కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 37 – ఖాండవ వన దహనం, ఇంద్రప్రస్థ నిర్మాణం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 36 – ప్రద్యుమ్నుడి జననం మరియు చరితం

పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వచ్చినట్టు విని, కృష్ణుడు సాత్యకి మరియు ఇతర యాదవులతో కలిసి ఇంద్రప్రస్థానికి వారిని చూడటానికి వచ్చాడు. పాండవులను చూసి కృష్ణుడు అత్యంత ఆనందించాడు. వారితో ప్రేమగా మాట్లాడాడు. వారి భార్య ద్రౌపది కృష్ణునికి నమస్కారం చేసి ఆనందించింది. కృష్ణుడు తన మేనత్త కుంతికి నమస్కరించి, ద్రౌపదిని కుశల ప్రశ్నలు అడిగాడు. ఆమె కృష్ణుని గొప్ప భక్తురాలు. ఆమె తమ అన్ని కష్టాలను కృష్ణునికి వివరించి, ఆయన కృపయే తమకు ఇప్పుడు సాధారణ స్థితిని తిరిగి తెచ్చింది అని చెప్పింది.

ఈ ఇంద్రప్రస్థం పాండవులకు కృష్ణుని కృపతో నిర్మించబడింది. దీని చరిత్రను ఇప్పుడు చూద్దాం.

ఒకసారి కృష్ణుడు అర్జునుడితో కలిసి ఉన్నప్పుడు, అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వారి వద్దకు వచ్చి, తాను చాలా ఆకలితో ఉన్నానని అన్నాడు. వారిద్దరూ “నీకు ఎంత కావాలంటే తిను” అన్నారు. అప్పుడు ఆయన తన నిజ రూపాన్ని చూపి, ఖాండవ వనాన్ని పూర్తిగా తినాలని కోరాడు. ఈ అడవి ఇంద్రుని ఆస్తి, ఆయనకు ప్రియమైనది. కానీ అందులో చాలా చెడు జంతువులు ఉన్నాయి. కృష్ణుడు మనసులో ఆలోచించి, ఇవి భూమిపై అనవసర భారం, కాబట్టి అగ్ని దీనిని ధ్వంసం చేయాలని కోరాడు. భగవంతుడి ఆజ్ఞ ప్రకారం అగ్ని మొత్తం అడవిని తిన్నాడు. అందులో ఉన్న చాలా క్రూర జంతువులు చనిపోయాయి. ఏదైనా జంతువు బయటకు వచ్చినా, అర్జునుడు కృష్ణుడిచేత చంపబడ్డాయి. ఇంద్రుడు పెద్ద వర్షం కురిపించి అగ్నిని ఆపడానికి ప్రయత్నించాడు. అయినా అగ్నిని ఏమీ చేయలేకపోయాడు. అక్కడి నుండి తప్పించుకున్న మయుడు (రాక్షస శిల్పి) అర్జునుడి చేత కాపాడబడ్డాడు. ఆ మయుడే తర్వాత ఇంద్రప్రస్థాన్ని నిర్మించాడని చెప్పబడింది. అతను నిర్మించిన ఈ రాజభవనంలో ధుర్యోధనుడు జారి పడి, ద్రౌపది ద్వారా అవమానించబడ్డాడు. ఇది మహాభారత యుద్ధానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది. ఇక్కడి నుండి తప్పించుకున్న తక్షకుడు, కురు వంశం పట్ల ద్వేషం కారణంగా అర్జునుని మనవడు పరీక్షిత్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు.

తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళిలో ఖాండవ వన దహనాన్ని ఇలా వర్ణిస్తారు: “కాణ్డా వనమెన్బడోర్ కాడు అమరర్ క్కరైయన్ అదు కాండవన్ నిర్క మునే మూణ్డార్ అళల్ ఉణ్ణ మునిందదువుమ్” (సర్వేశ్వరుడు, దేవతల అధిపతి ఇంద్రుని దుర్బేధ్యమైన ఖాండావ వనమును, ఆయన పరియవేక్షణలో పూర్తిగా అగ్ని తినేలా తన చిరు కోపాన్ని ప్రదర్షించాడు).

ఈ సంఘటనలోని సారాంశం:

  • మన ప్రతి కార్యానికి భవిష్యత్తులో అనపేక్షిత ఫలితాలు వస్తాయి. ఖాండవ వనం దహనంలో ప్రభావితమైన తక్షకుడి వల్ల, అనేక సంవత్సరాల తర్వాత పరీక్షిత్ ప్రభావితుడయ్యాడు. ధుర్యోధనుని ద్రౌపది అవమానం మహాభారత యుద్ధానికి కారణమైంది.
  • భగవంతుడు, భూమిపై భారాన్ని తొలగించడానికి ఒకే మార్గం కాక, అనేక మార్గాలను ఉపయోగిస్తాడు.
  • భగవంతుడు, తన భక్తులైన పాండవులపై ప్రేమ కురిపించి, భక్తులపై తన గొప్ప ప్రేమను ప్రకటించాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/13/krishna-leela-37-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment