అంటే ఉదయించే సూర్యుడు, అంటే వేకువజామున కనిపించే సూర్యుడు అని అర్థం.
ఉదయించే సూర్యుని ప్రత్యేకత ఏమిటంటే, అప్పుడు వేడి ఎక్కువగా ఉండదు. అలాగే, నమ్మాళ్వార్లు మన అజ్ఞానాన్ని తొలగించేటప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా మరియు మృదువుగా వ్యవహరిస్తారు. అందుకే ఆళ్వార్లను ‘ఉదయభాస్కర’ అని పిలుస్తారు.
కేవలం బాహ్య చీకటిని మాత్రమే తొలగించే సాధారణ సూర్యునిలా కాకుండా, నమ్మాళ్వార్లు అంతర్గత చీకటిని – అంటే తొలగించడానికి అత్యంత కష్టమైన అజ్ఞానాన్ని – తొలగిస్తారు. అందుకే ఆళ్వార్లు ‘ఉదయభాస్కర’ అని పిలువబఢతారు..
వీడియోలింక్: https://www.youtube.com/shorts/VZr6IUm72xA
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/07/nammazhwars-divine-names-parankusa-udhayabhaskara/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org