శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
జ్ఞానపూర్ణమైన భక్తి అనుగ్రహించబడ్డ ఆళ్వార్లు మరియు భూమి దేవి అవతారమైన ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణావతారాన్ని కీర్తిస్తూ “ఆట్కొళ్ళత్తోన్ఱియ ఆయర్ తం కోవినై” (మనను స్వీకరించటానికి యాదవ రాజుగా అవతరించిన వాడు), “పిరన్దవారుమ్” (వారి అద్భుతమైన అవతారం), మణ్ణిన్ భారం నీక్కుదఱ్కై వడమధురై పిఱన్దాన్” (భూ భారాన్ని తొలగించటానికి ఉత్తర మథురలో కృష్ణుడు అవతరించారు) మరియు “ఒరుత్తి మగనాయ్ పిఱన్దు” (గొప్పనైన దేవకీ దేవి యొక్క పుత్రుడిగా అవతరించిన వాడు).
మనం ముందు చూసుకున్న విధముగా భగవానుడు కృప మాత్రము చేత అవతరిస్తారు. ఎలాగైతే పిల్లవాడు బావిలో దూకితే వాడి వెనకాలే తల్లి దూకుతుందో, భగవానుడే స్వయముగా సంసారములో పడి కష్టపడుతున్న ఆత్మలను విడిపించటానికి అవతరిస్తారు. అలా చేసే క్రమంలో, వారు ఇక్కడ ప్రజల హృదయాన్ని ఆకట్టుకోవటానికి మరియు వారిని దాసులుగా స్వీకరించటానికి కొన్ని లీలలు ప్రదర్శించారు. వారి అవతారాలు మరియు లీలల వైభవం:
- మనం భగవానుడే స్వయంగా ఈ లోకంలో అవతరించారు అని తెలుసుకుంటే మనకు ఇంకా జన్మలు ఉండవు.
- మనం భగవానుడే ఇక్కడ అవతరించారు మరియు తల్లి పాలు స్వీకరించారు అని తెలుసుకుంటే, మనం ఇక్కడ పుట్టి తల్లి పాలు తాగే అగత్యం పట్టదు.
- మనం తాను వెన్న దొంగతనం చేసి రోకలికి కట్టబడి, శిక్షించబడి ఏడ్చాడు అని తెలుసుకుంటే, మనం సంసారంలో బంధించబడము.
ద్వాపర యుగం చివర్లో, కంసుడు జరాసంధుడు మొదలైన దుష్టులు పెరిగినప్పుడు, బ్రహ్మాది దేవతలు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు నివసించే క్షీరాబ్ధికి వెళ్లి, శ్రీమన్నారాయణుడిని ఇలా ప్రార్థించారు, “దేవదేవోత్తమా, ఈ లోకంలో సాధువులని రక్షించటానికి, దుష్టులని సంహరించి ధర్మ స్థాపనార్థం అవతరించాలి”, అప్పుడు శ్రీమన్నారాయణుడు, “నేను సమయం వచ్చినప్పుడు అవతరిస్తాను” అని చెప్పి వారలను పంపించారు.
దేవకీ వాసుదేవులు, ముందు జన్మలలో, భగవానుడు వారి కుమారుడిగా కావాలని ప్రార్ధించారు. కావున భగవానుడు వారి కుమారుడిగా అవతరిస్తాను అని నిశ్చయించుకున్నాడు. కంసుడి సోదరి అయిన, దేవకీ మరియు వసుదేవుడికి వైభవంగా కల్యాణం అయ్యింది, కంసుడు నూతన వధూవరులను రథంలో నగర వీధులలో ఊరేగిస్తుండగా. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా వినిపించింది “ఓ కంసా! దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదవ సంతానం వల్ల నీకు మరణం కలుగుతుంది”. ఇది విన్న కంసుడు చాలా వ్యాకులుడు అయ్యి, వారి ఇరువురిని ఖడ్గం చేత చంపడానికి చెయ్యి ఎత్తగా. సమయానికి వసుదేవుడు ఇలా ప్రార్థించాడు. “ఓ కంసా! నీకు మేము ఎటువంటి అసౌకర్యం కలిగించము. మేము మా సంతానాన్ని అంతటినీ నీకు అప్పగిస్తాము”. అది అంగీకరించిన కంసుడు వారిని విడిచిపెట్టాడు.
