నమ్మాళ్వారుల దివ్య నామములు – కుళందై ముని, జ్ఞాన దేశికన్

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి ధారావాహిక

<< మునుపటి

27. కుళందై ముని

కుళందై అంటే శిశువు. ముని అంటే మనన శీలుడు (నిరంతరం ధ్యానం చేసేవాడు). ఆళ్వార్లు ఎల్లప్పుడూ భగవాన్ శ్రీమన్నారాయణుని స్వరూపం, రూపం, గుణాలు, విభూతి, ఆయన లీలలు మరియు అటువంటి అనేక అంశలను ధ్యానిస్తూ ఉంటారు.

కుళందై ముని అనగా, అతను పుట్టిన క్షణం నుండే భగవాన్ శ్రీమన్నారాయణుని ధ్యానించడం ప్రారంభించాడని సూచిస్తుంది. శ్రీ రామాయణంలోని “బాల్యాత్ ప్రభృతి సు స్నిగ్ధః” అనే శ్లోకం, లక్ష్మణుడు పసిపిల్లవాని దశ నుండే శ్రీరాముని పట్ల భక్తితో ఉంటూ, ఆయనను ధ్యానిస్తూ ఉండేవాడని సూచిస్తుంది. లక్ష్మణునికి పుట్టినప్పటి నుండే శ్రీరాముని పట్ల గొప్ప అనురాగం ఉండేది.

తమిళంలో, “తిరుత్తుళాయ్ అన్కురిక్కుమ్బోదే పరిమళత్తోడే అన్కురిక్కుమ్” అని అంటారు, (తుళసి మొలకెత్తినప్పుడు ఎలాగైతే సువాసన వెదజల్లుతుందో, అలాగే). అదే విధంగా, ఆళ్వార్లు పుట్టిన క్షణం నుండి ఎల్లప్పుడూ భగవానుని ధ్యానిస్తూ ఉండేవారు.

28. జ్ఞాన దేశికన్

దేశికన్ అంటే గురువు లేదా, మార్గదర్శకుడు అని అర్థం. ఇది ఆచార్యలు లేదా గురువుకు పర్యాయపదం. ఆళ్వార్లు జ్ఞాన దేశికన్, జ్ఞానాన్ని అందించే ఆచార్యలు. జ్ఞానము అర్థ పంచక జ్ఞానమును సూచిస్తుంది: జీవాత్మ స్వరూపం (వ్యక్తిగత ఆత్మ యొక్క స్వభావం), పరమాత్మ స్వరూపం (భగవాన్ శ్రీమాన్నారాయణుని స్వభావం), ఉపాయ స్వరూపం (భగవానుని లక్ష్యాన్ని చేరుకునే సాధనం) మరియు విరోధి స్వరూపం (భగవానుని చేరుకోకుండా అడ్డంకులు). ప్రతి శ్రీవైష్ణవుడు తప్పక అర్థం చేసుకోవలసిన ఐదు సూత్రాలు ఇవి. కనీసం ఈ ఐదు సూత్రాలైనా తెలుసుకోవాలి. అర్థ పంచక జ్ఞానము లేకుండా, శ్రీవైష్ణవుడిగా ఉండటం వల్ల అసలు ప్రయోజనం ఉండదు. ఈ అర్థ పంచక జ్ఞానాన్ని మనకు నమ్మాళ్వార్లు (శఠకోప స్వామి) ప్రసాదించారు.

వీడియోలింక్:  https://youtube.com/shorts/ZQWOA3ZuBLc?si=tR32I2emXXXh3X-8

ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/23/nammazhwars-divine-names-kuzhandhai-muni-gyana-dhesikan/   

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment