శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
కృష్ణుడికి అయిదు సంవత్సరాలు వయసులో, గోప బాలురతో చేరి అడవుల్లోకి వెళ్లి, గోవులు కాస్తున్న సమయంలో, బృందావనంలోని పచ్చని పొలాలు దాటి, అడవులల్లో సంతోషముగా ఆడుతూ పాడుతూ, తిరిగి ఇల్లు చేరే వారు, యశోధమ్మ మరియు ఇతర గోపస్త్రీలు వారికి పెరుగన్నం, పచ్చళ్లు, ఇతర ప్రసాదాలు ఇచ్చి పంపేవారు. మధ్యానం, పిల్లలు అందరూ కృష్ణుడి చుట్టూ చేరి ప్రసాదాన్ని తీసుకునే వారు.
ఒకసారి వారు, ఇలానే అడవిలోకీ వెళ్లగా, దుష్టబుద్ధి కలిగిన అఘాసురుడు, అనే ఒక అసురుడు కంసుడు పంపగా ఆ అడవికి చేరాడు. ఇతను పూతన మరియు బకాసురుడి సోదరుడు, ఇద్దరు కృష్ణుడి చేతిలో హతమైన కరణం చేత, కృష్ణుడి పైన పగ పెంచుకున్నాడు. అతను ఒక్క పెద్ద పాము ఆకారంగా మారి నోటిని తెరుచుకుని ఈ గోప బాలకులు వచ్చే మార్గంలో ఉన్నాడు. వారికి అది ఒక గుహ, ప్రవేశ ద్వారంగా కనిపించింది. కావున ఆ గోప బాలకులు అందరూ దానిలోన చేరి ఆడుకో సాగారు. ఇది అంతా గమనించిన కృష్ణుడు బయటనే ఉండి చూడ సాగాడు. కానీ ఈ అఘాసురుడు కృష్ణుడు ప్రవేశించగానే అందరినీ కలిపి హతమార్చాలి అని సంకల్పించాడు.
చివరిగా, కృష్ణుడు ప్రవేశించగానే, వెంటనే అఘాసురుడు నోటిని మూసివేశాడు. అందరూ ఊపిరాడక మూర్ఛపోయారు. కృష్ణుడు మాత్రం జాగరూకంతో, అఘాసురుణ్ణి సంహరించే మార్గం ఆలోచించి. తన రూపాన్ని నెమ్మదిగా పెంచసాగాడు. ఆ శక్తిని తట్టుకోలేక, అఘాసురుడు ఇబ్బంది పడ్డాడు. అంతలో, కృష్ణుడు తన పిడికిలితో ఒక్కసారి ఆ పాము తలలో గుద్దగా, అతని తల రెండు ముక్కలు అయ్యి. అక్కడే పది మరణించాడు. కృష్ణుడి కటాక్ష వీక్షణంతో బాలకులు అందరు స్పృహలోకి వచ్చారు.
ఈ సంఘటనలోని సారాంశం:
- ఎవరికైతే భగవానుడి అనుగ్రహం ఉంటుందో, వారు అన్ని ప్రమాదాలను తప్పించుకోగలడు.
- భగవానుడు ఎప్పుడు తన భక్తులను ఆపదల నుండి రక్షించటానికి సిద్ధంగా ఉంటాడు.
మూలం : https://granthams.koyil.org/2023/09/07/krishna-leela-11-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org