అటుపిమ్మట, కంసుడు వారిద్దరినీ చెరసాలలో ఉంచాడు. అలా దేవకీకి పుట్టుతున్న ఒక్కో సంతానాన్ని కంసుడు చంపేశాడు. అలా ఏడో సంతానమైన, బలరాముడు (స్వామి యొక్క అంశావతారం మరియు ఆదిశేషుడి పూర్ణ అవతారం), దేవకీ గర్భాన్ని ప్రవేశించాడు, కానీ భగవానుడు ఆ శిశువుని వసుదేవుడి ఇంకో భార్యయైన రోహిణీ గర్భాం లోనికి మార్చారు. ఆ సమయంలో రోహిణి వసుదేవులకు సన్నిహితుడైన నందగోపుడి ఊరు గోకులంలో బలరాముడు అవతరించాడు..
అష్టమ సంతానంగా, దేవదేవుడు దేవకీ గర్భములోకి ప్రవేశించెను, శ్రీకృష్ణుడుగా, ఆవని (శ్రావణ) మాసం, రోహిణి నక్షత్రం, అష్టమి తిథి నాడు (ఉత్తర) మధుర నగరం లో అర్ధరాత్రిన అవతరించారు, అవతరించినప్పుడు స్వయంగా విష్ణు స్వరూపంగా చతుర్భుజములతో శంఖ చక్రాలతో అవతరించారు. అది చూసిన దేవకీ వసుదేవులకు ఆనందము, ఆశ్చర్యము కలిగెను. అదే సమయములో కృష్ణుడి క్షేమం పట్ల చింత కలిగెను. వారు స్వామిని, చతుర్భుజ రూపం త్యజించి ద్విభుజ మానవ రూపం స్వీకరించాలని ప్రార్ధించెను, అది స్వామి స్వీకరించెను. అటుపిమ్మట, శ్రీకృష్ణుడి కృపచేత, వసుదేవుడి సంకెళ్ళు తెగాయి; రక్షక భటులు మూర్ఛిల్లారు; ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామి వసుదేవుడితో ఇలా అనేను, “నన్ను యమునా నది అవతలి పక్కన ఉన్న గోకులంలోని యశోద-నందగోపుడి భవనంలో విడిచిపెట్టి, అక్కడ వారికి పుట్టిన ఆడ శిశువుని తీసుకురండి!”. వసుదేవుడు, శ్రీకృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకొని బయలుదేరెను. యమునా నది తీరం చేరెను. అక్కడ భారీ వర్షం వల్ల నదిలో వరద చూసి చింతించగా, భగవానుడి కృపచేత, యమునా నది రెండుగా చీలి దారి ఇచ్చేను; ఆది శేషుడు గొడుగుగా మారి వెంట రాగా, వసుదేవుడు యమునా నది దాటి నందగోపుడి భవనం చేరెను. ఆ సమయంలో, యశోద దేవి యోగమాయకు జన్మనిచ్చెను. శ్రీకృష్ణుడిని అక్కడ పెట్టి ఆ ఆడ శిశువుని తీసుకొని శీఘ్రంగా తిరిగి వచ్చారు. ఆ కారాగృహంలోకి వెళ్ళిన తక్షణమే అంతా ముందులాగా అయిపోయింది. దేవకీ వసుదేవుడు ఇరువురు ఈ విషయం మరిచిపోయారు, శిశువు ఏడుపులు విని భటులు అష్టమ సంతానం గురించి తెలుపగా. కంసుడు వెంటనే అక్కడికి చేరి, శిశువుని గాలిలోకి లేపి “నేను దీన్ని చంపి, అపాయం తొలగించుకుంటాను” అనగానే, ఆ శిశువు గాలిలోకి వెళ్లి, దుర్గా రూపములో ఇలా అనేను “నిన్ని సంహరించే వాడు అవతరించారు, భద్రముగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు వచ్చి తప్పకుండా నిన్ను సంహరిస్తాడు” అని అదృశ్యం అయ్యింది. కంసుడు ఆగ్రహంతో భటులను అన్ని దిక్కులలో నవజాత శిశువులను వెతకటానికి పంపించెను.
ఇప్పుడు గోకులంలో గోప జనులందరూ యశోదమ్మకు ఒక అందమైన పిల్లవాడు పుట్టాడని తెలిసి, చాలా సంతోషముగా ఆతని జననముని కొనియాడారు.
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
మూలము: https://granthams.koyil.org/2023/08/22/krishna-leela-1-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org