నమ్మాళ్వారుల దివ్య నామములు – ప్రపన్న జన కూటస్థర్, పెరియన్

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి ధారావాహిక

<< మునుపటి

31. ప్రపన్న జన కూటస్థర్

ప్రపన్న అంటే ప్రపత్తి/శరణాగతి చేసినవాడు. జన అంటే ప్రజల సమూహం. ప్రపన్న జన అంటే ప్రపన్నుల సమూహం. కూటస్థర్ అంటే అగ్రగామి లేదా నాయకులు. ప్రపన్న జన కూటస్థర్ అంటే శరణాగతి/ప్రపత్తి చేసే వారందరికీ నాయకులు అని అర్థం.

తిరువాయ్మొళిని దీర్ఘ శరణాగతి అని పిలుస్తారు. తిరువాయ్మొళిలో, నమ్మాళ్వార్లు నిరంతరం శరణాగతి చేస్తారు, ముఖ్యంగా ఆరవ పత్తులో, పదవ పదిగంలో, పదవ పాశురములో తిరువాయ్మొళి 6.10.10  ఆళ్వార్లు ఇలా అంటారు, “అగలగిల్లేన్ ఇఱైయుమ్ ఎన్ఱు అలర్ మేల్ మంగై ఉఱై మార్బ నిగరిల్ పుగళాయ్ !ఉలగమ్ ఊన్ఱుడైయాయ్ !ఎన్నై ఆళ్వానే ! నిగరిల్ అమరర్ మునిక్ కణంగల్ విరుమ్బుమ్ తిరువేంగడత్తానే!పుగల్ ఒన్ఱిల్లా అడియేన్ ఉన్ అడైక్ కీళ్ అమర్న్దు పుగుందేనే ”. ఈ పాశురంలో, ఆళ్వార్లు సంపూర్ణ శరణాగతి చేస్తారు. ఆళ్వార్లు శ్రీమహాలక్ష్మిని పురుషకార భూతురాలుగా (ముందుంచే శక్తిగా) పరిగణిస్తారు, ఆళ్వార్ల స్వంత లోపాలను ఎత్తిచూపారు మరియు భగవానుని యొక్క గొప్ప లక్షణాలను ఎత్తిచూపారు. భగవానుని మించిన ఆశ్రయం మరొకటి లేదని ఆళ్వార్లు ప్రకటించారు. ఈ విధంగా, సరైన శరణాగతిని నమ్మాళ్వార్లు చేస్తారు. అందుకే, ప్రపత్తి/శరణాగతి చేసే వారందరికీ ఆయనే నాయకులు.

32. పెరియన్

పెరియన్ అంటే పెద్ద లేదా గొప్ప వ్యక్తి. పెరియ తిరువందాది 75 పాశురంలో, “పువియుమ్ ఇరువిశుమ్బుమ్ నిన్నగత్త నీయెన్ సెవియిన్ వళిపుగున్దు ఎన్నుళ్లాయ్ అవివిన్ఱి యాన్ పెరియన్ నీ పెరియై ఎన్బదనై ఆర్ అఱివార్ ఊన్ పరుగు నేమియాయ్ ఉళ్లు, “ నేను గొప్పవాడో నువ్వు గొప్పవాడో అనేది ఎవరికి తెలుస్తుంది? ”. ఈ పాశురంలో ఆళ్వార్లు “యాన్ పెరియన్” (నేనే గొప్పవాడిని) అని పేర్కొంటారు.ఆళ్వార్లు తమను తాము గొప్పవాడిగా చెప్పుకుంటారు కాబట్టి, ఆయనను పెరియన్ అని పిలుస్తారు. బ్రహ్మోత్సవం సమయంలో, అనేక దివ్యదేశాలలో ప్రణయ కలహ ఉత్సవం నిర్వహిస్తారు. ప్రణయ కలహం అనేది భగవానుని మరియు వారి భార్యల (శ్రీదేవి, భూదేవి) మధ్య జరిగే ప్రేమపూర్వకమైన కలహము. ఈ ఉత్సవంలో తాయార్లు భగవానుని బయటకు తరిమివేస్తారు మరియు ఆలయం లోపలికి రానివ్వరు. ఆ సమయంలో, నమ్మాళ్వార్లు వచ్చి భగవానుని మరియు అతని తాయార్ల మధ్య మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరిస్తారు. చివరికి, భగవానుని యొక్క తాయార్లు పెరియన్ (నమ్మాళ్వార్) కొరకు, తాము భగవానుని అంగీకరిస్తామని ప్రకటించారు. ప్రణయ కలహం ఉత్సవం సందర్భంగా నమ్మాళ్వార్లు గొప్పతనం చూపబడుతుంది, అందుకే ఆళ్వార్లను పెరియన్ అని పిలుస్తారు.

వీడియోలింక్:  https://youtube.com/shorts/TbNo41BV3QA?si=rwoJXLvcojLZCmwk 

ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/25/nammazhwars-divine-names-prapanna-jana-kutasthar-periyan/     

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment