కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 36 – ప్రద్యుమ్నుడి జననం మరియు చరితం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 35 – శమంతకమణి లీల, జాంబవతి మరియు సత్యభామా కళ్యాణం

ప్రద్యుమ్నుడు కృష్ణుని, రుక్మిణి సంతానంగా జన్మించాడు. మునుపటి జన్మలో అతడు మన్మథుడు (కామదేవుడు). భగవంతుడి అంశావతారంగా కీర్తించబడ్డాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మమయ్యాడు. అతని భార్య రతి చాలా విచారపడింది. కానీ మన్మథుడు మళ్ళీ జన్మించి తనతో వివాహం చేసుకుంటాడని తెలిసి ధైర్యపడి ఉంది. ఆ మన్మథుడు ఇప్పుడు ప్రద్యుమ్నుడిగా జన్మించాడు.

శంబరాశురుడు ప్రద్యుమ్నుడిని తన శత్రువుగా భావించి, జన్మించిన కొన్ని రోజుల తర్వాత అతడిని ఎత్తుకెళ్ళి సముద్రంలో పడివేశాడు. ఒక పెద్ద చేప ప్రద్యుమ్నుడిని మింగేసింది. తర్వాత మత్స్యకారులు ఆ చేపను పట్టి శంబరాశురుడికి బహూకరించారు. అతను ఆ చేపను తన వంటకారులకు ఇచ్చాడు. వారు చేపను నరికినప్పుడు లోపల అప్పుడే పుట్టిన అందమైన ప్రద్యుమ్నుని కనుగొన్నారు. ఆ బాలుని శంబరాశురుడి దాసీ అయిన మాయావతికి ఇచ్చారు. రతి మాయావతిగా వేషం మార్చి అక్కడ ఉండేది. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి రతికి, ఈ బాలుడు ప్రద్యుమ్నుడు, ఇది మన్మథుడే మళ్లీ జన్మించాడని చెప్పాడు. అది విని మాయావతి సంతోషానికి పరిమితి లేకుండా ఉంది. ప్రద్యుమ్నుని బాగా పెంచింది. త్వరగా అతడు అందమైన యువకుడిగా ఎదిగాడు. కృష్ణునిలా అందముగా కనిపించాడు. రతి ప్రద్యుమ్నునికి సత్యాన్ని చెప్పి శంబరాశురుడిని చంపమని చెప్పింది. ప్రద్యుమ్నుడు అతనిని యుద్ధానికి పిలిచి సంహరించాడు.

అప్పుడు ఇద్దరూ ద్వారకకు వచ్చారు. ప్రద్యుమ్నుని చూసి రుక్మిణికి మాతృ వాత్సల్యం పెరిగి, ఆమె స్తనాల నుండి పాలు వెలుబడ్డాయి. కృష్ణుడు అంతా తెలిసినా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడు వచ్చి రుక్మిణికి అంతా చెప్పాడు. అందరూ సంతోషించారు.

పేయాళ్వార్లు మూన్ఱామ్ తిరువందాదిలో “మగన్ ఒరువర్క్కల్లాద మామేని మాయన్ మగనామ్ అవన్ మగన్” (ఎవరికీ కుమారుడు కాని, అద్భుతమైన కృష్ణుడు, వసుదేవుని, దేవకి సంతానంగా జన్మించాడో; ప్రద్యుమ్నుడు అతని కుమారుడిగా జన్మించెను) అని ప్రద్యుమ్నుని గురించి చెబుతారు.

ఈ సంఘటనలోని సారాంశం:

  • భగవంతుడి ప్రధాన అవతారాల మాదిరిగానే కొన్ని అంశావతారాలు కూడా ఉన్నాయి. వాటిలో మన్మథుడు మరియు అతని అవతారం ప్రద్యుమ్నుడు ఒకరు.
  • తిరిగి, వ్యూహ స్థితిలో, భగవంతుడు నాలుగు రూపాలలో ఉంటాడు – వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు. కృష్ణావతారంలో వారి ప్రతినిధులు, వరుసగా, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు (కుమారుడు), అనిరుద్ధుడు (పౌత్రుడు), బలరాముడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/13/krishna-leela-36-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment