కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 35 – శమంతకమణి లీల, జాంబవతి మరియు సత్యభామా కళ్యాణం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 34 – రుక్మిణి కళ్యాణం

సత్రాజిత్తు అనే రాజు సూర్యునికి గొప్ప భక్తుడు. అతని భక్తిని అభినందించి సూర్యుడు అతనికి శమంతకమణిని ప్రసాదించాడు. ఆ మణి అతి ప్రకాశవంతమైనది, గొప్ప ధనసంపదను ప్రసాదిస్తుంది. సత్రాజిత్తు దానిని హారంలో ధరించి సుఖంగా జీవించాడు.

ఒకసారి అతడు ద్వారకకు వచ్చాడు. ఆ మణి ధరించి అతడు ప్రకాశిస్తూ కనిపించాడు. అక్కడ తన నివాసంలోని ఆలయంలో ఆ మణిని ఉంచి అందరికీ చూపించాడు. ఆ మణిని చూసి కృష్ణుడు సత్రాజిత్తును ఉగ్రసేనునికి అర్పించమని కోరాడు. కానీ సత్రాజిత్తు నిరాకరించాడు.

ఒకసారి సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. సింహం అతన్ని చంపి మణిని తీసుకుంది. ఆ సింహం రామభక్తుడైన జాంబవంతుడు గుహలోకి వెళ్ళింది. జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకున్నాడు.

ఇక్కడ ద్వారకలో సత్రాజిత్తు తన సోదరుడు కనపడనందున, కృష్ణుడే చంపి మణిని తీసుకున్నాడని అనుకుని అందరితో చెప్పడం మొదలుపెట్టాడు. దానిని విని కృష్ణుడు తనపై పడిన అపవాదాన్ని తొలగించాలని అడవికి వెళ్లాడు. అక్కడ ప్రసేనుని శవాన్ని చూశాడు. సింహపాదాల గుర్తులు కనిపించి జాంబవంతుడి గుహకు చేరుకున్నాడు. అక్కడ జాంబవతి ఆ మణితో ఆడుకుంటున్నట్టు చూశాడు. దాన్ని తీసుకోవాలని ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దాన్ని విని జాంబవంతుడు వచ్చి కృష్ణునితో తలపడ్డాడు. 28 రోజుల పాటు పోరాటం సాగింది. చివరికి భగవాన్ స్వరూపాన్ని ప్రకటించగా జాంబవంతుడు క్షమాపణ కోరి మణిని అర్పించాడు. అంతేకాక, తన కూతురు జాంబవతిని కృష్ణునికి ఇచ్చాడు.

అప్పుడు కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి సత్రాజిత్తుకు జరిగిన సంఘటనలు చెప్పి మణిని అప్పగించాడు. తప్పు తెలిసుకొని సత్రాజిత్తు క్షమాపణ కోరి తన కూతురు సత్యభామను కృష్ణునికి ఇచ్చాడు. సత్యభామ భూమిప్పిరాటి అవతారమే. కృష్ణుడు సత్యభామను కూడా వివాహం చేసుకున్నాడు.

అప్పుడు పంచపాండవులు లాక్షగృహంలో కాలిపోయారనే వార్త విని కృష్ణుడు బలరామునితో హస్తినాపురానికి వెళ్ళాడు. అప్పుడు కృతవర్మ, అక్రూరుల ప్రేరణతో శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణిని తీసుకున్నాడు. ఆ విషయం తెలిసి సత్యభామ చాలా విచారపడి హస్తినాపురానికి వచ్చి కృష్ణునికి తెలిపింది. కృష్ణుడు వెంటనే తిరిగి వచ్చి సథధన్వాను చంపాడు. కానీ అతడు మణిని అక్రూరునికి ఇచ్చాడు. దానిని తెలుసుకుని కృష్ణుడు అక్రూరుని ద్వారకకు పిలిచి మణిని చూపమని కోరి, దాన్ని అక్రూరునికి ఇచ్చి అతడితో ఉంచమని చెప్పాడు.

నమ్మాళ్వార్ తిరువాయ్ మొళి పాశురాలు “మణిసరుమ్ మఱ్ఱుమ్ ముఱ్ఱుమాయ్” మరియు “వీఱ్ఱిరుందు ఏళ్ ఉలగం”కు. నంపిళ్ళై వ్యాఖ్యానంలో, భగవంతుడు ఈ లోకంలో అతని అవతారాల్లో అవమానాలు అనుభవించినా, ఆత్మలకు సహాయం చేయడానికి అవతరిస్తాడు, “శమంతకమణి చోరుడు” అని చెప్పినట్టు.

ఈ సంఘటనలోని సారాంశం:

  • భగవంతుడు, జాంబవతి, సత్యభామ పిరాట్టులను వివాహం చేసుకోవడానికి ఈ అద్భుత లీలలు చేశాడు.
  • ఈ లోకంలో అతన్ని తెలుసుకోకుండా చాలా మంది అవమానిస్తారు. అట్టి అవమానాలు స్వీకరించినప్పటికీ, భక్తులకు సహాయం చేయడానికి మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/11/krishna-leela-35-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment